కడప

మున్సిపాల్టీల పరిధిలో మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తిచేయాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,నవంబర్ 17:ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద జిల్లాలోని 8మున్సిపాల్టీలు, నగర పాలక కార్పొరేషన్‌కు మంజూరైన 19,232 ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్ సి.హరికిరణ్ దిశ నిర్దేశం చేశారు. ఈ ఇళ్లన్నీ మున్సిపాలిటీలోని అర్హులైన పేదలకు మంజూరుకాబడ్డాయన్నారు. శనివారం మీకోసం హాల్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకర్ల సమావేశం జరిగింది. 1964 ఇళ్లు ఇప్పటికీ పూర్తిగాక మిగిలిన 12,919 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. లబ్ధిదారులను వార్డుల ద్వారా గుర్తించి మున్సిపల్ కమిషనర్లు త్వరగా డీడీలు లబ్ధిదారుల వద్దనుంచి తీసుకోవాలన్నారు. కడప మున్సిపాలిటీకి 4,373, రాయచోటి 1011, ప్రొద్దుటూరు 4150, జమ్మలమడుగు 1415, రాజంపేట 1279, పులివెందుల 3143, ఎర్రగుంట్ల 2046, బద్వేలు 888, మైదుకూరు 927 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. మొదటి కేటగిరి కింద 300 చదరపు అడుగుల ఇంటికి రూ.5.65లక్షలు మంజూరుకాగా, రూ.1.50లక్షలు కేంద్రప్రభుత్వం, మరో రూ.1.50లక్షలు రాష్ట్రప్రభుత్వం కలిపి మొత్తం రూ.3లక్షలు సబ్సిడీ రూపంలో లబ్ధిదారులకు ఇస్తుందన్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులోను ద్వారా లబ్దిదారుడు తీసుకుని చెల్లించాల్సి ఉంటుందన్నారు. 430 చదరపు అడుగులకు రూ.7.65లక్షలు మంజూరు కాగా, రూ.3లక్షలు సబ్సిడీ పోతుందన్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలన్నారు. లబ్దిదారులు 20సంవత్సరాల వరకు వాయిదా పద్ధతిలో రుణం చెల్లించాల్సివుంటుందన్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీకి కేటాయించిన 1415 ఇళ్లు పూర్తయ్యాయని, అక్కడ అన్ని వౌళిక వసతులు కల్పించి డిసెంబర్ లోపు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అపార్టుమెంట్లలో, గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లను డాక్టర్‌చే గుర్తింపుపొందిన నిజమైన వికలాంగులకు మాత్రమే ఇవ్వాలన్నారు. మిగిలిన ఇళ్లు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో అత్యంత ముఖ్యమైన అంశం పేదలకు ఇచ్చే పక్కాగృహాలని వీటిలో ఎటువంటి నిర్లక్ష్యం చూపరాదన్నారు. పేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయచారి, మున్సిపల్ కమిషనర్ లవన్న, బీసీ కార్పొరేషన్ ఈడీ నరసింహారెడ్డి, డీఈఈ భాస్కర్, బ్యాంకు మేనేజర్లు, మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి, మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.