కడప

విజిలెన్స్ దాడులకు ప్రభుత్వ ఖజానాలోకి రూ.84కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప డిసెంబర్ 8: మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దగా, కల్తీ, నకిలీ, అక్రమరవాణా, జోరో వ్యాపారం, వస్తువులకు, పరికరాలకు, రవాణాలకు అనుమతులు లేని వ్యాపారాలకు అడ్డుకట్టవేయడంలో కడప విజిలెన్స్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాలోకి రూ.84కోట్లు చేరింది. మరోవైపు ప్రజలకు నష్టం కలగకుండా విధులు నిర్వహించి క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాడులను ప్రణాళికా బద్దంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ నరహర ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి జిల్లా వ్యాప్తంగా వివిధ రకాలుగా దాడులుచేపట్టారు. దీంతో భారీ సొమ్మును అధికారులు చేయకలిగారు. ఖనిజ సంపదను జిల్లాలో ఉంది. ఈ మైనింగ్ అక్రమరవాణాపై కొంతమంది కాంట్రాక్టర్లు జీరో వ్యాపారం కింద అక్రమ రవాణాచేస్తూ కోట్లాదిరూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. వీరి అక్రమ వ్యాపారాలు యథేచ్చగా కొనసాగుతుండటంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖకు ఫిర్యాదులు రావడంతో ఆదిశగా అధికారులు దాడులు చేపట్టారు. అక్రమవ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ మైనింగ్ విభాగం నుంచి రూ.6కోట్లు సొమ్ము వసూళ్లుచేసి ప్రభుత్వ ఖాతాల్లోకి చేరవేశారు. రెవెన్యూశాఖలో అవినీతిని నివారించడం ఎవరితరం కాదు. ఆర్థికంగా ప్రభుత్వానికి, ప్రజలకు గండికొడుతూ శాఖ భారీగా సొమ్మును పోగుచేసుకునేది. దీంతో దశలవారీగా దాడులు నిర్వహించడంవల్ల రెవెన్యూశాఖ నుంచి భారీగా రూ.26కోట్లు రికవరి చేసి ప్రభుత్వానికి సమకూర్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలైన రేషన్ బియ్యం, చౌకధరలకు విక్రయించే వివిధ రకాల సబ్సిడీ నిత్యావసర సరుకుల ద్వారా ఈ మొత్తం చేకూరింది. అలాగే గృహావసరాలకోసం ఉపయోగించే సిలిండర్లను వ్యాపార వాణిజ్య సంస్థలకు ఉపయోగించి, వినియోగదారులకు ఇక్కట్లు, కష్టాలు పెడుతున్న క్రమంలో పై ఆదాయాన్ని దాడుల ద్వారా రికవరీ చేయగలిగారు. అలాంటి వారిపై 6-ఏ కేసులు బనాయించారు. వ్యాపార వాణిజ్యరంగాల్లో జరిగే కల్తీ, అనధికార నిల్వ, జీరో వ్యాపారం, వస్తువులకు బిల్లులులేకుండా విక్రయించడం, అక్రమంతో మోసంతో కూడిన వ్యాపారుల పాలిట ఉడుంపట్టి బిగించి వాణిజ్యపన్నుల శాఖల నుంచి రూ.30కోట్లు విలువచేసే సొమ్మును విజిలెన్స్‌శాఖ రికవరీ చేసి ప్రభుత్వాదాయానికి తోడ్పాటు ఇచ్చింది. అలాగే వివిధ ఇంజనీరింగ్ విభాగాల నుంచి రూ.22కోట్లు ఆదాయాన్ని అడ్డదారి పడుతున్న తరుణంలో వీరి పక్కాప్రణాళికలతో అడ్డుకట్టవేయగలిగారు. ఈ నిధులు కూడా ప్రభుత్వ ఖాతాలో జమచేశారు. అవినీతి, అక్రమంగా సంపాదించిన ఆస్తులు సొమ్ముచేసుకోవడం, దాచుకోవడం బినామీపేర్లతో ఆస్తులను భద్రపరచుకోవడంలో లీనమైనవారి భరతం పడటంలోఅవినీతి నిరోధకశాఖ చర్యలు తీసుకుంటోంది. దీనికితోడు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌శాఖ నిఘాతో దాడులు చేస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి రూ.84కోట్ల ఆదాయం సమకూర్చింది. ఈనేపధ్యంలో ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారులకు, రైతులకు తదితర విభిన్నవర్గాల వారిని చేతన్యపరిచే విధంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ నరహర, డిఎస్పీ రాజశేఖర్‌రాజు, సిఐలు లింగప్ప, నాగరాజులు బృందం వారోత్సవాల కార్యక్రమాన్ని కడప నగరంలో నిర్వహించి ప్రజలను చైతన్యపరిచింది. వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారికి ఆశాఖ నుంచి ప్రశంసాపత్రాలు అందజేశారు.

టీడీపీకి చెన్నూరు మాజీ ఎంపీపీ రాజీనామా
చెన్నూరు, డిసెంబర్ 8: 20ఏళ్లపాటు తెలుగుదేశంపార్టీలో ఉంటున్న మాజీ ఎంపీపీ, మండల సీనియర్ నాయకులు ఎం.శివరామిరెడ్డి శనివారం తెలుగుదేశంపార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత 15రోజులుగా శివరామిరెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, అమరనాధరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు ఇటీవల కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన సి.రామచంద్రయ్యలు శివరామిరెడ్డి నివాసంలో చర్చించడం జరిగింది. వైసీపీలో ప్రముఖస్థానంతోపాటు జడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో శివరామిరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శివరామిరెడ్డి మూడుసార్లు ఎంపీపీగా పనిచేశారు. తన అనుచరుడు కుమారస్వామిని ఎంపీపీగా చేశారు. తన తల్లి ముదిరెడ్డి లక్షుమ్మను 2వసారి ఎంపీపీగా చేశారు. 3వసారి శివరామిరెడ్డి ఎంపీపీగా పనిచేశారు. ఈసందర్భంగా శివరామిరెడ్డి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీలో ఇమడలేక వైసీపీలో చేరుతున్నానన్నారు. మండలంలో తనను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, ఒకరిద్దరికి మాత్రమే మండల బాధ్యతలు చెప్పడం వల్ల మండలప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. తన రాజీనామాను పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి పంపడం జరిగిందని, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

వైసీపీ జిల్లా వైద్యవిభాగం అధ్యక్ష పదవికి డా.ఆదర్శర్‌రెడ్డి రాజీనామా
చెన్నూరు, డిసెంబర్ 8: వైఎస్సార్ సీపీ వైద్యవిభాగంలో అధ్యక్షునిగా పనిచేస్తున్న డా.అదర్శన్‌రెడ్డి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రత్యర్థివర్గం టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో తాను ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆదర్శరెడ్డి ప్రకటించారు. ఆదర్శరెడ్డి తండ్రి మనోహర్‌రెడ్డి, బాబాయ్ జయభారత్‌రెడ్డి గత పదేళ్లుగా వైసీపీలో ఉన్నారు. ఆదర్శరెడ్డి కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తాత వీరారెడ్డి కడప నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన విషయం తెలిసిందే. అలాగే అనేకసార్లు ఆయన ఏకగ్రీవంగా సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన తల్లి పార్వతమ్మ జడ్పీటీసీగా పనిచేశారు. శివరామిరెడ్డి కుటుంబానికి, ఆదర్శ్‌రెడ్డి కుటుంబానికి రాజకీయ మనస్పర్థలు ఉన్నాయి. ఈమేరకు కేసులు కూడా ఉన్నాయి. ఇరువురు ఒకే పార్టీలో ఇమడలేకనే వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై డా.ఆదర్శ్‌రెడ్డిని అడగగా వైసీపీలో కష్టపడి పనిచేశామని, తమ ప్రత్యర్థులు వైసీపీలోకి వస్తే తాము ఉండలేమని ఇందుకోసం వైసీపీకి రాజీనామా చేశామన్నారు. తండ్రి, బాబాయ్‌లతో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు.

రచ్చబండ తీర్పులాంటిదే లోక్ అదాలత్ తీర్పు
* జాతీయ లోక్ అదాలత్‌లో 1055 కేసులు పరిష్కారం
* రూ.4కోట్ల 46లక్షల 56వేల 182లు విలువగల చెక్కులు పంపిణీ
* కక్షిదారులకు రక్తదాన శిబిరం, ఉచిత వైద్యసేవ,అన్నదానం
* జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్
కడప లీగల్, డిసెంబర్ 8: ప్రాచీనకాలంలో గ్రామీణ ప్రాంతంలో వివాదాల విషయంలో ఊరి పెద్దమనుషులు చెప్పే తీర్పులాంటిదే లోక్ అదాలత్ తీర్పు అని జిల్లాప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జిల్లాకోర్టు ప్రాంగణంలో భారీఎత్తున జాతీయ మెగాలోక్ అదాలత్ జరిగింది. ఈసందర్భంగా జిల్లా జడ్జి కక్షిదారులనుద్దేశించి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కాలం వృధాకాదని, అలాగే యేళ్ళతరబడి కోర్టుచుట్టు తిరుగుతున్న కేసులు పరిష్కరించుకునేందుకు చక్కనివేదిక అని, అలాగే స్నేహపూర్వకమైన వాతావరణంలో రాజీ చేసుకోవచ్చునని కోర్ట్ఫుజు వాపసు ఇవ్వబడునని, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఇరుపక్షాలు సివిల్ దావాలు, వాదులాటల విషయాల్లో ఊరి పెద్దలు రచ్చబండ అనే వేదిక ద్వారా సంబంధిత వ్యక్తులకు సముచితమైన న్యాయాన్ని అందించేవారని, కాలానుగుణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎందరో న్యాయకోవిదులు ఈ న్యాయసేవా అధికార సంస్థ ద్వారా లోక్ అదాలత్‌ను రూపకల్పనచేసిందని తద్వారా కక్షిదారులకు సత్వరం న్యాయం అందించేందుకు వీలుంటుందని ఈచట్టాన్ని అమలులోకి చట్టరూపంలో తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 కేసులు అన్నికోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం ఈలోక్ అదాలత్ ద్వారా 1055కేసులను పరిష్కరించి కక్షిదారులకు, క్షతగాత్రులకు, బ్యాంకులకు, ప్రమాదంలో మరణించిన బాధితులకు రూ.4కోట్ల 46లక్షల 56వేల 182లు చెక్కుల రూపంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే నగరంలోని రోటరీక్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉచితంగా 850మందికి వైద్యసేవలు అందించారని, అలాగే మందులు కూడా పంపిణీ చేశారన్నారు. కాగా న్యాయవాదులు 2500మందికి ఉచితంగా భోజనం, నీటివసతులు కల్పించారని, 50మంది యువకులు రక్తదానం చేశారన్నారు. జేసీ-2 శివారెడ్డి మాట్లాడుతూ చిన్నచిన్న వివాదాల కారణంగా కోర్టుకు ఎక్కకూడదని ఇరువురు సహృదయంతో రాజీ చేసుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదికన్నారు. నగర డిఎస్పీ మాసూం బాషా మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమనే నినాదంతో పోలీసుశాఖ రాజీకి ఆమోదమైన క్రిమినల్ కేసుల విషయంలో ముద్దాయిలకు, ఫిర్యాదుదారులకు రాజీకుదిర్చి కేసులను పరిష్కరించేందుకు ముందుగా ఉన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 70శాతం కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం జరిగాయని, అదేవిధంగా శాశ్వత లోక్ అదాలత్‌లో సభ్యులుగా హిజ్రాలను నియమించిన ఘనత జిల్లాకే దక్కిందన్నారు. ఈకార్యక్రమంలో న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మొదటి అదనపు జిల్లాజడ్జి కె.సుధాకర్, నాల్గవ అదనపు జిల్లా జడ్జి చక్రపాణి, ఫ్యామిలీ జడ్జి మంజరి, సీనియర్ సివిల్ జడ్జి శుభవాణి,జూనియర్ జడ్జిలు. న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

స్వార్థంతో పది మంది పార్టీని వీడితే
వందలాది మంది చేరేందుకు సిద్ధం
* విప్ మేడా మల్లికార్జునరెడ్డి
