కడప

సమాజం గురించి యువత తెలుసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 18: సమాజంలో జరుగుతున్న అనేక మార్పులు, గ్రామీణ స్థాయిలో జరుగుతున్న వ్యవస్థను యువత తెలుసుకుని తమ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని స్టెప్ సీఈవో రామానాయక్ పిలుపునిచ్చారు. సోమవారం కడపలోని జిల్లా పరిషత్ హాల్‌లో స్టెప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర యువజనోత్సవాల్లో భాగంగా 2018,2019 పార్లమెంటరీ విధానం అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా భారతదేశం ఉందని, ఈదేశంలో ఎన్నో కులవ్యవస్థలున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలకు అనుగుణంగా కొనసాగుతూ ప్రజలు కూడా పాలనా సామర్థ్యం ఉన్న నేతలను ఎన్నుకుంటూ పార్లమెంట్ విధానాన్ని సమర్థవంతంగా కొనసాగస్తున్నారన్నారు. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి వ్యవస్థ సమర్థవంతంగా సాగుతూ ప్రజల కష్టాలను తీర్చే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. అందువల్ల ప్రతినిత్యం ప్రజాస్వామ్యవ్యవస్థలోని మార్పులు, అందుకు తగ్గట్టుగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాల్సిన అవశ్యకత యువతపై ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువత కూడా వారికి కావాల్సిన జీవనోపాది, ఉద్యోగ అవకాశాలను రూపొందించుకుని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చెందాలన్నారు. ఆధునిక రంగంలో చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా యువతీ యువకులు తమ భవిష్యత్‌ను చక్కదిద్దుకునేందుకు ఈప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడబోతోందని ఇందుకు తగ్గట్టుగానే యువత కూడా తమ కాళ్లమీద తాము నిలబడి దేశం మరింత ప్రగతి సాధించేందుకు అన్ని విధాల ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం యోగివేమన యూనివర్సిటీ పొలిటికల్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డా.పార్వతీ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఈప్రజాస్వామ్య వ్యవస్థకు ఎలాంటి కులాలు, మతాలు లేవని సర్వమత సమ్మేళమని అందుకే కులానికి, మతానికి సంబంధం లేకుండా ఈవ్యవస్థలో ఎంతోమంది మహానేతలు మహోన్నత పదవులు సాధించారన్నారు. అందువల్ల నేటి యువత భారతదేశం లాంటి ప్రజాస్వామ్యంలో జరుగుతున్న పరిణామాలను, పరిస్థితులను తెలుసుకుని తమవంతు భవిష్యత్‌గా దేశానికి పూర్తిస్థాయి అండదండలు అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వైవీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినయ్‌కుమార్, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డా.రామ్మోహన్‌రెడ్డి, శ్రీహరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, సీహెచ్ ప్రవీణ్‌కుమార్, స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, ఆశాఖకు సంబంధించిన సుబ్బారావు,నారాయణ తదితరులు పాల్గొన్నారు.