కడప

చెరువును కబ్జాచేస్తున్న దళారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 15: వాగులు, వంకను, చెరువులు, కుంటలు ఏ ఒక్కటీ వదలకుండా దళారులు, కబ్జాదారులు దర్గాగా దోచేసుకుంటున్నారు. ఈనేపధ్యంలో పెండ్లిమర్రి మండలం పెద్దదాసరిపల్లె చెరువు కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిందని పెండ్లిమర్రి మండలం ఎల్లటూరు గ్రామానికి చెందిన కొందరు రైతులు శనివారం జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. గ్రామ పొలాల్లో బోర్లలో నీరులేక , రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని వారు ఆరోపించారు. చెరువు ఉన్నప్పుడు 70అడుగుల లోతులోనే నీళ్లు లభించేవని, చెరువును దోచేయడం వల్ల నీటితో రైతులు కటకటలాడుతున్నారన్నారు. ఈవిషయంపై సంబంధిత వీఆర్వోకు, రెవెన్యూ అధికారికి పలుమార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న చెరువు కూడా ఎండిపోయి కబ్జాకు గురైతే తమ గ్రామపరిధిలో భూగర్భజలాలు అంతరించిపోవడమే గాకుండా తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కబ్జాకు గురౌతున్న చెరువును కబ్జాదారుల చేతుల్లో నుంచి కాపాడి గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.