కడప

వీడని గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఫిబ్రవరి 18: రాజంపేట పట్టణ ప్రధాన రహదారిలో ప్రధాన పోస్ట్ఫాసు నుండి పాత బస్టాండు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వివిధవర్గాల ప్రజలు కోరుతున్నారు. 13 సంవత్సరాలుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అంశంపై ఇక్కడి ప్రజలను అధికారత్రయం, ప్రజాప్రతినిధులు ఊరిస్తూనే వస్తున్నారు. 2006లో రోడ్డువిస్తరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టకుండానే బ్రేక్ పడింది. అప్పటి నుండి రోడ్డు విస్తరణ చేపట్టని కారణంగా నిత్యం ట్రాఫిక్ సమస్యలు ప్రధాన రహదారిలో ఎదుర్కొనక తప్పడం లేదు. మన్నూరు నుండి ప్రధాన పోస్టాపీసు వరకు రోడ్డు విస్తరణ జరిగింది. అలాగే పాత బస్టాండు నుండి సబ్‌స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ జరిగిందని, మిగిలి ఉన్న ప్రధాన పోస్ట్ఫాసు నుండి పాత బస్టాండు వరకు రోడ్డు విస్తరణ చేపడితే చాలావరకు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కారణాలు ఏమైనా రోడ్డువిస్తరణ పనులు పూర్తిస్థాయిలో పూర్తిచేయడంలో జరుగుతున్న జాప్యంవల్ల నిత్యం ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు అంతా ఇంతా కావు. రోడ్డు విస్తరణ పనులు పూర్తికాకపోవడం ఒక సమస్య అయితే రోడ్డు ప్రక్కనే పలుచోట్ల ఏర్పాటుచేసిన టెలీఫోన్, విద్యుత్ స్థంభాలు, కొంతమంది వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న రేకులషెడ్లు కూడా కారణమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, పలువర్గాల ప్రజలు పడుతున్న అగచాట్లు చెప్పనలవికాదు. ఏవైనా ముఖ్యమైన పండుగ రోజులకు ముందుగా వివిధ గ్రామాల ప్రజల నుండి వేల సంఖ్యలో తరలివచ్చే జనంతో రోడ్డువిస్తరణ పూర్తికానిచోటే ప్రధాన అంగళ్లున్న కారణంగా ఇసుకవేస్తే రాలనంత స్థాయిలో జన సమూహం చేరుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ సమస్యలు అంతా ఇంతాకావు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు జరగని మార్గంలోనే ప్రధాన వ్యాపార సంస్థల కారణంగా రద్దీకూడా ఎక్కువగా ఉంటున్నందున సత్వరం చర్యలు గైకొనాల్సి ఉంది. ప్రధాన మార్కెట్ కూడా ప్రధాన పోస్ట్ఫాసు ప్రక్కనే ఉందని దీంతో నిత్యం రాకపోకలు సాగించేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇప్పటికైనా పట్టణంలో పూర్తిస్థాయిలో రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేసే విషయంలో సంబంధిత అధికారులు చొరవ చూపాల్సిన అవసరముంది. 2006వ సంవత్సరంలో రాజంపేట పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా మన్నూరు వద్ద చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలో పదిమంది ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో ఈ పనులకు బ్రేక్ పడింది. అప్పటి నుండి ఇప్పటివరకు పట్టణ ప్రధాన రహదారిలో రోడ్డు విస్తరణ పనులు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మొత్తానికి రాజంపేట పట్టణంలో రోడ్డువిస్తరణ పనులు పూర్తయ్యితే చాలావరకు ప్రస్తుతం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే పట్టణంలోని ఆర్‌యస్ రోడ్డుతో పాటు బండ్రాళ్లవీధి, పాత పోలీసులైన్, నాగులమాను వీధుల్లో కూడా నిత్యం ట్రాఫిక్ స్థంభించిపోవడం షరామామూలు తంతుగా మారుతుంది. కనుక ఇలాంటి చోట్ల కూడా తగు చర్యలు అవసరం. ఇకపోతే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈడిగపాలెంలో వస్త్ర వ్యాపారుల కాంప్లెక్స్ వద్ద నిత్యం ట్రాఫిక్ స్థంభించి పోతుంది. వస్త్ర వ్యాపారులు పార్కింగ్ వసతి లేకుండా కాంప్లెక్స్‌లో వ్యాపారాలు చేసుకుంటుండడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఈ విషయంలో కూడా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండడం దురదృష్టకరం.