కడప

పెరిగిన సాగు ఖర్చులు...తగ్గిన దిగుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,జనవరి 16: మామూలుగా ఉల్లిని తరిగేటప్పుడు కన్నీళ్లొస్తాయి..కానీ కేపీ ఉల్లిదిగుబడి తగ్గి చేతికొచ్చిన ఉల్లి రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. దిగుబడి అరకొర చేతికొచ్చినా ఆశించిన కనీస మద్దతుధర లభించక కేపీ ఉల్లిరైతులు అష్టకష్టాలతో బతుకీడుస్తున్నారు. భూదేవిని నమ్ముకుని పెట్టుబడి పెట్టి జిల్లాలో ఉల్లిపంటలు సాగుచేసిన రైతన్నకు చేదు అనుభవం ఎదురైంది. ఓ వైపు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అలుముకున్నాయి. పంటమీద పెట్టిన పెట్టుబడికి రావాల్సినంత దిగుబడులు రాకపోవడంతో జిల్లాలోని ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాగు ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడంతో వర్షాభావంతో దిగుబడులు తగ్గిపోవడంతో చేతికొచ్చిన అరకొర ఉల్లిపంటకు గిట్టుబాటు ధరలేక రైతులు నిరాశతో ఉన్నారు. క్వింటా ధర రూ.4వేలు ఇస్తే ఉల్లి రైతుకు ఊరట కలుగుతుందని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాల్సిన తరుణంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడంలో జిల్లా అధికారులు నేటికీ తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ఇటీవల రాష్టమ్రార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి జిల్లాలో ఉల్లిపంట సాగుచేసిన ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. మైదుకూరు నియోజకవర్గంలోని బండివారిపల్లిలో రైతులు సాగుచేసిన ఉల్లిపంటను ఆయన అధికారుల బృందంతో పరిశీలించారు. రైతులకు సత్వర న్యాయం చేయడంలో రాష్ట్రప్రభుత్వం తీవ్ర జాప్యంతో రంగంలోకి ప్రవేశించిన కొంతమంది దళారీ వ్యాపారులు రైతుల ఇబ్బందులను ఆసరాగా తీసుకుని తక్కువ ధరకు ఉల్లి కొనుగోలును పంట పొలాల్లోకి వెళ్లి సిద్దపడుతున్నారు. అయితే ఈ దళారులు సిండికేట్‌గా మారి క్వింటా రూ.3వేలు ధర పలుకుతున్న ఉల్లిధరను, అమాంతంగా కట్టడి చేశారు. ప్రస్తుతం కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో, ప్రభుత్వం చేయూతనివ్వడంలో జాప్యం చేయడంతో ఉల్లిపంట నిల్వలను, సంరక్షణ చూసుకోవడంలో రైతులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంట నిల్వచేయడంలో గిడ్డంగులు లేకపోవడంతో జిల్లాలో పంట పాడవుతుందనే భావన ఉల్లిరైతులను వెంటాడుతోంది. దీన్ని ఆసరా చేసుకున్న సిండికేట్ వ్యాపారులు క్వింటా ధర రూ.1500కు నిర్ణయించి కొనుగోలు చేసేందుకు సిద్దపడ్డారు. ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ మరోమార్గం లేదు. జిల్లా వ్యాప్తంగా కేపీ ఉల్లిపంటను దువ్వూరు మండలంలోని వివిధ గ్రామాల్లో, మైదుకూరు నియోజకవర్గంలోని కొన్నిగ్రామాల్లో, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మరి కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు ఉల్లిపంటను సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా 850హెక్టార్లలో కేపీ ఉల్లిపంటను సాగుచేసినట్లు ఉద్యాన అధికారి నాగరాజు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కేపీ ఉల్లిపంట కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాకు రూ.4వేలు కనీస మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ కేంద్రాల ద్వారా ఉల్లిపంటను కొనుగోలు చేయాలని పంటలు సాగుచేసిన రైతులు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. రైతులు ఎకరా ఉల్లిపంటసాగుకు రూ.60వేలు ఖర్చుచేశారు. రైతుల దామాషా ప్రకారం ఎకరాకు రూ.25నుంచి 30క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. సాగు ఖర్చులకు ఆధారంగా చేసుకుని ప్రభుత్వం తమ పంటకు క్వింటాకు రూ.4వేలు మద్దతు ధర నిర్ణయించాలని ఉల్లిరైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లిరైతులు పోలు కొండారెడ్డి, దస్తగిరిరెడ్డితోపాటు మరికొంతమంది రైతులు మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
త్వరలో కొనుగోలు కేంద్రాలు
రాష్టస్థ్రాయి ఉన్నతాధికారుల ఆదేశాలు జిల్లాకు అందిన వెంటనే కొనుగోలు కేంద్రాలు రైతులు కోరినచోట, వారికి సౌలభ్యం ఉన్నచోట కేపీ ఉల్లిపంటను కొనుగోలు చేస్తామని ఉద్యానపంట జిల్లా మేనేజర్ సుమంత్‌రెడ్డి తెలిపారు. ఈప్రక్రియ ఉద్యాన అధికారి నాగరాజు పర్యవేక్షిస్తారన్నారు. త్వరలో కేపీ ఉల్లిరైతు పంటను కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.

ప్రభుత్వ పథకాల అమలుపై అధికారుల అనే్వషణ
* పసుపు కుంకుమ, పెన్షన్ల పెంపుపై నివేదికలకు అధికారుల దృష్టి
* జన్మభూమి ద్వారా మరో 10వేల మంది పెన్షన్లకు దరఖాస్తులు
* రెండురోజుల్లో పూర్తిస్థాయి నివేదికలు
కడప,జనవరి 16: రాష్ట్రప్రభుత్వం ఇటీవల పెన్షన్ దారులకు రెండింతలు సహాయం పెంచడం, కొత్తగా పలువురికి పెన్షన్లు మంజూరు చేయడం, మరోవైపు పసుపుకుంకుమ ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ఉచితంగా సహాయం అందించడం వంటి నిర్ణయాలు తీసుకున్న నేపధ్యంలో జిల్లాయంత్రాంగం పూర్తిస్థాయిలో వీటిపై నివేదికలకు సిద్ధమైంది. సంక్రాంతి సెలవుల కారణంగా ఈనెల 20వ తేదీ వరకు కార్యాలయాలు పనిచేయక పోవడంతో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా పలు పథకాలకు సంబంధించిన కీలక నిర్ణయాలపై జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు మూడురోజుల్లో ప్రభుత్వం చేపట్టిన పెన్షన్లు, పసుపుకుంకుమ వంటి పథకాలపై ఎంతమంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్దిచేకూర నుంది, జిల్లాకు ఎంతమేరకు నిధులు కావాల్సివుంది అనే విషయాలపై నివేదికలు రూపొందించనున్నారు. ప్రధానంగా పసుపుకుంకుమ కింద గతంలో ఒక్కో మహిళకు రూ.3వేలు వంతున మంజూరు చేశారు. తాజాగా రూ.10వేలు మంజూరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 86లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఇప్పటి వరకు 8,600కోట్లరూపాయల మేరకు లబ్ధిపొందనున్నారు. ఇందులో జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా నాలుగు విడతల్లో రూ.316.45కోట్లు మొదటి విడతగా పంపిణీ చేశారు. రికార్డుల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 33,259 మహిళా సంఘాలు లబ్ధిపొందాయి. ఇంకా 701మంది సభ్యులకు ఈపథకం కింద సహాయం అందలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం తాజాగా పసుపు కుంకుమ కింద ప్రతి సభ్యురాలికి రూ.10వేలు ఉచితంగా ప్రకటించింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి ఏమేరకు ఈ సహాయం అందుతుందోనన్న దానిపై అధికారులు దృష్టిపెట్టారు. అలాగే జిల్లాలో వృద్దులు, వితంతువులు, వికలాంగులు సుమారు లక్షమందికి పైగా పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధులకు, వితంతువులకు ఇప్పటి వరకు పెన్షన్ ఒక్కొక్కరికి నెలకు రూ.1000లు ఇస్తుండగా, తాజాగా రూ.2వేలకు పెంచారు. మరోవైపు వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3వేలకు పెన్షన్లు పెంచారు. ఇదే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు సైతం కొత్తగా రూ.2వేలు వంతున పెన్షన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపధ్యంలో పెరిగిన పెన్షన్ల ఆర్థికభారంపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించబోతోంది. తాజాగా ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఈపెన్షన్లకోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దీంతో అధికారులు ఈపెన్షన్ల వ్యవహారంపై జిల్లాకు ఎంత నిధులు కావాలి, ఎంతమేరకు నిధులు అవసరం అనే వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో వివిధ పథకాల కింద మెప్మా, డ్వామా శాఖల ద్వారా అనేక రకాల పథకాల కింద లబ్ధిదారులకు సహాయం అందిస్తున్నారు. ఈ రెండుశాఖలు సంయుక్తంగా గతంలో ఉన్న పెన్షన్ దారులకు వారికి పెంచిన పెన్షన్లు ఇటీవల జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులపై జిల్లాకు ఏమేరకు ఈపథకాల ద్వారా నిధులు అవసరవౌతాయన్న సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. దీంతో రెండురోజుల్లో పూర్తిస్థాయిలో రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు పంపనున్నారు. 