కడప

అరటి రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 9: జిల్లా వ్యాప్తంగా గాలి,వానలతో బొప్పాయి, అరటి ,మామిడి , కరబుజ్జ రైతాంగానికి పెద్ద ఎత్తున రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఉద్యానవనం సాగుచేసిన ప్రతి రైతును ఆదుకుంటామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన పులివెందుల నియోజకవర్గంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన అరటి తోటలను, మామిడి తోటలను, వివిధ రకాల ఉద్యానవన తోటలు పరిశీలించారు. సోమవారం ఆయన పులివెందులలోని కొత్తపల్లెలో పర్యటించి ఉద్యానవన రైతులను పరామర్శించి తోటలను స్వయంగా పరిశీలించారు. పులివెందుల నియోజకవర్గంలో 700 ఎకరాలు పైబడి అరటితోటలు గాలి,వానకు నేలకూలాయని జిల్లా వ్యాప్తంగా అరటి, బొప్పాయి, మామిడి,కరబుజ్జ,దోస తోపాటు మరో 500 ఎకరాలు పైబడి గాలివానకు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అకాలవర్షాల కారణంగా ఏటా ఉద్యానవన రైతులకు కోలుకోలేని విధంగా ప్రకృతి సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగునెలల క్రితం జరిగిన అకాలవర్షాలకు దెబ్బతిన్న ఉద్యానవన రైతులకు ముఖ్యమంత్రి ఇటీవల ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించారని గుర్తు చేశారు. సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు అకాలవర్షాలకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలతోపాటు మామూలు పంటలు పరిశీలించి అంచనాలు వేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు అధైర్యపడాల్సిన పనిలేదని ప్రతి రైతుకు న్యాయం జరిగేందుకు తాను కృషి చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివరిలోపు పులివెందుల నియోజకవర్గానికి గండికోట నుంచి నీరు ఇస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో 90శాతం సబ్సిడీతో డిప్ ఇరిగేషన్ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, రైతులు బాగుంటే అన్ని విధాల సుభిక్షంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆయనతోపాటు ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు మధుసూధన్‌రెడ్డి, పులివెందుల ఉద్యానవన శాఖ అధికారులు రాఘవేంద్రారెడ్డి, శ్రీనాధరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు టి.రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.

సమస్యలపై ప్రజలలో
చైతన్యం తేవాలి
* ప్రభుత్వ విప్ మేడా
రాజంపేట, మే 9:సమస్యల పరిష్కారం కోసం ప్రజలలో చైతన్యం తేవాలని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంకుడుగుంతలు తదితర అంశాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు కరపత్రాలను మేడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలలో అవగాహన కలిగినపుడే అవి విజయవంతం అవుతాయన్నారు. అధికారులు కూడా ప్రజలలో ఈ పథకాలపై చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. వర్షపునీరు వృధాకాకుండా ప్రతి ఇంటిలో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భూగర్భజలాలు వృద్ధి చెంది భావితరాలకు నీటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధులలో కుక్కల బెడద పెరుగుతుండడం జరుగుతుందని దీనిని అరికట్టేందుకు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిర్వహించాలన్నారు. ఇందుకు తిరుపతికి చెందిన అనిమల్ కేర్ లాండ్ వారి సంచార వాహనం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై, కమీషనర్ ఎన్.రమణారెడ్డి, టిడిపి నాయకులు టి.సంజీవరావు, షేక్ అబ్దుల్లా, సత్యాల రామకృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.