కడప

అధికారం, అభివృద్ధి మంత్రంపై వైసీపీ ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 15: రానున్న ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని, అధికారుల సాయంతో జిల్లాలో భారీ ఎత్తున రూ.300కోట్లతో చేపట్టిన పథకాలను అడ్డుకునే దిశగా వైసీపీ నేతలు జిల్లాపరిషత్‌ను వేదికగా చేసుకున్నారు. అందరూ ఒకే దిశగా అధికారులను కట్టడిచేసే విధంగా పావులు కదిపారు. దీంతో ఏకంగా జిల్లా కలెక్టర్‌ను సైతం టార్గెట్ చేసుకుని, ఒకవైపు తెలుగుదేశంపార్టీ నేతల అవినీతి అక్రమాలపై ఆరోపణలు చేస్తూ అధికారులు సహకరిస్తున్నారు, రానున్ననది తమప్రభుత్వమే, సెంట్రల్ విజిలెన్స్‌కు మీపై విచారణకు డిమాండ్ చేస్తాం, 2013లో ఉన్న జీవో ప్రకారమే పనులుచేయాలి, లేకపోతే ఉద్యోగులుగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ వైసీపీ నేతలు కలిసికట్టుగా జిల్లా యంత్రాంగంపై ఎదురుదాడికి పూనుకుని ముప్పేట దాడి నిర్వహించారు. జిల్లా పరిషత్‌లో శనివారం చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం మూడున్నర గంటలపాటు కేవలం ఒక ఉపాధిహామీ పథకంపైనే సాగింది. ఇందులో సభాపర్వం ప్రారంభమైనప్పటి నుండి ముగిసే వరకు ఈ పథకంపై ఎమ్మెల్యేలు ఏకధాటిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు తేరుకుని మాట్లాడే లోపలే మీరేంచేస్తున్నారు అంటూ క్షణాల్లో సమాచారం చెప్పేలోపే ప్రశ్నల దాడి మొదలుపెట్టారు. ఒక దశలో పంచాయతీరాజ్ ఎస్‌ఇపై ప్రశ్నలవర్షం కురిపించడంతో ఆయన నిశే్చష్టులయ్యారు. ఎమ్మెల్యేలు కూడబలుకున్నట్లుగా అందరూ ఒకే పథకం అమలుపై ఎడాపెడా అధికారులపై బాణాలు సంధించారు. ఒక దశలో జిల్లా కలెక్టర్‌పై మీరు జిల్లా అధికారులనే తక్కువ చేసి చూస్తున్నారు, మీపట్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉంది, మీరే అడ్మిస్ట్రేషన్ నడిపించలేకపోతున్నారు. అధికారపార్టీకి అండదండగా ఉంటున్నారంటూ ఏకంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుప్రసాదరెడ్డి కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. దీంతో కలెక్టర్ సైతం రాచమల్లు ప్రసాదరెడ్డి తీరుపై విస్మయం వ్యక్తంచేసే పరిస్థితి రాగా, మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అధికారులను టార్గెట్ చేసుకుని వారిని కించపరుస్తూ బెదిరిస్తూ జిల్లాలో అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. పథకం తీరు అమలు వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించగా, అక్రమాలు జరగలేదంటూ బద్వేలు ఎమ్మెల్యే జయరాములు అడ్డుకోగా, ఆయనపై సైతం వ్యక్తిగత దాడికి దిగారు. వైసీపీ నుంచి పారిపోయి తెలుగుదేశంపార్టీ నుండి కోట్లరూపాయలు దండుకున్న జయరాములు తమకు నీతులుచెప్పే అర్హతలేదని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లుప్రసాదరెడ్డిలు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. దీంతో తాను ఎస్సీని కావడంతోనే తనను అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈనేపధ్యంలో మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు పక్కనపెట్టి, పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించకుండా, తీర్మానాలు లేకుండా ఇష్టానుసారంగా కోట్లాదిరూపాయల నిధులతో అనేక పనులు చేపట్టారని , అనేకచోట్ల అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయని మైదుకూరుకు సుధాకర్ యాదవ్‌ను కలెక్టర్‌గా నియమించారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ పనుల అక్రమాల వ్యవహారంపై ఎమ్మెల్యేగా ఉంటూ తాను ఫిర్యాదు చేసినా స్పందించే నాధుడే లేడని విరుచుకుపడ్డారు. రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 200పనులు చేపట్టారని, ఒకచోట పనిచేపట్టాల్సివుండగా మరొకచోట పనిచేస్తున్నారని, అధికారులు, సిబ్బంది లేరని దీన్ని తాను నిరూపిస్తానంటూ సవాల్ విసిరారు. దీనిపై కలెక్టర్ కలుగచేసుకుంటూ విచారణ జరిపిస్తామని ఇందుకు తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ఈపనులు చేపట్టడంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను వివరించాల్సిందిగా జిల్లాకలెక్టర్ పంచాయతీరాజ్ ఈఈకి సూచించగా, ఆయన సమాధానం చెప్పేలోగా రాచమల్లు లేచి మీరు చెప్పేది అబద్ధం ఇదుగో ఏఈతో మాట్లాడుతా మైకులో వినిపిస్తా నువ్వు సిద్దమా అంటూ ఈఈని నిలదీయడంతో కలెక్టర్ సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సైతం ఈఈకి సబ్జెక్టుపై నాలెడ్జ్ లేదా ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో అధికారులు చెప్పనీయకుండా నీ అంత వేగంగా మాట్లాడటం అధికారులకు ఉండదని స్పష్టం చేశారు. ఈదశలో రాచమల్లు జోక్యం చేసుకుంటూ జిల్లాకలెక్టర్ కిందిస్థాయి సిబ్బందిని తక్కువ చేసి చూస్తున్నారని అధికారులే చెప్పుకుంటున్నారని ఆరోపించారు. దీంతో నువ్వు సక్రమంగా చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించడంతో మంత్రి ఆదినారాయణరెడ్డి ఇదేమి తీరు కలెక్టర్‌ను సైతం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు, ఇలా అధికారులను బెదిరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అయితే తాను కలెక్టర్‌పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని, అందుకు బాధగా ఉంటే క్షమించాలని కోరారు. ఇలా జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా ముగిసింది.