కడప

హాస్టల్ ప్రాంగణంలో యుజిడి మురుగునీటిపై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 10: నగరంలోని పురప్రజల సమస్యలను పరిష్కరించడంలో కార్పొరేషన్ పాలక, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకటశివ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం లోపలికి చొచ్చుకుపోయి కమిషనర్ చాంబర్ వద్ద బైటాయించారు. ఈ సందర్భంగా వెంకటశివ మాట్లాడుతూ తాగునీరు, రోడ్లు, డ్రైనేజి సమస్యలను పరిష్కరించడంలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, పాలన పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కమీషన్ల కక్కుర్తిలో ప్రజాసమస్యలు విస్మరించి నగర పాలకయంత్రాంగం మొద్దుబారిందని విమర్శించారు. ప్రకాష్‌నగర్‌లోని కాలేజి విద్యార్థుల ఎస్సీహాస్టల్‌లో యుజిడి నీళ్లు పైకి చేరి మురుగుకుంటగా మారిందని అన్నారు. అక్కడి విద్యార్థులు ,చుట్టుపక్కల ప్రజలు దోమలబారిన పడి జ్వరాలతో, వ్యాధులతో సతమతవౌతున్నారని పేర్కొన్నారు. నీటిట్యాంకు నిర్మాణం కోసం తవ్విన 20అడుగుల గుంత దోమలకు నిలయంగా మారిందని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి అస్యవస్థ వ్యవస్థ వల్ల కడప నగరం ఎక్కడ చూసినా మురికికూపంగా మారిందని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. పదేళ్లయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ పూర్తికాకపోవడం సిగ్గుచేటన్నారు. రూకవారిపల్లె, కమ్మూసాహెబ్ నగర్ తదితర నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అనేకమార్లు ధర్నా చేపట్టినా ఫలితం లేదని విమర్శించారు. తిలక్‌నగర్, ఎద్దుల ఈశ్వరరెడ్డి నగర్, బహుజన నగర్, నంద్యాల నాగిరెడ్డికాలనీ తదితర మురికివాడల్లో రోడ్లువేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తక్కోలి మనోహర్‌రెడ్డి, కెసి బాదుల్లా, కొమ్మద్ది ఈశ్వరయ్య, చాట్లకృష్ణయ్య, భాగ్యలక్ష్మి, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.