కడప

ఆధార్ అనుసంధానంతో గణనీయంగా తగ్గిన ఓటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప (కలెక్టరేట్), జనవరి 21: ఆధార్‌తో ఓటరు కార్డును అనుసంధానం చేయడంతో జిల్లాలో బోగస్ ఓటర్లు గణనీయంగా తగ్గాయి. గతఏడాది జిల్లాలో సుమారు 21లక్షల ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఓటర్ల నమోదు, తొలగింపు, ఆధార్‌కార్డు అనుసంధానం తదితర ప్రక్రియల వల్ల దాదాపు 2లక్షల 85వేల ఓట్లు తగ్గాయి. 2016 జనవరి 11న జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితాలో జిల్లా ఓటర్లు 19లక్షల 13వేల 46 ఓట్లుగా ఉన్నట్లు గుర్తించారు. అందులో పురుష ఓటర్లు 9లక్షల 41వేల 855 మంది ఉండగా, మహిళా ఓటర్లు 9లక్షల 70వేల 985మంది ఉన్నారు. దీనినిబట్టి పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 30వేల మంది అధికంగా ఉన్నారు. రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నవారికి ఏదైనా ఒక ప్రాంతంలోమాత్రమే ఓటు హక్కు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రెండుచోట్ల ఓటు హక్కు పొందిన ఓటర్లు తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతానికి ఓటు హక్కుకు దరఖాస్తు లేదా మెసేజ్ ద్వారా ఓటు కల్పించుకున్నారు. ఇక సాధారణంగా జరిగే ఓటు నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. బూత్ లెవెల్‌లో డిఎల్‌ఓలు, ఎన్నికల అధికార యంత్రాంగం ఇంటింటి సర్వే పేరుతో ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల అత్యధికంగా ఓటర్లు ఉండే పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు చాలావరకు తగ్గారు. అలాగే డోర్‌లాక్, వివిధ ప్రక్రియల నమోదు పకడ్బందీగా చేయడంతో జిల్లాలో ఓటర్లు గతంలో కంటే అత్యధికంగా 2లక్షల 85వేల ఓటర్లు తగ్గాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఓటర నమోదు ప్రక్రియలో కొత్తగా ఓటు హక్కుపొందిన వారు 7వేల 166 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో అత్యధికంగా కడప నగరంలో ఎక్కువ ఓట్లు గల్లంతయ్యాయి.
వ్యవసాయానికి నిరాటంకంగా ఏడుగంటల విద్యుత్
కడప (కలెక్టరేట్), జనవరి 21: జిల్లాలో వ్యవసాయమోటార్లు కలిగిన రైతులకు నిరంతరంగా ఏడుగంటల విద్యుత్ ప్రభుత్వం సరఫరాచేయనుంది. ఈ విద్యుత్‌ను ఈనెల 25వ తేది నుంచి అమలుచేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయానికి సంబంధించిన మోటార్లకు రెండువిడతలుగా (పగలు,రాత్రి) 7గంటలపాటు విద్యుత్‌ను సరఫరాచేసేవారు. జిల్లాలో వ్యవసాయవిద్యుత్ కనెక్షన్లు ఏ,బి,సిలుగా విభజించి , ఒక్కో వర్గంలోని వ్యవసాయ కనెక్షన్లకు నిరాటంకంగా ఏడుగంటలపాటు ఇకనుంచి విద్యుత్ సరఫరా చేస్తారు. ఒక్కోవర్గానికి వారంరోజులపాటు నిర్దేశించిన సమయంలో విద్యుత్‌ను నిరాటంకంగా సరఫరాచేస్తారు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షా 32వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, రెండు విడతలుగానే సరఫరా అయ్యే విద్యుత్ ఇక నుంచి ఒకే సమయంలో నిరాటంకంగా ఏడుగంటలపాటు సరఫరా కానుంది. ఏ గ్రూపునకు తెల్లవారుజామున 4గంటల నుంచి ఉదయం 11గంటల వరకు, బి కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, సి గ్రూపునకు రాత్రి 9గంటల నుంచి తెల్లవారు జామున 4గంటల వరకు విద్యుత్ సరఫరా అవుతుంది.

