కడప

మిస్సింగ్, కిడ్నాప్ కేసులపై శ్రద్ధపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 25: జిల్లాలో మిస్సింగ్, కిడ్నాప్ కేసులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని , నమోదైన కేసులను పరిష్కరించడంలో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని, ఈ కేసులను త్వరగా కొలిక్కితేవాలని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మంగళవారం జిల్లాపోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఆయన సుదీర్ఘంగా కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరం, ప్రొద్దుటూరు పట్టణాల్లో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల వల్ల నేరాల శాతం తగ్గుముఖం పట్టిందని, అయినా చాలా కిడ్నాప్ కేసులు, మిస్సింగ్ కేసులు అలాగే ఉన్నాయని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు సత్ఫలితాలు ఇస్తోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. భవిష్యత్‌లో నేరాలు మరింత తగ్గవచ్చునని ఆయన ఆకాంక్షించారు. ఒక వేళ నేరాలు జరిగినా వెనువెంటనే వాటి పరిష్కారానికి కమాండ్ కంట్రోల్ సెంటర్లు చాలా ఉపయోగకరమన్నారు. రోడ్డ్భుద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి అక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేయించాలన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ పలుసూచనలు చేశారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక నేరాలపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల విచారణలు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. దొంగతనాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని, గతంలో జరిగిన చోరీ కేసుల్లో రికవరీలు ఆలస్యం కావడంపై ఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పులివెందుల యుజీపీఎస్ సీఐకి స్ఫూర్తి అవార్డు
ప్రతినెలా నేర సమీక్షా సమావేశంలో, అంతకుముందు నెలల్లో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులను ‘స్ఫూర్తి’ అవార్డుల పేరుతో సత్కరించడం ఎస్పీ ఆనవాయితీగా చేసుకున్నారు. ఈ సమావేశంలో జూలై, ఆగస్టు నెలలకు గాను వరుసగా రెండు స్ఫూర్తి అవార్డులు పులివెందుల యుజీపీఎస్ ఇన్‌స్పెక్టర్ కె.పుల్లయ్యకు దక్కాయి. ఎస్పీ ఆయనకు అవార్డులు అందించారు. ఎస్‌ఐల విభాగంలో జూలై నెలకు వీరబల్లి ఎస్‌ఐ విఎల్ ప్రసాదరెడ్డి, ఆగస్టునెలకు పెద్దముడియం ఎస్‌ఐ పి.హరిప్రసాద్‌కు స్ఫూర్తి అవార్డును అందజేశారు. ఇంకా వివిధ కేసులను చేధించడంలో చొరవ, సమయస్ఫూర్తి చూపి సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ అవార్డులు అందజేశారు.