కడప

బలహీన వర్గాల ‘ఆదరణే’ సీఎం ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదుకూరు,నవంబర్ 13: బడుగు బలహీనవర్గాల సంక్షేమం వారి ఆదరణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చేస్తున్నారని లబ్దిదారులంతా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయకత్వాన్ని ఆదరించాలని టీటీడీ చైర్మన్, మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి పుట్టాసుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్ రంగసింహ, కమిషనర్ కృష్ణతో కలిసి సుధాయర్ యాదవ్ లబ్ధిదారులకు ఆదరణ పనిముట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన బడుగు బలహీనవర్గాలు చేతుల వృత్తుల వారి జీవనోపాది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 90శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేసి వారి కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పరచడం అభినందనీయమన్నారు. అలాగే అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా స్వర్గీయ ఎన్‌టి రామారావు ఏర్పాటుచేశారని వారి ఆశయ సాధనలో చంద్రబాబు పాలన చేస్తున్నారన్నారు. లబ్ధిదారులు తమకు అందించిన పనిముట్లు సద్వినియోగం చేసుకుని తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని కోరారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మంజూరుచేసిన వివిధ రకాల చేతివృత్తుల పనిముట్లు ఈసందర్భంగా లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మెప్మా అధికారి కాంతయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు రవీంద్ర, కిట్టు, ఓబులేసు యాదవ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

నేటి నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయ వారోత్సవాలు
* గ్రంథాలయ చైర్మన్ జి.రామకోటిరెడ్డి
కడప కల్చరల్,నవంబర్ 13:జాతీయ 51వ గ్రంధాలయ వారోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభవౌతాయని గ్రంధాలయ సంస్థ చైర్మన్ జి.రామకోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బాల బాలికల్లో గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా మేధాసంపత్తిని పెంచేందుకు 1968లో ప్రతి ఏటా నవంబర్ 14వ తేదిని గ్రంథాలయ వారోత్సవాల రోజుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అలాగే అదే రోజు బాలల దినోత్సవం కావడంతో బాల బాలికలకు వివిధ పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తామన్నారు. ఈపోటీలను తెలుగు, ఇంగ్లీషు మీడియంలో జూనియర్, సీనియర్ విభాగాల్లో వారం రోజులపాటు వ్యాసరచన, వక్తృత్వం, అహింసావాదం, గాంధీ ఆధ్యాత్మికత తదితర వాటిపై పోటీలు ఉంటాయన్నారు. అలాగే 15వ తేదీన చిత్రలేఖనం, స్వచ్చ్భారత్, 16న వక్తృత్వపోటీలు, 17న చదరంగం, 18న క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల బాల బాలికలు ఉదయం 10గంటలకు నేరుగా కేంద్రగ్రంథాలయానికి చేరుకోవాలన్నారు. అలాగే 19వ తేదీన ఉదయం 10గంటలకు మహిళలకు ముగ్గుల పోటీలు, 20న ముగింపు ఉత్సవాలు జరుగుతాయన్నారు. పై తేదీల్లో జరిగే పోటీల్లో ఆసక్తిగల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరచుకోవాలన్నారు.