కడప

25న ‘పసుపు కుంకుమ’కు సిఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 23: డ్వాక్రా మహిళలకు ‘పసుపు కుంకుమ’ పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 25న కడపకు వస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపధ్యంలో ముఖ్యమంత్రి తొలుత జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డ్వాక్రా మహిళలు నెలకు రూ.10వేలు ఆదాయాన్ని చేకూర్చుకునే విధంగా ప్రోత్సహించేందుకు, వారికి ఒక్కొక్కరికీ రూ.10వేలు (మూడు దశల్లో) నేరుగా వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతోంది. ఈ రూ.10వేలు డ్వాక్రా మహిళలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని వారికి ‘పసుపు కుంకుమ’గా ప్రభుత్వం అందించనుంది. ఈ పసుపుకుంకుమ పథకం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి సభకు డ్వాక్రా మహిళలను తీసుకురావడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ముమ్మర చర్యలు చేపట్టింది. ఈనేపధ్యంలో బుధవారం, గురువారం, శుక్రవారం జిల్లాలోని 51 మండలాల్లో డ్వాక్రా మహిళలతో మండల స్థాయి అధికారులు సమావేశం నిర్వహించుకుని పసుపుకుంకుమ పథకం ప్రాధాన్యతను వివరించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి కార్యక్రమానికి మహిళలందరూ హాజరయ్యేవిధంగా అధికారులు డ్వాక్రా సంఘాలకు దిశ దశ నిర్దేశం చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం విజయవంతం చేసేందుకు గ్రూపులోని సభ్యులందరూ అందరూ హాజరయ్యే విధంగా మండల కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో డ్వాక్రా మహిళలు చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ ఫలాలు లబ్దిపొందేవిధానం గురించి నేరుగా ముఖ్యమంత్రి మహిళలతో మాట్లాడనున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం రెండుమార్లు ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పథకంతోపాటు ఇటీవల 12 రకాల పెన్షన్లను పెంచిన వాటిపై కూడా డ్వాక్రా మహిళలు గ్రామస్థాయిలోని లబ్దిదారులను చైతన్యం చేసేవిధంగా గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు తీసుకుంటోంది. సంక్షేమ ఫలాల వివరాలను డ్వాక్రా మహిళల ద్వారానే గ్రామాలకు చేరవేసి ప్రభుత్వానికి మద్దతును కూడగట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి హాజరౌతున్న కార్యక్రమానికి డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉన్నందున డ్వాక్రా మహిళలను మండలస్థాయి , పట్టణస్థాయి, జిల్లాస్థాయి అధికారులు సమాయత్తం చేస్తున్నారు.

బీసీలు అన్ని రంగాలలో ఎదగాలి
* ఎంపీ నిమ్మల క్రిష్ణప్ప
ప్రొద్దుటూరు, జనవరి 23: వెనుకబడిన తరగతుల వారు అన్ని రంగాలలో ఎదగాలని ఎంపీ నిమ్మల క్రిష్టప్ప పిలుపునిచ్చారు. పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండలంలో బీసీల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన క్రిష్ణప్ప మాట్లాడుతూ రాజకీయల్లో బీసీలు మరింతగా ఎదగాలని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఏళ్ల తరబడి పదవుల్లో ఉంటున్నారని, బీసీలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇందుకోసం బీసీ సామాజికవర్గానికి చెందిన బొర్రా రామాంజనేయులు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకం అన్నారు. బీసీలకు టీడీపీ వెన్నంటి ఉండి సంక్షేమ పథకాలను అందిస్తోందని ఆయన తెలిపారు. బీసీ అభ్యర్థిని సమిష్టి కృషితో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ బీసీల్లో ఎంతో మంది వెనుకబడిన వారుస ఉన్నందున వీరికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతుల సురేష్, నీతమ్మ, మహిళా నాయకురాలు సరళదేవి, మునిసిపల్ వైస్ ఛైర్మెన్ జబివుల్లా, పాణ్యం సుబ్బరాయుడు, శ్రీనివాస్, వనితరాజ, తదితరులు పాల్గొన్నారు.