కడప

కార్తీక వర్షం ...కర్షకుల్లో హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,నవంబర్ 16:ప్రతి ఏడాది కార్తీక మాసంలో వర్షం ఈ ఏడాది కూడా ఆనవాయితీ కొనసాగే అవకాశం ఉంది. అందుకు నిదర్శనంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మొదలుకుని ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుండి రాత్రి వరకు పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు మూడురోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయంటూ వాతావరణ పరిశోధకులు పేర్కొనడం, మరోవైపు‘గజ’ తుఫాన్ ప్రభావం సైతం జిల్లాకు తాకే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న నేపధ్యంలో ఈ మూడురోజులైనా వర్షాలు కురుస్తే ఎండిపోతున్న పంటలను కాపాడుకోవచ్చునన్న ఆనందంలో రైతులు ఉన్నారు. ప్రతి ఏడాది కార్తీకమాసంలో తప్పనిసరిగా వర్షాలు కురిసే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఖరీఫ్ తర్వాత రబీసీజన్‌లో నెలన్నరగా వర్షాలు కురవకపోవడంతో సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 28వేల హెక్టార్లలో వేసిన బుడ్డశెనగ పంట ఎండుముఖంలో ఉంది. మరోవైపు పత్తిపరిస్థితి దారుణంగా ఉంది. 8వేల హెక్టార్లలో పత్తిపంట సాగులో ఉంది. వేరుశెనగ పంట సైతం ఎండిపోతోంది. ఇక జొన్న, సజ్జ, మినుము, నూగు, రాగి వంటి పంటల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఈనేపధ్యంలో ఈ పంటల సాగుపై అయోమయ పరిస్థితులు ఉన్నాయని అధికారులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. దీంతో ఎటుచూసినా పలుప్రాంతాల్లో పచ్చని పొలాలు ఎండిపోతూ కనిపిస్తున్నాయి. ప్రతి ప్రాంతంలో రైతులు కలవరపాటులో ఉన్నారు. సాధారణంగా వినాయక చవితికి వర్షాలు వచ్చేవి. ఈసారి ఈ వర్షాలు కూడా లేవు. అయితే రైతులందరికీ కార్తీకమాసంలో వర్షాలు వస్తాయన్న ఆశ ఉంది. ఈనేపధ్యంలో శుక్రవారం వర్షాలు మొదలయ్యాయి. చిరుజల్లులతో మొదలై ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. రాత్రి నుండి సాయంత్రం వరకు ఆకాశం మేఘవంతమై ఉండటం వల్ల అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మరోరెండు రోజులపాటు ఈ వర్షాలు వచ్చే అవకాశాలుండగా మరో మూడు వారాల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని రైతులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈనెలలో నైరుతీ రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే పరిస్థితి వుండేది. కానీ ఇప్పటి వరకు నైరుతీ రుతు పవనాల ప్రభావం కనిపించలేదు. రెండురోజుల క్రితం చెన్నైకి సమీపంలో వచ్చిన గజ తుఫాన్ ప్రభావం జిల్లాకు ఉంటుందని శాస్తవ్రేత్తలు చెప్పడంతో కనీసం దీని ప్రభావం వల్లనో కొంతమేరకు పంటలను దక్కించుకోవచ్చునని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. అయితే ఊహించని విధంగా వర్షాలు పడుతుండటంతో పంటలు దక్కించుకోవచ్చునన్న ఆశ రైతాంగంలో నెలకొంది.