కడప

పార్టీ శ్రేయోభివృద్ధికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, సెప్టెంబర్ 25: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రొద్దుటూరు నుండి బెంగళూరుకు వెళ్తూ రాయచోటి పట్టణ శివార్లలోని గాలివీడు రింగురోడ్డు వద్దకు రాగానే సత్యకుమార్‌ను స్థానిక బీజేపీ శ్రేణులు తరలివెళ్లి ఘనస్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి బాణసంచా పేల్చి శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యకుమార్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధి నిరోధకుడు పుట్టా సుధాకర్‌యాదవ్
* ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి
చాపాడు, సెప్టెంబర్ 25: మైదుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి నిరోధకుడిగా టీడీపీ నియోజక కన్వీనర్, టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్‌యాదవ్ నిలిచారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని మొరాయిపల్లె నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సోమాపురంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మైదుకూరు నియోజక వర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అందాల్సిన సబ్సిడీ రుణాలతో పాటు వివిధ రకాల సబ్సిడీలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకోవడం హేయమైన చర్య అన్నారు. 60 ట్రాక్టర్లు రైతుల కోసం విడుదల అయితే వాటిని ఒక్కొక్క ట్రాక్టర్‌ను లక్ష రూపాయలకు మార్కెట్‌లో అమ్ముకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రారంభ దశలో చేపట్టిన రోడ్లు ఆ తర్వాత మరమ్మతులకు నోచుకోకపోయాయన్నారు. చాపాడు మండలంపై సుధాకర్‌యాదవ్ పూర్తిగా శీతకన్ను వేసి అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ఇన్‌చార్జీలకు నిధులు కేటాయించడం ఆ నిధులు ప్రజలకు దక్కకుండా పోవడం జరిగిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను మోసగించి టీడీపీ కార్యకర్తలు ప్రజా ధనాన్ని దోచుకోన్నారన్నారు.