కడప

మునిసిపల్ అధికారంతోనే బస్టాండు కూల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, నవంబర్ 13: ప్రొద్దుటూరులోని నడిబొడ్డున ఉన్న పాత బస్టాండులోని రూములను మునిసిపల్ కౌన్సిల్ అనుమతితోనే కూల్చాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కమిషనర్ చంద్రవౌళీశ్వర్‌రెడ్డికి సూచించారు. మంగళవారం కమిషనర్ చంద్రవౌళీశ్వర్‌రెడ్డిని కలిసి పాత బస్టాండులోని రూములను బలవంతంగా కూల్చి వేస్తామని అధికారులు ఒత్తిడి తేవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. చట్టాన్ని గౌరవించి ఏ పనైనా చెయ్యాలన్నారు. పనులు చెయ్యాలంటే మెజార్టీ కౌన్సిల్ తీర్మాణం తప్పక ఉండాలని ఆయన పేర్కొన్నారు. అనధికారికంగా వరదరాజులరెడ్డి పాత బస్టాండును కూల్చివేస్తే కేసులు పెట్టకుండా అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గాంధీ పార్కులో తీసిన గుంతను ఎందుకు పూడ్చలేదని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలకు తలొగ్గి పని చేయడం సిగ్గుచేటన్నారు. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అనుమతితో ఏ పనినైనా చేపట్టవచ్చునని ఆయన సూచించారు. పడగొట్టిన పాత బస్టాండు ప్రాంతంలో వేరే నిర్మాణాలు చేపడితే తాము ఊరుకొనేది లేదని ఆయన హెచ్చరించారు.