కడప

ఆకేపాడులో వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 16: ప్రతియేడు వేలాది గోవిందమాలలు ధరించిన భక్తులతో కలిసి అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్ళిన మార్గంలో మహాపాదయాత్ర నిర్వహిస్తున్న రాజంపేట పార్లమెంటరీ వైసీపీ ఇన్‌ఛార్జి ఆకేపాటి అమర్‌నాథరెడ్డి శనివారం 16వ మారు తిరుమల మహాపాదయాత్రకు నిర్ణయించారు అంతకు ముందుగా ఆనవాయితీ ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆకేపాడు ఆలయాల సముదాయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తజన సందడిలో వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవంలో అమర్‌నాథరెడ్డి తన సతీమణితో కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం జరిపారు. ఈ కళ్యాణోత్సవంలో ఆకేపాడు చుట్టూపక్కల 14 గ్రామాలకు చెందిన ప్రజలతోపాటు రాజంపేట పట్టణం నుండి పెద్దసంఖ్యలో భక్తజనం హాజరయ్యారు. కాగా శనివారం తెల్లవారుజాము 4 గంటల నుండి ఆకేపాడు ఆలయాల సముదాయం నుండి తిరుమల మహాపాదయాత్రను అమర్‌నాథరెడ్డి గోవిందమాలలు ధరించిన భక్తులతో కలిసి ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ మహాపాదయాత్ర సోమవారం సాయంత్రానికి తిరుమలకు చేరుకోనుంది. కాగా మహాపాదయాత్రలో పాల్గొనే భక్తులందరికి మూడు రోజుల పాటు భోజన వసతి సదుపాయాలు అమర్‌నాధరెడ్డి కల్పించనున్నారు. ఇప్పటికి 15 మార్లు అన్నమయ్య నడిచివెళ్లిన మార్గంలో అమర్‌నాథరెడ్డి తిరుమలకు మహాపాదయాత్ర జరిపారు. శనివారం ఉదయం అమర్‌నాథరెడ్డి మొదలెత్తనున్న మహాపాదయాత్ర రాజంపేటకు చేరుకోనుండడంతో వైసీపీ శ్రేణులతోపాటు ఆధ్యాత్మిక ప్రియులు భారీ స్వాగత సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రాజంపేట నుండి ఈ మహాపాదయాత్రలో పాల్గొనేందుకు భక్తులు చాలామంది ఉత్సాహంగా ఎదురుచూస్తుండడం విశేషం.