కడప

బ్రాహ్మణులకోసమే లక్ష్యంగా రాజకీయ పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 15: బ్రాహ్మణుల్లో ఐక్యత నిలిపి, వారి సంక్షేమం కోసం ఒక రాజకీయ వేదిక తప్పనిసరిగా అవసరమనే సంకల్పంతో రాష్ట్రంలో మొదటి సారిగా ‘బ్రాహ్మణ ఫ్రంట్ రాజకీయపార్టీ’ రాష్ట్రంలో ఆవిర్భవించబోతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న బ్రాహ్మణులు చర్చించుకుని, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టి ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు రాష్ట్ర ‘బ్రాహ్మణ ఫ్రంట్’ రాజకీయ వ్యవస్థాపకులు కాళీభట్ల సాయినాధశర్మ తెలిపారు. మూడురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న మణికంఠ అనే అర్చకుడు ఆలయ చైర్మన్ వేదింపులు తాళలేక ఆత్మహత్యచేసుకున్న సంఘటన, ఆర్‌బీఎఫ్ నాయకులు సాంబశివరావు తీవ్రంగా స్పందించారు. గతంలో ఎన్నడూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్‌బీఎఫ్ తరపున బ్రాహ్మణుల నుంచి సహాయాన్ని సేకరించి, అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న సంఘటన బ్రాహ్మణవర్గాల్లో ఆర్‌బీఎఫ్‌పై నమ్మకం, విశ్వాసం పెంచే విధంగా ఉందని కొందరు బ్రాహ్మణులు, విజ్ఞులు పేర్కొంటున్నారు. బ్రాహ్మణులకు రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ మినహా రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవడం, పది లక్షలకుపైగా బ్రాహ్మణులకు రాష్టవ్య్రాప్తంగా ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, ఏ పార్టీకూడాబ్రాహ్మణులను మనస్ఫూర్తిగా ఆదరించే అవకాశం లేకపోవడంతో తమ జాతి ప్రయోజనాలు కాపాడుకోవడానికి బ్రాహ్మణ రాజకీయ ఫ్రంట్ పార్టీని స్థాపించబోతున్నారు. బ్రాహ్మణులు అనైతికతకు స్వస్తి పలికి , భవిష్యత్ తరాలవారికి ప్రయోజనం చేకూరే విధంగా , అంతరించిపోతున్న బ్రాహ్మణుల విలువలు సమాజంలో ఉన్నతస్థాయికి తీసుకెళ్లే విధంగా ఈరాజకీయపార్టీ బ్రాహ్మణుల కోసం కృషి చేస్తుందని ఆపార్టీ స్థాపకుడు కాశీభట్ల సాయినాధశర్మతోపాటు కీలకమైన కొందరు బ్రాహ్మణ వర్గాల వ్యక్తులు ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు. ఏదైనా ఒక సామాజిక సమస్యపరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఆ సమస్యపట్ల సానుకూలంగా వ్యవహరించాలంటే బ్రాహ్మణులకు ఒక రాజకీయ వేదిక ఉంటే కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మనుగడసాధించాలన్న భావన బ్రాహ్మణవర్గాల్లో వ్యక్తమై ఈరాజకీయ పార్టీ స్థాపనకు ప్రధాన కారణవౌతోంది. బ్రాహ్మణులకు రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ముఖ్యమంత్రి ఏర్పాటుచేసినప్పుడు రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే నిధుల కేటాయింపులో సామాజికపరంగా తగిన న్యాయం ప్రభుత్వపరంగా కార్పొరేషన్‌కు జరగకపోతుండటంతో నిధుల లేమితో బ్రాహ్మణులకు కార్పొరేషన్ నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోయారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500కోట్లు నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేవలం రూ.290కోట్లు మాత్రమే మంజూరు కావడం , మిగిలిన మొత్తం కార్పొరేషన్‌కు మంజూరు చేసేందుకు ప్రభుత్వపెద్దలు తగిన చొరవ చూపకపోవడం బ్రాహ్మణుల్లో బాధకలిగించే అంశంగా మారుతోంది. అంతేగాక ఇటీవల కాలంలో బ్రాహ్మణులపై దేవాలయ పాలకవర్గాల దాడులు, వేధింపులు ఎక్కువకావడం, ఇద్దరు బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకోవడం, వారి ఆత్మహత్యలపట్ల ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం రెండు కారణాల వల్ల కూడా బ్రాహ్మణులకు ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతుండటంతో బ్రాహ్మణజాతిని కాపాడుకోవాలంటే రాజకీయ పోరాటమే శరణమని భావిస్తూ ‘రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్’ రాజకీయపార్టీని తెరపైకి తీసుకురాబోతున్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్, పుణ్యభూమి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కాభీభట్ల సాయినాధ శర్మ నేతృత్వంలో 13 జిల్లాల బ్రాహ్మణులు ఈరాజకీయపార్టీ స్థాపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే బ్రాహ్మణ జాతి ప్రయోజనాలకోసం బ్రాహ్మణ రాజకీయపార్టీ తప్పనిసరిలో నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సివస్తుందనే అభిప్రాయం ఆయన తన అంతరంగికుల వద్ద వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమచారం. ఈమేరకు బ్రాహ్మణ రాజకీయపార్టీ ఆవిర్భవించబోతుందనే విషయాన్ని సోషియల్ మీడియా ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించినట్లు కూడా తెలిసింది. ఈమేరకు ఈనెల 25న అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున రాజకీయ బ్రాహ్మణ ఫ్రంట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులతో సమావేశమై రాజకీయం వైపు క్రీయాశీలక అడుగులు ముందుకేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు బ్రాహ్మణులను, ప్రముఖులను అనంతపురం జిల్లాకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ, జనసేనతోపాటు బ్రాహ్మణ రాజకీయ పార్టీ ఆవిర్భవించనుండటంతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారనున్నదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. బ్రాహ్మణులు తమ ఓటు బ్యాంకునే గాక, తమ శక్తిమేరకు ఇతర కులాల ఓటు బ్యాంకును కూడా ప్రభావితం చేయగలుగుతుందని కొందరు రాజకీయ విశే్లషకులు భావించడంతో బ్రాహ్మణ రాజకీయ ఫ్రంట్‌కు త్వరలో మంచి గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయం బ్రాహ్మణ వర్గాల్లో వ్యక్తవౌతోంది. ప్రజల జీవన అవసరాలు, ప్రాధమిక విద్య, కనీస అవసరాలు, సామాజిక స్పృహకల్పించే అంశాలను ప్రధానంగా ఈ రాజకీయపార్టీ తమ అజెండాలో చేరుస్తున్నట్లు ఆపార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. ఈనెల డిసెంబర్ 2వ తేదీన, 6వ తేదిన కర్నూలు, కాకినాడలో కూడా రాజకీయపార్టీ నిర్ణయంపై బ్రాహ్మణులతో ప్రత్యేక సమావేశమై తొలి అడుగులు వేశారు. ఈమేరకు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో ఈనెల 25వ తేదిన బ్రాహ్మణ సంఘాలు పెద్ద సమావేశం నిర్వహించుకుని క్రియాశీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు.