కడప

ప్రజలకు సేవ చేసేవాళ్లకు టీడీపీలో స్థానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, జనవరి 23: ప్రజలకు సేవ చేసే వారికి తెలుగుదేశం పార్టీలో స్థానం లేదని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేంపల్లెలో విలేఖరులతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజలకు సేవ చేస్తుంటే ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నుండి తాను వైదొలిగానన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించానన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేసే విధంగా రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు సేవచేయాలంటే మనకు ప్రస్తుతం ఉన్న ఏకైక నాయకుడు వైఎస్‌ఆర్ కుమారుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆయన అన్నారు. విప్‌కు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. ఈనెల 31వ తేదీన హైదరాబాద్‌లోని లోటస్‌ఫాండ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పించుకొని తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు జగన్ ఆదేశిస్తే ఏ పనైనా చేస్తానన్నారు. రాజంపేటలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైకాపా జెండా ఎగురవేస్తామన్నారు. వైకాపా శ్రేణులతో కలిసికట్టుగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు సేవ చేయడమే మార్గం ఉన్న వారికి తెలుగుదేశం పార్టీలో తావులేదన్నారు. నాలాగా మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయన వెంట ఎమ్యెల్యే అనుచరులు, వేంపల్లె వైకాపా కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డి, వైకాపా నాయకులు మునీర్, చలపతి, నిస్సార్, ఆర్ ఎల్‌వీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌కు ఎమ్మెల్యే మేడా ఘననివాళి
వేంపల్లె, జనవరి 23: వేంపల్లె మండలం ఇడుపులపాయలో బుధవారం రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయ ఘాట్‌లో ఉన్న వైఎస్‌ఆర్ సమాధి వద్ద ఎమ్మెల్యే మేడా పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి కూడా ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. దివంగత నేత వైఎస్ ఆర్‌కు, తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకొని కాసేపు ఆయన వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా అనుచరులు, వేంపల్లె వైకాపా మండల కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డి, వైకాపా నాయకులు మునీర్ చలపతి, నిస్సార్, ఆర్‌ఎల్‌వీ ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.