కడప

టీఆర్‌ఎస్‌తో వైకాపా లోపాయికారీ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, డిసెంబర్ 12: తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచాక మన రాష్ట్రంలో వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటున్న దానినిబట్టి చూస్తే టీఆర్‌ఎస్‌తో వైకాపా లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు భావించక తప్పదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మదనపల్లె మార్గంలో గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఐదేళ్లుగా కొన్ని అంశాల్లో చేసిన అభివృద్ధి ఆ పార్టీని మళ్లీ గెలిపించిందని, కానీ టీడీపీకి మన రాష్ట్రంలో ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో రెట్లు ఎక్కువగా చేశారన్నారు. ప్రత్యేకించి నదుల అనుసంధానం ద్వారా సీమ ప్రాంతంలో కరువులు పూర్తిగా నిర్మూలించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి అందరికీ కళ్లెదుటే కనిపిస్తుందన్నారు. ఇచ్చిన హామీల మేరకు పింఛన్ల పెంపుదల, ఉద్యోగుల వయోపరిమితి గడువు, పంట రుణాల మాఫీ, భారీగా ఇండ్ల నిర్మాణం అన్ని వరుసగా జరిగాయన్నారు. వైకాపా నాయకులు అధికారం చేజిక్కించుకునేందుకు నవరత్నాల పేరిట ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో అంతరంగంగా చెలిమి చేసిన జగన్ తనపై ఉన్న అక్రమ కేసులను కొట్టి వేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారన్నారు. చైతన్యవంతులైన ప్రజలు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో తమ ఓటు తీర్పు ద్వారా వైకాపాకు తగిన బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీడీపీని, సీఎం చంద్రబాబును విమర్శించే కనీస హక్కు కూడా వైకాపాకు లేదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటన వాయిదా పడిందని, త్వరలో తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.