కడప

ఘనంగా ముగిసిన కనుమ పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్,16: సంక్రాంతి పండుగలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా కనుమ పండుగ ఘనంగా ముగిసింది. పట్టణాల్లో అంతంతమాత్రంగానే పండుగ సంబరాలు కన్పించినా గ్రామీణ ప్రాంతాల్లో కనుమ ఘనంగా జరుపుకున్నారు. కొత్త అల్లుళ్లకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతి పండుగ గ్రామీణ ప్రాంతాల్లో సందడిగానే జరిగింది. గ్రామాల్లో ఆనవాయితీగా కోడిపందేలు, పేకాటలు ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలను తలపించే విధంగా సంప్రదాయాలే కాకుండా జూదం యధేచ్చగా కొనసాగిందని చెప్పవచ్చు. దశాబ్దకాలం నుంచి జిల్లా రైతాంగాన్ని వరుస కరువులు వెంటాడుతుండటం, కొత్త పంటల దిగుబడితో ప్రారంభమయ్యే సంక్రాంతి ఈ ఏడాదికి కూడా అనావృష్టి, అతివృష్టితో అప్పులు చేసుకుని గ్రామీణప్రాంతాల్లో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, గాలిపటాలు, వివిధ సంప్రదాయ ఆట పాటలతో గ్రామీణ ప్రాంతాలు సంప్రదాయంతో హోరెత్తేవి. కరవుకారణంగా సంప్రదాయాలన్నీ కేవలం మొక్కుబడి కనిపించాయని చెప్పవచ్చు. ప్రభుత్వమేమో అట్టహాసంగా సంక్రాంతి పండుగను ప్రభుత్వ పండుగగా దాదాపు కోటి రూపాయలు ఖర్చుచేసి గ్రామీణ ప్రాంత ఆటలు, సంప్రదాయాలు మరిచిపోకుండా మొక్కుబడిగానే ముగ్గులు, కబడ్డీ, జానపద నృత్యాలు తదితర పోటీలకే పరిమితం అయ్యాయి. తొలిరోజు సోమవారం భోగిపండుగను గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత అంగరంగ వైభవోపేతంగా ఇళ్ల ముందర లోగిళ్ళు ముగ్గులతో , గుమ్మడి పూల ప్రదర్శన, గొబ్బెమ్మలు, రేగిపండ్లతో తలంటు స్నానాలు, పాతవస్తువులతోపాటు భోగికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న కొయ్యలన్నింటినీ ఇంటిముందు వేసి తగులబెట్టి ఒక పక్క చలిమంటలు, మరోపక్క కాంచిన భోగినీటితో స్నానాలు ఆచరించారు. మంగళవారం దేవాలయాల్లో, ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడికాయలతో దిష్టితీసి పెద్ద ఎత్తున గుమ్మడికాయలు కొట్టారు. అలాగే పెద్దలను స్మరించుకునేందుకు పిండివంటలు తయారుచేసి గతించిన వారికి అత్యంత ప్రీతికరమైన వంటకాలు తయారుచేసి సమాధుల వద్ద వుంచి తర్పణం వదిలారు. ఏటా తమ పొలాల్లో పండిన అలసందల ద్వారా వడలు, వివిధ రకాల వంటకాలు, మాంసాహారంతో విందు ఆరగించారు. ముఖ్యంగా గంగిరెద్దులు, హరిదాసులు, గొబ్బెమ్మల ప్రదర్శనలతో పాటు తమ ఇళ్లల్లో ఉన్న పశువులకు వివిధ రకాల రంగులతో ముస్తాబుచేసి సాయంత్రం తమ పంటపొలల్లో పార్వేట నిర్వహించారు. అంతేగాకుండా బండ్లు, బండలాగే పోటీలు నిర్వహించడానికి కూడా జూదం తరహాలో చేసి పందేలు లక్షల రూపాయల్లో కాశారని తెలుస్తోంది. అలాగే టెంకాయల విసిరి వేసే పోటీలు, టెంకాయలు పగులకొట్టే పోటీలు, కుందేళ్ల పందేలు, పొట్టేళ్ల పందేలు, కోడిపందేలు, ఎద్దలపోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. న్యాయస్థానాలు, చట్టాలు,ప్రభుత్వం కోడిపందేలు, జూదాలు నిర్వహించరాదని కఠినంగా ప్రకటించినా ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనూ పోటీలు నిర్వహిస్తుంటే తాము నిర్వహిస్తేతప్పేమిటని జిల్లాలో పలువురు యథేచ్ఛగా, బహిరంగంగా పందేలు, పోటీలు నిర్వహించారని తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో సంక్రాంతి సంబరాలు మూడురోజుల పాటు ఒక మోస్తరులో నిర్వహించారని చెప్పకతప్పదు.