కడప

నేను విన్నాను... నేను ఉన్నాను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లా.. ప్రజల సమస్యలు విన్నాను... నేను ఉన్నాను అని భరోసా ఇచ్చినట్లు వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరకాసురుని పాలన ఎప్పుడు తప్పుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన చెప్పారు. రాజన్న రాజ్యం రావాలంటే, రాయచోటి పట్టణం సర్వాంగ సుందరంగా కావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. ఎమ్మెల్యే అయిన మరుక్షణం రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గోదాము, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తానన్నారు. ఈ ప్రాంతంలో మామిడి రైతులు అత్యధికంగా ఉన్నారని వారి కోసం మామిడి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అదే విధంగా కడప-బెంగళూరు రైల్వే లైన్ల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో చాలా కాలంగా ఉన్న తాగునీటి సమస్యలను, రింగురోడ్డును వేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. గడిచిన 9 సంవత్సరాలుగా రమేష్‌రెడ్డికి నిధులు, అధికారాలు ఉన్నప్పటికీ రాయచోటి ప్రజల కోసం ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి చేయకుండా నిధులను నొక్కేశారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అమెరికా వైఎస్‌ఆర్ పార్టీ కన్వీనర్ రత్నాకర్, మున్సిపల్ కో ఆప్షన్ సలావుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆఫ్జల్‌అలీఖాన్, నాయకులు చెన్నూరు అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.