11రోజులుగా జిల్లా అంతటా 51మండలాల్లో నిర్వహించిన ఆరవ విడత జన్మభూమి కార్యక్రమంలో వివిధ రకాల పెన్షన్లకోసం వచ్చిన దరఖాస్తులపై పరిశీలన చేపట్టనున్నారు. జన్మభూమి సమావేశాలపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి ప్రతి గ్రామపంచాయతి నుండి వచ్చిన దరఖాస్తులపై ఎప్పటికప్పుడు విశే్లషించి వీటిపై పూర్తిస్థాయి దృష్టిపెట్టారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారుల అర్హతలను బట్టి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. తాజాగా 45సంవత్సరాలు నిండిన ప్రతి రజకునికి పెన్షన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా అధికారులు దృష్టిపెట్టారు. దీంతో ఈపెన్షన్ల మంజూరులో జిల్లా వ్యాప్తంగా పెంచిన పెన్షన్ల ద్వారా సుమారు రూ.500కోట్ల వరకు అదనంగా భారం పడే పరిస్థితివుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి అదనపు పెన్షన్ భారం, కొత్తగా పెన్షన్ల మంజూరు, పసుపుకుంకుమ ద్వారా ప్రతి సభ్యురాలికి రూ.10వేలు వంతున మంజూరు వంటివాటిపై పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించాలని కలెక్టర్ ఇప్పటికే ఆయాశాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు జిల్లా ప్రణాళికశాఖ సైతం మండలస్థాయిలో వివరాలు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంపై పడనున్న ఈభారీ భారంపై రెండురోజుల్లో సమగ్ర నివేదిక రాష్ట్రప్రభుత్వానికి అందనుంది.

ఫెడరల్ ఫ్రెంట్ అజెండా ఏమిటో తెలపాలి
* మాజీ ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు, జనవరి 16: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రంలో ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు అవుతుందని తెలపడం, ఫెడరల్ ఫ్రెంట్ రహస్య అజెండా ఏమిటో ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక నెహ్రూరోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేకృథ్వంలో ప్రస్తుతం ఉన్న తెలంగాణ జిల్లాలు కూడా ఎంతో అభివృద్ది సాదించాయన్నారు. అలాగే హైదరాబాద్‌లో అసెంబ్లీని నిర్మించి సర్వాంగ సుందర హంగులతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సవతి తల్లి ప్రేమను కనపరించిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం మద్దతు తెలుపలేదని అలాంటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో జగన్‌మోహన్‌రెడ్డి చేతులు కలపడం ఏమిటని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రెంట్ అనేది నరేంద్ర మోదీ కనుసన్నలలో ఏర్పడుతుందని అందుకు కెసిఆర్, జగన్ వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నా ప్రతి పక్షనేత జగన్‌కు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతున్నారని హెచ్చరించారు.