కడప

జమ్మలమడుగు సీటుపై సీఎం రాజీఫార్ములా కుదిరేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,్ఫబ్రవరి 6: రాష్ట్రప్రభుత్వం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఇప్పటికే ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వవిప్‌గా ఉన్న సి.రామసుబ్బారెడ్డిల మద్య సయోధ్యకుదిర్చే మంతనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు దఫాలుగా ఇరువురితో వేర్వేరుగా చర్చలు జరిపారు. బుధవారం కూడా ఈచర్చలు ముఖ్యమంత్రి సమక్షంలో జరిగాయి. అయితే ముఖ్యమంత్రి ఒక రాజీఫార్ములాను తీసుకొచ్చి, ఇద్దరి ముందు ఉంచినట్లు సమాచారం. జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే వారికి, కడప నియోజకవర్గం ఎంపీగా పోటీచేసే వారు ఓడిపోతే వారికే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం ఉంది. గతంలో వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చి అనూహ్యరీతిలో మంత్రి పదవి చేజిక్కించుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి తనకే జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వద్ద విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి కూడా తనకే ఈసారి జమ్మలమడుగు నియోజకవర్గం అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఇద్దరు కలిస్తే జమ్మలమడుగు స్థానంలో గెలుపు సులువుగా చేజిక్కించుకోవడమేగాకుండా కడప ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. సీఎం ఫార్ములా అమలైతే జమ్మలమడుగు రాజకీయం కొలిక్కి వచ్చినట్లే. ద్వితీయ శ్రేణుల్లో, పార్టీ కార్యకర్తల్లో జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిపై నమ్మకాలు పెట్టుకున్న వారికి త్వరగా సీటు విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సివుంది.
ఘనంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దేవునికడపలో ఈనెల 6వ తేదీ నుంచి 15 వరకు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం తిరుచ్చి ధ్వజారోహనంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా నుంచే గాకుండా రాయలసీమలోని వివిధప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఈనెల 10వ తేదిన స్వామివారికి గరుడోత్సవం, 11న కల్యాణోత్సవం, 12వ తేదీన రథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఆరోజు జరిగే రథోత్సవం నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు. అలాగే ప్రతిరోజు స్వామివారిని పెద్దశేషవాహనం, సింహవాహనం, హనుమవాహనం, గరుడవాహనం, గజవాహనం, ధూళి ఉత్సవం, అశ్వవాహనం, చంద్రప్రభవాహనంతోపాటు తదితర వాహనాలపై శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారు వివిధ రకాల అలంకరణలతో ఊరేగుతారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తమ మొక్కుబడులు కూడా తీర్చుకుంటారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. అలాగే సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ వుంటుంది. సాయంత్రం 6.00 గంటల నుంచి టీటీడీ వారిచే హరికథ, కీర్తనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి.

దేవాలయాల అభివృద్ధికి రూ.45కోట్లు నిధులు విడుదల
* దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ
కడప కల్చరల్,్ఫబ్రవరి 6: హిందు ధర్మాన్ని పెంపొందించడానికి, ప్రజల్లో భక్త్భివాలు నెలకొల్పడానికి, ప్రేమ, భక్తి,శాంతం, సహనం, గౌరవం ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు దేవతల నుండే వచ్చాయని దేవాదాయశాఖ కమిషనర్ శంకర్‌బాలాజీ అన్నారు. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం రూ.45కోట్లు విడుదల చేసిందన్నారు. బుధవారం ఆయన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 226 దేవాలయాలను నిర్మించుకునేందుకు రూ.45కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆ దిశగా 2016 నుంచి ఇప్పటి వరకు వివిధ దశల్లో నిధులు ఖర్చుచేశామన్నారు. ఇప్పటికే 140 దేవాలయాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని వివిధ దశల నిర్మాణ పనుల్లో ఉన్నాయన్నారు. వెంటనే పూర్తిచేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 165 దేవాలయాలు నిర్మించుకునేందుకు దేవాదాయశాఖ అనుమతినిచ్చిందన్నారు. ఇందులో ఒక్కొక్క దేవాలయానికి రూ.5లక్షలు చొప్పున , 165దేవాలయాలకు గాను రూ.8.25కోట్లు జిల్లాకు మంజూరైందన్నారు. ఈ నిధులను దశల వారీగా ఖర్చుచేస్తూ త్వరితగతిన దేవాలయాల నిర్మాణాలు భక్త్భివాలు నెలకొల్పే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.