కడప

18న జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కడప పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,జనవరి 16: ఈనెల 18వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కడప జిల్లాలో పర్యటించనున్నట్లు బుధవారం నగరంలోని శ్రీనివాస రెసిడెన్షిలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకుడుగా చంద్రబాబునాయుడు మారారన్నారు. చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాల కాలంలో చెప్పిన అబద్దాలు, చేసిన అవినీతితోనే పరిపాలన సాగించారన్నారు. ఏపీకి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నిజంగా రాయలసీమపై చిత్తశుద్దివుంటే హైకోర్టును రాయలసీమలో ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నించారు. భారతదేశ అభివృద్ధికోసం నిరంతరం కృషిచేసే ప్రధాని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆయన మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రానికి లక్షలకోట్లరూపాయల నిధులు ,కర్నూలులో సోలార్ ప్లాంట్, రాయలసీమలో ట్రిబుల్ ఐటిలు ఏర్పాటుచేసిన ఘనత బీజేపీదే అన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే స్టీల్ ప్లాంట్‌కు పునాదులు వేశారని, అభివృద్ధికోసం కాదన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తామన్నారు. ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లు , ఏపీకి గృసనిర్మాణం, మరుగుదొడ్లు ఇచ్చింది కేంద్రమే అన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కేంద్రమే అన్నారు. అలాంటి కేంద్రాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు. యువత చంద్రబాబు చొక్కాపట్టుకుని నిలదీస్తే నిజాలు బహిర్గతవౌతాయన్నారు. ఫిబ్రవరి 1న బీజేపీ బస్సు యాత్ర శ్రీకాకుళం నుండి ప్రారంభవౌతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్రప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్, సుంకర శ్రీనివాసులు, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, శశిభూషణ్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, రమేష్‌నాయుడు, బీజేవైఎం పవన్, శివ తదితరులు పాల్గొన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయితే జిల్లా అభివృద్ధి
* నటుడు పోసాని మురళీకృష్ణ
చెన్నూరు,జనవరి 16: రాష్టమ్రుఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధి చెందుతుందని రచయిత, నటుడు పోసాని మురళీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కడప విమానాశ్రయం నుంచి మార్గమద్యలో కడపకు వెళ్తుండగా టోల్‌గేట్ వద్ద సర్కిల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పోసాని మాట్లాడుతూ తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలను అభినందిస్తున్నారని, ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కడప జిల్లా చాలా వెనుకబడి వుందని, పరిశ్రమలతోపాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా జిల్లాకు వస్తాయన్నారు.

జగన్ సీఎం కావాలని అంజన్నకు రోజా పూజలు
చక్రాయపేట, జనవరి 16: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బుధవారం సాయంత్రం గండి క్షేత్రానికి చేరుకున్న నగిరి ఎమ్మెల్యే రోజా, సినీ డైరెక్టర్ ఆర్‌కే శెల్వమణి శ్రీ గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుతగా ప్రధాన అర్చకులు కేసరి, రాజారాంలు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం గండి వీరాంజనేయస్వామి ఆలయంలో జగన్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి ఆలయ ఆవరణంలో శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబేపల్లె మాజీ జడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి, ఆయన సోదరుడు రమేష్‌రెడ్డి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, సాయిరజితారెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.