కడప

వైఎస్ జగన్ హామీలపై యువతలో హర్షాతిరేకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, డిసెంబర్ 10: రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలపై నిరుద్యోగ యువతలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని స్థానిక శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్ ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత నాలుగన్నరేళ్లుగా నిరుద్యోగులకు ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వక, పత్రికలు, టీవీల్లో లక్షలాది మందికి ఉద్యోగాలిచ్చాము.. నిరుద్యోగ సమస్య అన్నదే లేకుండా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగన్ ఇటీవల నిరుద్యోగులకు పలు హామీలు ఇచ్చారన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారని, ప్రతి గ్రామం ప్రతి వార్డులో గ్రామ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు 10-15 మంది స్థానిక నిరుద్యోగులకు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించి, వారికి రూ.5 వేలు చొప్పున జీతాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారన్నారు. ఇది గ్రామ, పట్టణ యువతకు వరంలాంటిదన్నారు. సీఎం చంద్రబాబు ఇంత వరకు ఒక డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించలేదన్నారు. అట ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఏ ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించిన పాపాన పోలేదన్నారు. నిరుద్యోగభృతి కూడా చాలా మందికి అందడం లేదన్నారు. కనీసం ఒకట్రెండు ఉర్దూ టీచర్ పోస్టుల నియామకాలు కూడా జరగలేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా జిల్లాలో పెద్ద పరిశ్రమలను నెలకొల్పుతామన్నారు. కాబట్టి నిరుద్యోగ యువత కూడా ఎక్కడా నిరాశపడకుండా జగన్ నాయకత్వాన్ని బలపరచుకుందామని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.