కడప

16వ మారు ఆకేపాటి తిరుమల పాదయాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 17: తిరుమలకు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు నడిచివెళ్ళిన మార్గంలో 16వ మారు రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆకేపాటి అమర్‌నాథరెడ్డి శనివారం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. రాజంపేట మండల ఆకేపాడు ఆలయ సముదాయాల నుండి మొదలెత్తిన ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో గోవిందమాలలు ధరించిన భక్తబృందం అమర్‌నాథరెడ్డిని అనుసరించింది. ఆకేపాటి ట్రస్ట్‌చే గోవిందమాలలు, వస్త్రాలు ఉచితంగా అమర్‌నాథరెడ్డి భక్తులకు అందజేయడమే కాకుండా, పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు అల్పాహార, భోజన వసతులు సమకూర్చడం విశేషం. శనివారం తెల్లవారుజామున ఆకేపాడు ఆలయ సముదాయాల నుండి మొదలైన పాదయాత్రలో పాల్గొన్న భక్తులు ఉదయం 9 గంటలకు రాజంపేట బైపాస్‌రోడ్డు చివర్లో ఉన్న శ్రీస్వామి అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకొని అల్పాహారం తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరశింహస్వామి ఆలయంలో మధ్యాహ్న భోజనం తీసుకున్నారు.
అన్నమయ్య తిరుమల కాలిబాటను అభివృద్ధిపరచాలి
మహాపాదయాత్ర మొదలెత్తిన సందర్భంగా ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. అన్నమయ్య తిరుమలకు నడిచివెళ్ళిన కాలిబాటను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సౌకర్యంగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ విషయమై ఇదివరకే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు గోవిందమాలలు ధరించి పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అంతకుమించి అడుగడుగునా అన్నివర్గాల ప్రజల నుండి లభిస్తున్న స్వాగతం మరవలేనిదన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆధ్యాత్మిక ప్రపంచం సమాజంలో ఏర్పడి శాంతి సుఖసౌఖ్యాలు కలుగుతాయన్నది నా ప్రగాడ విశ్వాసమన్నారు. అందుకే ఎంతో కష్టతరమైనప్పటికి ప్రతిఏటా వేలాది భక్తబృందంతో ఈ పాదయాత్ర స్వయంగా చేపట్టి తానుకూడా పాల్గొంటూ అన్నివర్గాల ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి తెలిపారు. అడుగడుగునా ఘనస్వాగతాలు
అమర్‌నాథరెడ్డి మొదలెత్తిన 16వ తిరుమల పాదయాత్రకు అడుగడుగునా అన్నివర్గాల ప్రజల నుండి ఘనస్వాగతాలు లభించాయి. ముఖ్యంగా పార్టీశ్రేణులు కదలివచ్చి స్వాగతం పలికారు. చిన్నారులు సైతం పాదయాత్రలో పాల్గొన్న అమర్‌నాథరెడ్డికి పూలమాలలతో ముంచెత్తారు. ఆకేపాడు ఆలయాల సముదాయం నుండి మొదలెత్తిన పాదయాత్రకు రాజంపేట పట్టణంలో కులమత వర్గ్భేదం లేకుండా హిందూ ముస్లింలు అమర్‌నాథరెడ్డికి ఎదురెళ్ళి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు పలుచోట్ల హారతులిచ్చారు. పలువురు పూలమాలలతో అమర్‌నాథరెడ్డిని ముంచెత్తారు. గ్రామగ్రామాన స్వాగత తోరణాలు ఏర్పాటుచేయడం విశేషం. తిరునాళ్ళను మరపించేరీతిలో గోవిందమాలలు ధరించి భక్తులు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. పాదయాత్రకు ముందు శ్రీదేవి, భూదేవిలతో కూడిన శ్రీవారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. పాదయాత్రకు ముందు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు నడిచారు. ప్రత్యేక చెక్క్భజనలు, ఆధ్యాత్మిక పాట కచ్చేరీలు కూడా పాదయాత్రలో ఏర్పాటు చేయడం విశేషం.
గోవిందనామ స్మరణతో మార్మోగిన హైవే
పాదయాత్ర సందర్భంగా గోవిందనామ స్మరణతో కడప-చెన్నై హైవే హోరెత్తింది. గోవిందమాలలు ధరించిన భక్త బృందం గోవిందనామ స్మరణ చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భారీ సంఖ్యలో భక్తబృందం పాల్గొనడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ రావడం జరిగింది.
నేడు రైల్వేకోడూరుకు చేరుకోనున్న పాదయాత్ర
అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో మొదలైన తిరుమల పాదయాత్ర ఆదివారం రైల్వేకోడూరు పట్టణానికి చేరుకోనుంది. ఇదేరోజు రాత్రి కుక్కలదొడ్డివద్ద బసచేసి సోమవారం నాటికి తిరుమలకు చేరుకుంటుంది.