కడప

ఎన్నికలకు సంసిద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 18: రానున్న ఎన్నికలకు అన్నిరకాలుగా పోలీసు యంత్రాంగం అంతా సంసిద్ధం కావాలని, ప్రశాంతమైన శే్వచ్చాయుత పోలింగ్‌కు పోలీసు యంత్రాంగం ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని నూతన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. అభిషేక్ మహంతి స్థానంలో జిల్లాకు కొత్త ఎస్పీగా వచ్చిన రాహుల్‌దేవ్ శర్మ సోమవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీసు జిల్లా కార్యాలయ సమీపంలో ఉన్న పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఎస్పీలు,సిఐలతో జిల్లా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు, ఎర్రచందనం అక్రమరవాణాకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న చెక్‌పోస్టులను మరిన్ని పెంచుతామన్నారు. ఎస్సీ,ఎస్టీకేసులకు ప్రాధాన్యతనిచ్చి దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈకేసుల్లో జాప్యం జరగకూడదన్నారు. అసాంఘిక కార్యకలాపాల, బెట్టింగ్ ,గ్యాంబ్లింగ్‌లపై నిఘా ఉంచాలన్నారు. సబ్ డివిజన్లలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి.లక్ష్మీనారాయణ, ఏఆర్ అదనపు ఎస్పీ రుషీకేశవరెడ్డి, జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో బాబు దొంగహామీలు
* రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడే ఉంది * బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్

కడప,్ఫబ్రవరి 18: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మోసగిస్తూ దొంగ హామీలు ఇస్తున్నారని, రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం కట్టుబడే ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అన్నారు. స్థానిక శ్రీనివాస రెసిడెన్షి కాన్ఫరెన్స్‌హాల్‌లో సోమవారం బీజేపీ రాయలసీమ జిల్లాల పార్లమెంట్, అసెంబ్లీ కన్వీనర్ల ,కో-కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. మీడియాను అనుమతించని ఈసమావేశంలో, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపుకోసం చేయాల్సిన కార్యాచరణపై నాయకులతో ముఖాముఖి చర్చ జరిపారు. వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సమావేశానికి ముందు, సమావేశం కోసం విచ్చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శులు వై.సత్యకుమార్, సునీల్ దేవన్‌లు మీడియాతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సహాయం చేస్తూనే ఉందని, ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే చంద్రబాబుకు నచ్చలేదని ఆరోపించారు. కేంద్రప్రభుత్వాలను తెలుగుదేశం తన పథకాలుగా చెప్పుకుని రాష్ట్రప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో సిగ్గులేకుండా చంద్రబాబు కలిశారని, దీన్ని రాష్ట్రప్రజలు గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా ప్రజల బాగోగులను మరచిన చంద్రబాబు ఎన్నికలప్పుడు వారికి అమలుకాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో వేల ఎకరాలు దోచుకుని, చంద్రబాబు ఆయన వంధి మాగదులు వేలకోట్లరూపాయల ఆస్తులు అక్రమంగా సంపాదించారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని అవినీతిమయం చేశారని, ప్రజల సొమ్ముతో చంద్రబాబు నాయుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, జగన్, బీజేపీలు ఎలా కలిసి పనిచేస్తాయని వారు ప్రశ్నించారు. టీడీపీ నాయకుల మాటలకు అర్థం పర్థం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ దేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని తిరిగి ప్రధానిగా నరేంద్రమోదీయే ప్రమాణస్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. సునీల్ దేవన్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు, రైతులకు పోస్టుడేటెడ్ చెక్కులు ఇచ్చి అటు వారిని, ఇటు ఎన్నికల కమిషన్‌ను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.