అంగరంగ వైభవంగా రామయ్య ఉత్సవాలు
ఒంటిమిట్ట, జనవరి 21: ఏప్రిల్ 14వ తేది నుండి ప్రారంభం కాబోతున్న ఏకశిల నగర కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలను భారతదేశ ప్రజలు గర్వించేలా నిర్వహించబోతున్నట్లు టిటిడి జెఇఓ పోలా భాస్కర్, విప్ మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టే పనులను శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు ముందుగా విప్ మేడా చెప్పారు. అంతకు ముందు జెఇఓ, మేడా కలసి మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ కోదండ రాముని అభివృద్ధిలో భాగంగా ప్రకటించిన వంద కోట్లలో ముందుగా రూ. 20 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులన్ని వచ్చే ఉత్సవాలకు ముందు నాటికల్లా పూర్తి చేసేందుకు టిటిడి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో క్యూలైన్‌లు, నీటి వసతి, ప్రత్యేక కల్యాణ వేదిక, విఐపిలకు, సిఎం, గవర్నర్, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక వసతులు, లక్షలాది భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. పురావస్తుశాఖ వారు గోపురాలకు కొద్దిపాటి మరమత్తులు, ఆలయంలో ప్లోరింగ్ పనులు చేపడతారన్నారు. ఆలయ బయటి భాగం వంద మీటర్ల హద్దులో భక్తులకు క్యూలైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పనులకు స్థానికులు సహకరించి బ్రహ్మోత్సవాలు దేశ ప్రజలు గర్వించేలా విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. విప్ మేడా మాట్లాడుతూ ప్రస్తుతం భక్తులను రద్దీని దృష్టిలో ఉంచుకుని కల్యాణ వేదికకు రెండు స్థలాలను పరిశీలించామన్నారు. ఇందులో దక్షణ భాగంలోని ఖాళీ స్థలంతో పాటు, స్వామివారి స్థలాలను కూడా పరిశీలించామన్నారు. రూ. 20 కోట్ల పనులకు శుక్రవారం నుంచి ప్రారంభమై బ్రహ్మోత్సవాలకు పది రోజుల ముందుగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహాన్, ప్రజాప్రతినిధులు విచ్చేస్తారన్నారు. ఈ మారు ఉత్సవాలు టిటిడి ఆధ్వర్యంలో పది రోజుల పాటు నభూతో నభవిష్యత్ అనే రీతిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు అభివృద్ది పనులకు, ఉత్సవాల విజయవంతానికి సహకరించాలన్నారు. అనంతరం మేడా, జెఇఓ, అధికారుల బృందం కలసి స్వామివారి స్థలాలు, కల్యాణ వేదిక, ఒంటిమిట్ట చెరువు, మృకుండాశ్రమం, రామలక్ష్ముణ తీర్థాలు తదితర ప్రదేశాలను పరిశీలించి కొలతలు తీశారు. అంతకు ముందు వారు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై, తహశీల్దార్ కనకదుర్గయ్య, టిటిడిలో వివిధ శాఖల అధికారులు డిప్యూటీ ఇఓ బాలాజీ, సూపరింటెండెంట్ నాగరాజు, స్ధానిక తెలుగుదేశం నాయకులు కొమరా వెంకటనరసయ్య, గడ్డం జనార్ధన్‌రెడ్డి, నందకిషోర్‌రెడ్డి, సుబ్బానాయుడు, టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి
బద్వేలు, జనవరి 21: ఈనెల 30,31వ తేదీల్లో పులివెందుల్లో జరుగు ఎపి రైతుసంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు. స్థానిక జెవి.్భవన్‌లో గురువారం జరిగిన రైతు సంఘం ఏరియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నిలకు ముందు చేసిన వాగ్దానాలకు తిలోదకాలిచ్చి, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ముఖ్యంగా కరువులు, వలసలు, ఆత్మహత్యలు లేని రాయలసీమ కోసం ఉధ్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిధులు, నికరజలాలు కేటాయించకుండా పట్టిసీమను పట్టుకు వేలాడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి సీమలో పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. సకాలంలో వర్షాలు రాక కరువు, అకాల వర్షాల బారిన పడి పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. 2012 నాటి పంటల భీమా ఇప్పటికీ చెల్లించని కేంద్ర ప్రభుత్వం నూతనంగా పథకాన్ని తీసుకొచ్చామంటూ సంబరపడుతుండడం సిగ్గుచేటన్నారు. సిపి ఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏడు మండలాలు, 152 గ్రామాలు ఉన్నాయని, 173 చెరువులు, 60 వాగులు, 671 నీటి సంరక్షణా కేంద్రాలు కలిగినప్పటికీ తగినంత వర్షపాతం లేక రెండులక్షల ఎకరాల్లో ఒక పంట వేయడానిక్కూడా కష్టంగా వుందన్నారు. మరో 35వేల ఎకరాలు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిపి ఐ ఏరియా కార్యదర్శి వీరశేఖర్, రైతు సంఘం నాయకులు పుల్లారెడ్డి, చెన్నారెడ్డి, సిపి ఐ పట్టణ కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం
బద్వేలు, జనవరి 21: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు, పోరాటాలకు సమయం ఆసన్నమైందని, ఆ మేరకు విద్యార్థులు, విద్యార్థి ప్రతినిధులు సన్నద్ధం కావాలని ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కిషోర్, ఏరియా కార్యదర్శి బి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో జరిగిన ఏరియా కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలో వుండడం వలన విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర క్యాబినెట్‌లో కార్పోరేట్ అధిపతులను మంత్రివర్గంలో నియమించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పోరేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు. సమస్యలపై నేడు కడపలోని జిల్లాపరిషత్ హాలులో జిల్లా ప్రతినిధుల మహాసభ జరుగుతుందని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు దేవా, మండల కార్యదర్శులు గురుక్రిష్ణ, గురయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత బల్బుల కోసం కిటకిటలాడిన విద్యుత్ కార్యాలయాలు
రైల్వేకోడూరు, జనవరి 21:స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ఉచిత బల్బుల కోసం వేలాది మంది మండల ప్రజలు బుధవారం క్యూ కట్టారు. ఏడి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఏఇ శ్రీనివాసులు సహకారంతో వినియోగదారులకు రూ. 10లకే 9 వాట్స్ బల్బులను భారీ ఎత్తున పంపిణీ చేశారు. కోడూరు, చిట్వేల్, ఓబులవారిపల్లె మండలాలలో 45 వేల మందికి పైగా ఇళ్లకు సంబంధించిన వినియోగదారులు ఉన్నారని, ఇప్పటి వరకు సుమారు 6 వేల మందికి ఈ బల్బులు పంపిణీ చేశామని ఏఇ తెలిపారు. నెల నెల సక్రమంగా బిల్లులు చెల్లించే వారికి బల్బుల పంపిణీలో ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. వినియోగదారులు ఆధార్, కరెంటు బిల్లును తీసుకు రావాలన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఆదా కోసం ఈ బల్బులను రూ. 600 ఖర్చును భరిస్తూ వినియోగదారులకు కేవలం 10 రూపాయలకే ఇంటికి రెండు చొప్పున అందిస్తుందన్నారు.