కడప

నోటిఫికేషన్ వచ్చేలోపు పనులు ప్రారంభించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 18: జిల్లాలో ఇప్పటికే మంజూరై అంతిమదశలో ఉన్న అభివృద్ధి పనులన్నింటికీ నిబంధనలు పూర్తిచేసి ఈనెల 28లోగా పనులు ప్రారంభింపచేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున అన్నిశాఖల్లో ఇప్పటికే మంజూరైన పనులకు సంబంధించి అంతమ దశలో ఉన్న పనులు, టెండరు దశలో ఉన్నవి, అగ్రిమెంట్ దశలో ఉన్నవాటిని వెంటనే ప్రారంభింపచేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వస్తే పనులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ తర్వాత కొత్త గా ఏ పనులు కూడా మంజూరు చేయరాని స్థితి వస్తుందని, ప్రారంభించిన పనులను కొనసాగించడానికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. మంజూరైన పనులను అమలుచేయడంలో యూజర్ ఏజెన్సీ , ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు ఇద్దరూ బాధ్యత వహించాల్సివుంటుందన్నారు. యూజర్ ఏజెన్సీశాఖ ఎగ్జిక్యూటివ్ శాఖను వత్తిడిచేసి పనులు మొదలయ్యేలా పర్యవేక్షించాల్సివుంటుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 50మంది తహశీల్దార్లు బదిలీ కాగా వారిని సోమవారం రిలీవ్ చేశామని, మంగళవారం 30మంది ఎంపీడీవోలను రిలీవ్ చేయనున్నామని కలెక్టర్ తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి పనులు ప్రారంభించి ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు అన్నిశాఖలను వారి సిబ్బంది వివరాలు పంపాలని కోరినా, ఇంకా 25శాఖల నుంచి వివరాలు అందాల్సివుందని, బుధవారం లోగా పంపించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు, ట్రైనీ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, జేసీ-2 శివారెడ్డి, ప్రత్యేక కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి, డీఆర్వో రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు.

కేపీ ఉల్లిగడ్డల కొనుగోలు నిలిపివేతను నిరసిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో
జాతీయ రహదారి దిగ్బంధం
* మార్క్‌ఫెడ్ అధికారులు తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్
మైదుకూరు,్ఫబ్రవరి 18:మైదుకూరు మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కేపీ ఉల్లిగడ్డలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఈనెల 5వ తేదిన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గత నాలుగురోజుల నుంచి మార్క్‌ఫెడ్ అధికారులు రైతుల నుంచి కేపీ ఉల్లిగడ్డలు కొనుగోలు చేయడం నిలిపివేసింది. దీంతో కేపీ ఉల్లిరైతులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. దీంతో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్రు, ఉపాద్యక్షుడు డి.మల్లికార్జునరెడ్డి, సీపీఐ ఏరియా కార్యదర్శి పి.శ్రీరాములు, సీఐటీయూ ప్రతినిధి నరసింహరాజు తదితరులు కేపీ ఉల్లి రైతులతో కలిసి మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం సమీపంలోని కర్నూలు-చిత్తూరు 14వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం కేపీ ఉల్లిగడ్డలు వేసి బైటాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఈనెల 5న కొనుగోలు కేంద్రం ప్రారంభించారని, అధికారుల అనాలోచిత నిర్ణయాలవల్ల ఉల్లి కొనుగోలు నిలిపివేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గత ఐదారురోజులుగా రాత్రిం బవళ్లు ఇక్కట్లకు గురౌతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తక్షణమే ఉల్లి కొనుగోలు ప్రారంభించి రైతుల నుంచి పూర్తిస్థాయి సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము తీవ్రస్థాయిలో ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈసందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. కడప -చిత్తూరుకు వెళ్లే వాహనాలకు అంతరాయ కలిగింది.