కడప

యువనేస్తం సర్వర్ డౌన్.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,్ఫబ్రవరి 27: నిరుద్యోగ భృతికి కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు యువనేస్తం సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులకు నిరాశ ఎదురౌతోంది. దరఖాస్తు కోసం యువనేస్తం సర్వర్ సెలవుదినాలు మినహాయించి అన్నిప్రభుత్వ దినాల్లో పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ గత 15రోజులనుండి కడప జిల్లాలో యువనేస్తం సర్వర్ పనిచేయకపోవడంతో అర్హులైన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి గురౌతున్నారు. దరఖాస్తుకోసం మీసేవ, ఇంటర్నెట్‌కు వెళ్లి అభ్యర్థులకు ముఖ్యమంత్రి యువనేస్తం సర్వర్ పనిచేయడం లేదని నిర్వాహకులు చెప్పడంతో వెనుతిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రాష్ట్రప్రభుత్వం 22 సంవత్సరాలు నిండివుండి 35సంవత్సరాలు లోపు ఉన్న డిగ్రీ కలిగిన నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు మార్చి నెల నుంచి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలోని అర్హులైన నిరుద్యోగులు ఇంటర్నెట్, మీసేవ కేంద్రాల్లో నమోదుకు ప్రయత్నించగా సర్వర్ మొరాయిస్తోంది. ఫిబ్రవరి నెల వరకు రూ.1000లు ఇస్తున్న నిరుద్యోగ భృతిని మార్చినెల నుండి రూ.2వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈపథకానికి జిల్లాలో ఇప్పటికే 17406మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని వెయ్యిరూపాయలు చొప్పున లబ్దిపొందారు. నూతనంగా డిగ్రీ పాసైన నిరుద్యోగులు దాదాపు మరో రెండువేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి ప్రభుత్వం అందజేసే నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాకు నేరుగా జమ అవుతుంది. సర్వర్ పనిచేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఇంటర్నెట్, మీసేవల వద్ద వేలిముద్రలు వేయలేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 28లోపల ఈకేవైసీ వేయకపోతే నిరుద్యోగ భృతి దక్కించుకోలేమని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం యువనేస్తం సర్వర్ పనిచేయకపోతే 1100నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే ఈనెంబర్ కూడా గత 20రోజుల నుండి మనుగడలో లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. కలెక్టర్ యువనేస్తం సర్వర్‌పై దృష్టిసారించి నిరుద్యోగులను భృతికి అర్హులు చేసేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.