కడప

మహిళలు ఆర్థికంగా పురోగాభివృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్లిమర్రి,నవంబర్ 16: మహిళలు ఆర్థికంగా పురోగాభివృద్ధిసాధించి కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకోవాలని డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగాయపల్లెగ్రామంలో గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కుటుంబానికి వెన్నముక లాంటి వారని, వారిని ఆర్థికంగా ముందుకు నడపాలన్న ఆకాంక్షతో రాష్ట్రప్రభుత్వం వడ్డీలేని రుణాలు, కుట్టుమిషన్లను, చిన్న చిన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుకోసం నిధులు మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. డ్వాక్రా మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తోందని దీని ద్వారా కుటుంబం ఆర్థికంగా పురోగాభివృద్ధి సాధించుకునేందుకు ఈ డబ్బును ఉపయోగించుకోవాలని, తద్వారా ప్రతినెలా బ్యాంకులో రుణాలు చెల్లించాలన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య, వితంతువు, వికలాంగ పెన్షన్లను అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులపై ఉందని, అర్హులైన వారిని గుర్తించి వారి పెన్షన్లను మంజూరు చేయాలని సూచించారు. పెన్షన్లు అందజేయడంలో పార్టీలకు అతీతంగా గ్రామదర్శి, ఎంపీడీవో, స్పెషలాఫీసర్ ప్రత్యేక చర్యలు తీసుకుని పేదలకు అందించాలన్నారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఎంపీడీవో మల్‌రెడ్డి, తహశీల్దార్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు, డ్వాక్రా మహిళలు ,పెన్షనర్లు పాల్గొన్నారు.