రాజంపేట టౌన్, డిసెంబర్ 8: రాజంపేట నియోజకవర్గంలో స్వార్థంతో పది మంది టీడీపీని వీడితే నిస్వార్ధంగా వందలాది మంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని విప్ మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మేడా మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో రాజంపేట నియోజవర్గం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో కృషిచేస్తున్న తనను పార్టీ వీడి వైసీపీలోకి వెళతానని చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు తనకు చేతకావు అన్నారు. తనను ఎమ్మెల్యేగా, విప్‌గా, తన తండ్రి ఎం.రామకృష్ణారెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్‌గా చేసిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటానని, అంతకన్నా ఎక్కువ ఆశించలేదన్నారు. తాను వైసీపీతో కుమ్మక్కు కావాల్సిన దుస్థితిలోలేనని, టీడీపీని వీడే ప్రసక్తేలేదని చాలాసార్లు స్పష్టం చేశానన్నారు. అభివృద్ధిపై ధ్యాసతో బాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కులం, మతం, వర్గం, నా కుటుంబం అనే బేధం లేకుండా వ్యాపారం జోలికెళ్లకుండా న్యాయం చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో కుప్పం తరువాత రాజంపేట నియోజకవర్గంలోని పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించానన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, టి.సంజీవరావు, మల్లేల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

9నెలలుగా అంగన్‌వాడీ వర్కర్లకు అందని జీతాలు
* ఆధార్, అకౌంట్, ఇంటిపేరు తప్పుల తడకలతో చిక్కులు
కడప అర్బన్, డిసెంబర్ 8:ప్రభుత్వం అమలుపరిచే వివిధ అభివృద్ధి పథకాలు, సేవలలో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, హెల్పర్లను ప్రభుత్వం వీరిని విధులపరంగా ఉపయోగించుకుంటోంది. వీరి సహాయం లేనిదే గ్రామంలో అభివృద్ధికాని, సంక్షేమ పథకాలు కానీ అమలుచేసేందుకు జిల్లా యంత్రాంగానికి వీలుండదు. అసలు వీరు ఒక్కరోజు పనిచేయకపోతే 0-5సంవత్సరాల వయసు పిల్లలకు పౌష్టికాహారం అందకుండా పోతుంది. వీరితోపాటు గర్భవతులకు, బాలింతలకు అంగన్‌వాడీల ద్వారా ప్రతిరోజు పంపిణీ కాబడుతున్న పౌష్టికాహారం అందక బాధితులు ఇబ్బందులకు గురికావాల్సివస్తోంది. 9నెలల నుంచి జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు అందకపోవడంతో వీరి బతుకు కష్టతరంగా మారింది. అందరికీ వీరి సేవలు ఉపయోగం అయినప్పుడు వీరికి జీతాలు చెల్లించడంలో ఆశాఖలోని దిగువశ్రేణి సిబ్బంది పెడుతున్నచిక్కులు నిదర్శనంగా నిలిచాయి. సీడీపీవోలు జీతాలు చెల్లింపులో తమ పనికాదని 9నెలల పాటు కాలయాపనచేస్తూ వర్కర్లకు, ఆయాలకు, హెల్పర్లకు సాకులు చెప్పుకుంటూ వచ్చారు. పలుమార్లు స్ర్తి, శిశుసంక్షేమశాఖ ప్రాజెక్టు సంచాలకులు కూడా లిఖితపూర్వకంగా వీరు వినతి చేశారు. ఈనేపధ్యంలో ఆధార్ నెంబర్‌లో తప్పులు దొర్లడం, అకౌంట్ నెంబర్ సరిలేకపోవడం, ఉద్యోగంలో చేరినప్పుడు ఇంటిపేరుతో ఉన్న అర్హత ధృవీకరణపత్రాలు అందించడం, ప్రస్తుతం భర్త ఇంటిపేరుతో ఉన్న ధృవీకరణపత్రాలు ఆన్‌లైన్‌లో జీతభత్యాలకోసం నమోదుచేయడం వల్ల దీర్ఘకాలికంగా వీరికి చెల్లించాల్సిన నెలవారీ జీతభత్యాలు పెండింగ్‌పడ్డాయి. ఈ తప్పులను సరిదిద్దాల్సిన క్లస్టర్‌స్థాయి దిగువశ్రేణి క్లర్కులు సరిదిద్దకుండా కాలయాపన చేయడంతో ఈపరిస్థితి దాపురించిందని వర్కర్లు, ఆయాలు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకనెల జీతాలు రాకపోతే ఇంటిఅద్దె, పాల బిల్లు, విద్యుత్ బిల్లు కుటుంబాన్ని పోషించుకోవడం సామాన్యులకు కష్టతరంగా ఉంటుంది. ఈనేపధ్యంలో సెలవు దినాల్లోకూడా వీరి సేవలు ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నప్పటికీ చిన్నచిన్న పొరపాట్లు సరిదిద్దడంలో ఆశాఖలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జీతాలకు