కడప

హైకోర్టు బెంచ్ విషయమై చీఫ్‌జస్టిస్‌కు లేఖ రాస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్,్ఫబ్రవరి 6: కడపలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని బుధవారం న్యాయవాదులు జిల్లాకోర్టు గేట్లు మూసివేసి జడ్జిలు, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా న్యాయవాదులు నిరోధించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ మాట్లాడుతూ కడప జిల్లా న్యాయవాదుల హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ద్వారా సమాచారం తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుల్లగూర సుబ్రమణ్యం మాట్లాడుతూ గతంలో కడప న్యాయవాదులు ఎన్నో పోరాటాలు చేశారని, అలాగే అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు కేంద్ర బిందువు కడప అని, ఇక్కడ హైకోర్టు బెంచ్‌కై సమ్మతిని తెలిపారని, కానీ గత నెలలో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటుచేస్తామని పత్రికా ముఖంగా తెలిపారని గుర్తు చేశారు. ఈవిషయంలో మరోసారి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకుని కడపలో బెంచ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని లేనిపక్షంలో కోర్టు విధులను ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదుల ఉపాధ్యక్షుడు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారు కడపలో హైకోర్టు బెంచ్‌కు సుముఖత వ్యక్తం చేశారన్నారు. మాజీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మస్తాన్‌వల్లీ మాట్లాడుతూ 2018 ఫిబ్రవరి నెలలో కడప న్యాయవాదులు భారీ ఎత్తున ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు , వంట-వార్పు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి కడపలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం ఇవ్వగా ఆ విషయంలో సానుకూలంగా స్పందించి ఇప్పుడేమో కర్నూలులో ఏర్పాటుచేస్తామని అనడం శోచనీయమన్నారు. మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుర్రప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో చేసిన హామీని కడప జిల్లా న్యాయవాదులకు చేయకపోవడం శోచనీయమన్నారు. మహిళా న్యాయవాది చంద్రవదన మాట్లాడుతూ ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు న్యాయవాదులు ఉద్యమబాట పట్టారని, కర్నూలులో హైకోర్టు బెంచ్ విషయమై వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, ఆ విషయంలో కక్షిదారులకు, న్యాయవాదులకు అసౌకర్యంగా ఉంటుందని, కేంద్రబిందువైన కడపలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని, ఈవిషయంలో ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. అనంతరం జిల్లాకోర్టు ఎదుట న్యాయవాదులు భారీ సంఖ్యలో రోడ్లపై హైకోర్టు బెంచ్ కావాలని నినాదాలు చేశారు. కొంతవరకు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.