కడప

చేనేతలను మోసం చేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేనేతలను ఎన్నోవిధాలుగా మోసం చేసేందుకు పథకాలు రూపొందించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మునిసిపల్ కమిషనర్ రమణారెడ్డిని కలిసి చేనేతలకు ఇస్తానన్న మిషన్‌ను కమిషనర్ వద్దకు మిషన్‌ను తీసుకువచ్చి ఆయనకు మిషన్ యొక్క విలువ ఎంత అని అడిగారు. రూ.6500 మిషన్‌ను రూ.18,500 ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రూ.1850 చెల్లిస్తే రూ.18,500 రూపాయలు చేనేత విద్యుత్ మోటర్ మిషన్ అందిస్తామని ప్రభుత్వం చేనేతలను దగాచేసిందని అన్నారు. ఈ మిషన్‌లు వెంకటగిరిలో తయారవుతాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన బినామీ కాంట్రాక్టర్లు వెంకటరెడ్డి ఈ మిషన్ల తయారీదారులతో రూ.6500 రూపాయలకు ఒప్పందం చేసుకుని బిల్లులులేకుండా ఇవ్వమని కోరారు. వారు ఇవ్వలేదన్నారు. తాము హామీఇచ్చిన మేరకు రూ.6500లకే ఇలాంటి మిషన్లు మార్చి 5వ తేదీ వరకు చేనేతలకు అందిస్తామన్నారు. రూ.6500 మిషన్ ధర పోగా మిగిలిన డబ్బు టీడీపీ నేతలు, బినామీ కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్తున్నాయో లేదా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జేబులోకి వెళ్తున్నాయో అర్థంకావడం లేదన్నారు. చేనేతలు ఇప్పటికైనా ఆలోచనచేసి తమకు ఎవ్వరు సహాయం చేస్తారో వారిని ఆధరించాలని చంద్రబాబునాయుడు చెబుతున్న కల్లిబొల్లి మాటలు నమ్మరాదని, తాను అధికారంలోని వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ప్రజలకు చేసింది ఏమీలేదని ఎద్దేవాచేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలోరైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తామని, రైతులకు రూ.15 వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం ద్వారా రూ.10 వేలు, నిరుద్యోగ భృతి, వివిధ రకాల పెన్షన్లు, ఇలా పలు సంక్షేమ పథకాలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేయకుండా నాలుగున్నర సంవత్సరాల తర్వాత అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనాఉందని తెలిపారు. మళ్లీ అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి ఏదో రకంగా సీఎం కూర్చీ ఎక్కాలనే ఉద్ధేశ్యంతో చంద్రబాబునాయుడు ప్రజలకు సంక్షేమ పథకాలను ఎరగావేసి ఆశ చూపిస్తూ, ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నో చేస్తున్నారని, ఎన్నిచెప్పినా ఈసారి చంద్రబాబును ప్రజలు ఎవ్వరూ నమ్మేస్థితిలోలేరని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన తెలిపారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లో అత్యంత మెజారీటీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు.