కడప

సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, అక్టోబర్ 15: పట్టణంలో నవరాత్రుల ఉత్సవాలను అంభరంగా వైభవంగా నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో భక్తులు అమ్మవారి దర్శనాలను పొందుతున్నారు. సోమవారం స్థానిక మత్కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు శ్రీసరస్వతీదేవి అలంకరణలో కొలువుదీరారు. ఉదయం శ్రీ సరస్వతీ దేవి పూజా కార్యక్రమములు, బిందెసేవ ప్రారంభం, రుద్రహోమము, మహా మృత్యుంజయ హోమము, సరస్వతి హోమము, శ్రీ వాసవీమాత మూల మంత్ర నిత్య హోమము, సాయంత్రం విశేష శ్రీచక్ర యంత్రార్చన, రాత్రికి దీక్షా హోమము నిర్వహించారు. అగస్తేశ్వరస్వామి అలయంలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో కొలువుదీరారు. రాజరాజేశ్వరీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రుల ఉత్సవాలను నిర్వహిస్తున్న ఈ నవరాత్రులలో ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదాలు అందజేశారు. పాత మార్కెట్‌లో ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉదయం పూజ అలంకరణలతో కార్యక్రమాలు మొదలై సాయంత్రం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో కొలువుదీరారు. వైయంఆర్ కాలనీలో వెలసిన రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రీ సరస్వతిదేవి అలంకరణలో కొలువుదీరారు. ఉదయం శ్రీ యోగినిహవన పూర్వక, శ్రీ పవమాన హవనములు, రాత్రికి శ్రీ దుర్గా యంత్రార్చన, 7 గంటలకు నంద్యాల శాంతిరామ్ డ్యాన్స్ అకాడమి వారి శిష్యబృందంచే కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. వెంకటేశ్వర్లపేటలోని చౌడేశ్వరిదేవి ఆలయంలోను, వైయంఆర్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవార్ల దర్శనార్థం పట్టణం నుంచే కాక ఇతర గ్రామ, పట్టణ, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.