కడప

స్నాతకోత్సవానికి వైవీయూ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 18: యోగివేమన విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2016, 2017, 2018సంవత్సరాల్లో నిర్వహించాల్సిన 6, 7, 8వ స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీలోని ఏపీజే అబ్దుల్ కలామ్ కేంద్రీయ గ్రంథాలయ ఆవరణలో మంగళవారం ఈ స్నాతకోత్సవ సంబరాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ కాన్వకేషన్‌కు రాష్టవ్రిద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) డైరెక్టర్ ఎస్.పీ.శర్మ అతిధులుగా హాజరౌతున్నారు. ఇదే స్నాతకోత్సవంలో ఎస్‌పీ శర్మకు యోగివేమన యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తుండటం విశేషం. ఈ స్నాతకోత్సవంలో 11వేల మంది డిగ్రీ పట్టాలు, 1100 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు, 30మంది పీహెచ్‌డీ పట్టాలు అందుకోనున్నారు. వీరిలో వివిధ విభాగాల నుండి 99మంది బంగారు పతకాలు పొందారు. ఒక్కో సంవత్సరానికి 33మంది చొప్పున మూడేళ్లకు 99 మందికి ఈ బంగారు పతకాలను ఇస్తున్నారు.
కాన్వకేషన్‌లో విద్యార్థులు ధరించాల్సిన రోబ్స్ (టోపీలు)
స్నాతకోత్సవంలో పట్టాలు అందుకునే విద్యార్థులు తెలుపురంగు దుస్తులపై సంప్రదాయ రోబ్స్ (తలపై టోపీలు) ధరించి పట్టాలు అందుకోవాల్సివుంది. పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు తెలుపురంగు దుస్తులపై నలుపురంగు గౌను ధరించాల్సివుంటుంది. ఎంఈడీ (మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్) పట్టాలు అందుకునే విద్యార్థులు తలపై బంగారురంగు రోబ్స్ ధరించాలి. ఎంటెక్, ఎంసిఏ పట్టాలు అందుకునే విద్యార్థులు తలపై నలుపు, ఆరంజ్ రంగుల రోబ్స్ ధరించాలి. పీహెచ్‌డీ (డాక్టర్ ఆఫ్ పిలాసఫి) పట్టాలు అందుకునే విద్యార్థులు తెలుపురంగు రోబ్స్ ధరించి స్నాతకోత్సవానికి హాజరుకావాల్సివుంటుంది.

స్నాతకోత్సవంపై పాలక మండలి సమావేశం

కడప,్ఫబ్రవరి 18: స్నాతకోత్సవం నిర్వహణ సందర్భంగా వైవీయూలో సోమవారం పాలకమండలి సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైవీయూ వైస్ చాన్సలర్ చాంబర్‌లో ఈసమావేశం జరిగింది. ఈసమావేశంలో వైస్ చాన్సలర్ అత్తిపల్లిరామచంద్రారెడ్డి, రిజిస్టార్ ఎం.చంద్రయ్యలతోపాటు పాలక మండలి సభ్యులైన ఎస్.గోవర్దన్‌రెడ్డి, ఏజి దాము, ఎస్.రామచంద్రయ్య, ఎం.పెంచలయ్య, ఎన్‌డి.విజయజ్యోతి, ఆర్.రాజగోపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు. హాజరౌతున్న అతిధులు, ప్రముఖుల వివరాలు, విద్యార్థులకోసం సిద్ధమైన పట్టాలు, బంగారుపతకాలు తదితర విషయాలపై సమావేశంలో చర్చించారు. ఈసందర్భంగా వైస్ చాన్సలర్, విశ్వవిద్యాలయం మూడేళ్ల ప్రగతిని అకడమిక్ పరంగా, ఆర్థికంగా సాధించిన విజయాలను పాలకమండలి సభ్యులకు వివరించారు. అనంతరం ఈ కమిటీ ఏపీజే అబ్దుల్ కలామ్ కేంద్రీయ గ్రంథాలయం ఆవరణలో జరగనున్న స్నాతకోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీటింగ్ అరైంజ్‌మెంట్ ఏర్పాట్లను గమనించారు. స్నాతకోత్సవం సందర్భంగా పాలక మండలి సభ్యులకు వైస్ చాన్సలర్ రామచంద్రారెడ్డి జ్ఞాపికలు బహూకరించారు.

ఊక దంపుడు ఉపన్యాసాలు మానండి
* చేవ ఉంటే బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి * పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
కడప సిటీ,్ఫబ్రవరి 18: రాష్ట్రంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ, వైసీపీలు తమ వైఖరిని మార్చుకోవాలని, చేవ ఉంటే ఆ ఉపన్యాసాల బదులుగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరుపార్టీలు తమకు బీసీలపై అపారమైన ప్రేమ ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారని, బీసీ ఓట్లకోసం పోటీపడుతున్నారని, వారిపట్ల లేనిప్రేమను ఒలకపోస్తూ కపట నాటకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బీసీలపట్ల చిత్తశుద్ధిలేని శివపూజలు చేస్తున్నారని, ఈ పూజలు బీసీలు నమ్మరాదన్నారు. 48సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆనాటికి చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి రాలేదని, జగన్మోహన్‌రెడ్డి పుట్టనే లేదన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీకి ఎలాంటి పోటీ లేకున్నా బీసీల అభివృద్ధికోసం రిజర్వేషన్లు కల్పించిందని, ఇప్పటికీ బీసీలు ఆ రిజర్వేషన్లతోనే ఉద్యోగాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్‌టి రామారావు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని, అనంతరం కాంగ్రెస్‌పార్టీ ఆరిజర్వేషన్లను దాదాపు 35శాతానికి పెంచిందన్నారు. బీసీ కార్పొరేషన్ ప్రారంభించి బీసీలకు పీసీసీ అధ్యక్ష హోదాను కూడా కల్పించింది కాంగ్రెస్‌పార్టీనే అన్నారు. ఇప్పటి రాష్టక్రాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా బీసీనే అన్నారు. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని గర్వంగా చెపుతామని, మా అధిష్టానాన్ని మెప్పించి, ఒప్పించి ముఖ్యమంత్రి స్థానంలో బీసీని కూర్చోపెడతామన్నారు. స్వతంత్ర పార్టీలైన స్థానిక పార్టీలు మాత్రం బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పలేరని ఎద్దేవా చేశారు.