ఇబ్బంది తప్పలేదు. జిల్లాలో వందమంది ఆయాలు, వర్కర్లు, హెల్పర్లకు జీతాలు అందకపోవడంతో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిలక్ష్మిని కలిసి యూనియన్ నాయకులతో వర్కర్లు వినతిపత్రాన్ని ఇచ్చారు. తమకు జీతాలు చెల్లించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లోఉన్న సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడంతోనే జీత భత్యాలలో ఇబ్బందులు తలెత్తాయని వారు పేర్కొన్నారు. కుటుంబాలు గడవక కరువు, కాటకాలతో సతమతవౌతున్న నేపధ్యంలో అప్పులు దొరక్క, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న వర్కర్లకు, ఆయాలకు, హెల్పర్లకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం చేపట్టాల్సివుంది. ముఖ్యంగా జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టు పరిధిలో 72మంది వివిధ కేటగిరిల వర్కర్లకు, రాజంపేట డివిజన్‌లో 20మంది సిబ్బందికి ,కడప అర్బన్, రాయచోటి ప్రాజెక్టులలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి జీతాలు చెల్లించాల్సివుంది. వీరి జీతాలు పెండింగ్ సమస్యపై ‘ఆంధ్రభూమి’ ఏపీడీవో ఆదిలక్ష్మిని వివరణ కోరగా వివిధ తప్పుల నమోదువల్ల ఆన్‌లైన్‌లో జీతాల చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోవడం వాస్తవమేనని వెల్లడించారు. వీటిని రాష్టస్థ్రాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించి జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు.

ధ్యానంతో మానసిక ఒత్తిళ్లు అధిగమించవచ్చు
* విప్ మేడా మల్లికార్జునరెడ్డి
రాజంపేట, డిసెంబర్ 8: ప్రతి ఒకరు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిళ్లను అధిమించి ప్రశాంత జీవనం సాగించ వచ్చునని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నూతనంగా నిర్మించిన శ్రీ సరస్వతి పిరిమిడ్ ధ్యానమందిరాన్ని బ్రహ్మర్షి పత్రీజీ తదితరులతో కలసి ప్రభుత్వ విప్ మేడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు ప్రతి రోజు విధిగా ధ్యానం చేయడం వలన జ్ఞాపక శక్తిని పెంపొందుచుకుని, ధృడంగా, ఉల్లాసం ఉంటారన్నారు. అన్ని కళాశాలల సమీపంలో విద్యార్థులకు అనువుగా ధ్యానమందిరాలు ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పితామహా పత్రీజీ ధ్యానం చేయడం వలన కలిగే ఉపయోగాలను, ధ్యాన విధానం తదితర అంశాలను వివరించారు. ముందుగా ధ్యానులు, నిర్వాహకులు కలసి స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లా నుండి ధ్యానమందిరం వరకు అహింసా-మహాకరుణ శాకాహార ర్యాలీ పురవీధుల గుండా నిర్వహించారు.

ప్రభుత్వ పథకాలు టీడీపీ వర్గీయులకే..
రాజంపేట టౌన్, డిసెంబర్ 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలలో అధిక శాతం టీడీపీ వర్గీయులకే చేరుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్‌రెడ్డి, రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతుగుంట రమేష్‌నాయుడు అన్నారు. శనివారం మండలంలోని బోయనపల్లెలో బీజేపీ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. పింఛన్లలో కేంద్రం వాటా 80 శాతం కాగా రాష్ట్రం వాటా కేవలం 20 శాతం మాత్రమేనన్నారు. స్వచ్ఛ్భారత్ క్రింద మరుగుదొడ్లు నిర్మించేందుకు నిధులు అందిస్తుందన్నారు. పక్కాగృహాల నిర్మాణం తదితర సంక్షేమాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కృష్ణాయాదవ్, వై.సురేష్‌రాజు, భీమిశెట్టి వెంకటేశ్వరరావు, పాపయ్య, గుణవర్మ, హరి, జి.శ్రీనివాసులు, కె.శ్రీనివాసులు, యువరాజు, విజయేంద్రవర్మ, మహేంద్ర, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.