కడప

గందరగోళం..రాజంపేట రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జనవరి 23: రాజంపేట శాసనసభ్యులు మల్లిఖార్జునరెడ్డిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడం, వెంటనే ఆయన వైసీపీ అధినేత జగన్‌ని కలవడంతో నెలకొన్న పరిణామాలతో రాజంపేట రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరన్నది తెలియక ఈ రెండు పార్టీల కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. రాజంపేట వైసీపీ ఇన్‌చార్జిగా నాలుగున్నర సంవత్సరాలుగా ఆకేపాటి అమర్‌నాథరెడ్డి వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆకేపాటికే వైసీపీ టిక్కెట్ దక్కుతుందని అంతా భావించారు. పార్టీలో ఆకేపాటికి పోటీగా టిక్కెట్ ఆశించేవారు ఎవ్వరూ లేరు. అయితే, ఈ నెల 31న మేడా వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ సజావుగా ముందుకు వెళుతున్న ఆ పార్టీలో గందరగోళం ఏర్పడింది. మేడాకు జగన్ ఇచ్చిన హామీ ఏంటో తెలియదు. రానున్న ఎన్నికల్లో రాజంపేట వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని అమర్‌నాథరెడ్డి చెపుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఈ ఇద్దరి నేతలను ఏ విధంగా సమన్వయం చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకరికి ఎమ్మెల్యే, ఒకరికి ఎంపీ అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తారన్న ఊహాగానాలు కూడా ఈ పార్టీ శ్రేణుల నుండి వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి మిథున్‌రెడ్డి టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ కోరిక మేరకు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎంపీ మిథున్‌రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. అందువలన మిథున్‌రెడ్డిని కాదని మరొకరికి ఎంపీ అభ్యర్థిత్వం పార్టీ అధిష్టానం ఖరారు చేసే పరిస్థితి ఏ మాత్రం కనిపించడంలేదు.
ఇక అధికార తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, అక్కడ కూడా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి ఎవరన్నది డైలమాలో ఉంది. అమరావతిలో జరిగిన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో అభ్యర్థి ఎవరో ఏకగ్రీవంగా నిర్ణయించి తెలియజేయాలని పార్టీ అధినేత చంద్రబాబు కోరినా, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తామే రాజంపేటలో బలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తామని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు చెప్పారు. అభ్యర్థి కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సి వస్తుందని చెప్పక తప్పదు.
నియోజకవర్గంలోని సామాజికవర్గాల ఓటర్ల సంఖ్య ఆధారంగా అభ్యర్థిని నియమించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బలిజ లేదా రాజు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వచ్చని భోగట్టా. ఇప్పటికే ఈ రెండు సామాజికవర్గాల్లో టిక్కెట్ ఆశిస్తున్న వారు చంద్రబాబుకు దగ్గరవుతున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి అండగా ఉంటూ వస్తున్న కమ్మ సామాజికవర్గం నుండి తానా అధ్యక్షుడు వేమన సతీష్‌తో పాటు జిల్లా తెలుగుమహిళా మాజీ అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బీసీ వర్గాల నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి డాక్టర్ సీ.సుధాకర్ పేరు కూడా వినిపిస్తోంది. ఏదిఏమైనా రాజంపేట నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితులతో ప్రధాన పక్షాల అభ్యర్థులు ఎవరన్నది ఆయా పార్టీ అధిష్టానాలు ప్రకటించేవరకు కొంతవరకు సస్పెన్స్ కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక జనసేన పార్టీ రంగంలో ఉంటే అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ పార్టీకి బలమైన నాయకుల అండ నియోజకవర్గంలో బహిరంగంగా కనిపించడం లేదు. అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలిచే పరిస్థితులున్నందున ఈ పార్టీల అభ్యర్థులు పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపించడంలేదు. మొత్తానికి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే, మరికొంత సమయం పడుతుంది.

రాజధానిలో మకాంవేసిన నేతలు
* రాజంపేట అభ్యర్థి ఖరారుపై రాయచోరటి నేతల భవితం * కుల సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ ఖరారు
రాయచోటి, జనవరి 23: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాయచోటి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు గత రెండు రోజులుగా రాజధానిలో మకాంవేసి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అయితే కుల, సామాజిక వర్గాలను బేరేజు వేసుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం టిక్కెట్ ఖరారుచేస్తున్న నేపథ్యంలో రాయచోటి పార్టీ టిక్కెట్ ఖరారు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల సామాజిక వర్గాలను సమీకరించుకుని టిక్కెట్ ఖరారు విషయంపై సమీక్షించారు. అయితే అనుకోని రీతిలో రాజంపేట అసెంబ్లీ ఎమ్మెల్యే, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరడం జరిగింది. రాజంపేటలో బలిజ, క్షత్రియ సామాజిక వర్గాల్లో పార్టీ అధిష్టానం టిక్కెట్ అవకాశం కల్పించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాయచోటిలో కూడా రెడ్ల, బలిజ సామాజికవర్గాల మధ్యలో టిక్కెట్ పోటీ నెలకొని ఉంది. క్షత్రియులు మాత్రం రాజంపేట వైపేచూపు పెట్టారు. రాయచోటిలో రెడ్ల సామాజికవర్గంతో పాటు బలిజ సామాజికవర్గం టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. రెడ్ల సామాజికవర్గం నుంచి పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, బలిజ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు తీవ్రస్థాయిలో టిక్కెట్ ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం గత నాలుగేళ్లుగా ఈ ఇరువురి నేతల మధ్య హోరాహోరీ ప్రత్యక్ష, పరోక్ష పోరు కొనసాగుతున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఇరువురి నేతలు తమ తమ ప్రయత్నాల్లో టిక్కెట్ దక్కించుకునేందుకు పోటీకి తలపడుతున్నారు. అయితే అనూహ్య రీతిలో రాజంపేట అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కుల సామాజికవర్గాల వారీగా ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది. అక్కడ క్షత్రియులకు అవకాశం కల్పిస్తే బలిజలకు స్థానం ఉండదని, అందుకే క్షత్రియులనే బరిలో దింపితే రాయచోటిలో బలిజలకు టిక్కెట్ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న రమేష్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌బాబులు గత రెండు రోజులుగా అమరావతిలో మకాంవేసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులతో మరీ పోటీపడి కలుస్తున్నట్లు తెలిసింది. ఇరువర్గాలకు చెందిన నేతలు తమకు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి ప్రకటన రాజంపేటలో అసెంబ్లీ అభ్యర్థి నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పవచ్చును.