కడప

ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే10:ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి దక్కేవరకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రుల హక్కు అని, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రత్యేక రాష్ట్ర సాధనలో వైఫల్యం చెందారని మంగళవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట వైకాపా నేతలు చేపట్టిన ధర్నా దద్దరిల్లింది. వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాథ్‌రెడ్డి నేతృత్వంలో వైకాపా ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు, జడ్పీ చైర్మన్ గూడూరు రవి, డిసిసిబి మాజీ చైర్మన్ కె.బ్రహ్మానందరెడ్డి, వైకాపా నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ చైర్మన్ సునీల్‌కుమార్‌లతోపాటు జిల్లా నలుమూలల నుంచి వైసిపి కార్యకర్తలు తరలివచ్చారు. ఈసందర్భంగా ఆందోళనకారులనుద్దేశించి నేతలు ప్రసంగిస్తూ ఈ ధర్నా కార్యక్రమంలో చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసుతోపాటు వివిధ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే కేంద్రంపై వత్తిడి తేకుండా మిత్రపక్షంతో తెగదెంపులు చేసుకోకుండా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యవాదులు ఆందోళన చేపట్టినా కేంద్ర తెలంగాణకే ఓటు వేసి నిట్టనిలువునా చీల్చారని వారు ధ్వజమెత్తారు. నేటి కేంద్ర పాలకులు నాడు ప్రతిపక్షంలో ఉండి తమ బిజెపి ప్రభుత్వం ఏర్పాటైతే 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని , అన్ని అమ్మకాలు, కోనుగోళ్లలో పూర్తిస్థాయిలో రాయితీలు ఇస్తామని ప్రకటించిన నాటి నేతలంతా నేడు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తాము తప్ప ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పడం విడ్డూరంగా ఉందని వారు ఆరోపించారు. అప్పటి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి విభజన చట్టంలో అన్ని పొందుపరచినా బిజెపి ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. రాష్ట్రం, కేంద్రంలో మిత్రపక్షాలైన బిజెపి, టిడిపిలు రాజకీయ నాటకాలు ఆడుతూ ప్రజలను దగా చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. దేశంలో ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని , హోదా పరంగా రాష్ట్రానికి అన్ని రాయితీలు వస్తాయని చంద్రబాబునాయుడు మిత్రపక్షం వైపు వైతొలగి కేంద్రంలో తమ ఇరువురు మంత్రులను రాజీనామా చేయించి కేంద్రంతో పోరాటం చేయాలని వారు డిమాండ్ చేశారు. హోదా దక్కేవరకు పోరాటం చేస్తామని వైకాపా నాయకులు కడప కలెక్టరేట్ ఎదుట నినదించారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా
కేంద్రం కళ్లుతెరిచి ప్రత్యేక హోదా కల్పించాలని , తమ పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.