కడప

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్,నవంబర్ 17:పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో వ్యవసాయ, అనుబంధశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి అధికారులతో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకంపై ఒక్కరోజు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిపరమైన సేంద్రియ ఎరువులు తయారుచేసుకుని ఆరోగ్యవంతమైన పంటలు పండించి మనం, మన పిల్లలు భవిష్యత్ తరాలవారికి ఎలాంటి జబ్బులకులోనుకాకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందుకు వ్యవసాయశాఖ, అనుబంధశాఖలైన ఉద్యాన, పశుసంవర్దకశాఖ, పట్టుపరిశ్రమ, బిందుసేద్యం, తుంపర, ఆత్మ, డ్వామా, డీఆర్‌డీఏ శాఖల సమన్వయంతో రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సేంద్రియ ఎరువుల తయారీ, వాడకంపై అవగాహన రైతులకు కల్పించాలన్నారు. గోకులం, ఈ సేంద్రియ ఎరువుల తయారీకి ఎంతో దోహదపడుతుందన్నారు. గాలిలో ఉన్న తేమ సాంద్రతను బట్టి భూమిపై ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పశుసంవర్థకశాఖ ఇందులో కీలకంగా వ్యవహరించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు పెట్టుబడి లేని వ్యవసాయంపై చైతన్యపరచి ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. సేంద్రియ ఎరువుల తయారీకి పశువుల ఎరువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యామ్నాయ పంటలను కూడా వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఉద్యానపంటలపై రైతులకు మక్కువ పెంచే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. డ్వామా శాఖలో ఉపాధిహామీ పథకం నిధులు అధికంగా ఉన్నాయని ఇందులో 130 రకాల పనులు అభివృద్ధిచెందుటకు అవకాశం ఉందన్నారు. పిల్లలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందేందుకు ఆయా, అంగన్వాడీ కేంద్రాలకు సేంద్రియ ఎరువులతో న్యూట్రీ గార్డన్స్ ఏర్పాటుచేసి అందించాలన్నారు. అలాగే ప్రతి ఇంటి పెరెట్లో కూడా పెరటి మొక్కలు పెంచి పోషక పదార్థాలు ఆ గృహ యజమానులు తీసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి వ్యక్తి బాధ్యతంగా సేంద్రియ ఎరువుల పంటలు వేసుకుని తరతరాల భవిష్యత్‌కు ఆరోగ్యాన్ని అందించాలని పిలుపునిచ్చారు.