కడప

ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యల పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 6: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి దశాబ్దాలకాలంగా ముఖ్యమంత్రులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని, ఈమారైనా ముఖ్యమంత్రి తమ సమస్యలు పరిష్కరించాలని పిఆర్‌టియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.శ్రీనివాసరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కడపలో విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవలే పిఆర్‌టియు స్టేట్ కౌన్సిల్ సమావేశం విజయవాడలో జరిగినపుడు ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరై తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రూ.398లు జీతంతో 1984-94 మద్య స్పెషల్ టీచర్లుగా చేరినవారందరికీ రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, తాలూకా, జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు ఇళ్లస్థలాలు, ఇళ్లనిర్మాణాలు, లాంగ్వేజ్ పండిట్స్, పిఇటిలకు పదోన్నతులు కల్పించి ఉన్నతపాఠశాల ఉపాధ్యాయుల స్థాయిలో గుర్తిస్తామని హామి ఇచ్చారని, మిగిలిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు. సర్వీసు రూల్స్‌ను క్రమబద్దీకరణ చేసి ఈ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాఠశాలలు పనిచేయని కారణంగా తాము రెండవ శనివారం , ఆదివారం , సెలవు దినాల్లో పనిచేశామని, ఈనేపధ్యంలో తమకు 33 రోజులు ఇఎల్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలలు రేషనలైజేషన్ కాక మునుపే అంతర్ జిల్లాల బదిలీలు చేయాలని ఆయన కోరారు. అలాగే ఉపాధ్యాయులకు వారి కుటుంబ సభ్యులకు హెల్త్‌కార్డులు ఇచ్చి ఏ జబ్బుకైనా సంబంధిత ఉపాధ్యాయ కుటుంబ సభ్యులు కోరుకున్న ఆసుపత్రుల్లో చికిత్సచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఎయిడెడ్ టీచర్లకు 010 పద్దతుల కింద జీతాలు, పదోన్నతులు ఇవ్వాలన్నారు. రేషనలైజేషన్ చేసి అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులను, విద్యార్థులను ఒకే గొడుకు కింద తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.