కడప

ఓటుకు చీకటాయే...నోటుకు పగులాయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 9: ఓటు దండాలకు గడువు ముగిసింది..నోటు పంపిణీకి గడువు మొదలైంది. నోటు పంపిణీకి 12గంటలు, ఓటువేసేందుకు 24గంటలు గడువుతో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దీంతో ఎన్నికల్లో పోటీచేస్తున్న రాజకీయపార్టీల అభ్యర్థులు నోటు పంపిణీపై పరుగులు తీసే వ్యూహానికి పదునుపెడుతున్నారు. దీని ఫలితంగా ఇప్పటికే గ్రామపంచాయతీలు మొదలుకుని పట్టణ కేంద్రాల్లో వార్డుల్లో సైతం పెద్దఎత్తున ఇరుపార్టీలు అనుచరులతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. అయితే ఇప్పటివరకు ఓటరు దేవుడిని ఆశ్రయించేందుకు రేయింబవళ్లు కష్టపడ్డ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఇప్పుడు కేవలం 12గంటల్లో చెమటోర్చాల్సివస్తోంది. ఇందుకుగాను పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ధనలక్ష్మిని ఎరవేసే కార్యక్రమం ముమ్మరం చేశారు. గతంలో ఎన్నికల్లో అభ్యర్థులు అనుచరులకు మాత్రమే నోట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేయించేవారు. అయితే ఆ ఎన్నికల్లో తిన్న ఎదురుదెబ్బలు దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికీ ,ప్రతి ఓటరుకు నేరుగా నోటు అందించేందుకు సొంత కుటుంబీకులను, బంధువులను రంగంలోకి దించి అనుచరులను సహాయకులుగా పెట్టుకుంటూ ఇంటింటా నోటు అందించేవిధంగా దృష్టిపెట్టారు. జిల్లాకేంద్రమైన కడప మినహా మిగతా 9నియోజకవర్గాల్లో రెండురోజుల ముందే ఓటుకు నోటుపంపిణీ మొదలైంది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇచ్చే మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని ఒరికంటే మరొకరు అధికంగా నోటు ఇచ్చే ప్రయత్నం సాగిస్తున్నారు. జిల్లాలోని కీలకమైన కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5వేలు నుండి రూ.2వేలు, రూ.1000లు, రూ.500 వంతున పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు, 24గంటలు తనిఖీలను పోలీసు యంత్రాంగం ముమ్మరం చేయడంతో అభ్యర్థులు వారం రోజులు ముందే ఎక్కడికక్కడ ఆయా పంచాయితీలకు, పట్టణ ప్రాంతాల్లోని డివిజన్లకు కట్టుదిట్టమైన ప్రాంతాల్లో నగదు నిల్వలను సిద్ధం చేశారు. పోలీసుల కన్నుగప్పి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కోట్లాదిరూపాయల నగదు తరలివచ్చింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నోట్ల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. గతంలో అనుచరులకు నగదు ఇచ్చి పంపిణీ చేయించాక ఈ మొత్తాలు ఓటర్లకు చేరకపోవడం ఈనేతలే జేబులు నింపుకోవడం వంటి వ్యవహారాలవల్ల అనేకచోట్ల అభ్యర్థులు కోట్లు ఖర్చుపెట్టినా పరాజయం తప్పలేదు. ప్రత్యర్థికంటే అధికంగా ఖర్చుపెట్టామన్న ధీమాతో అతి విశ్వాసంతో ఉన్న నేతలు ఎన్నికల్లో అనుచరుల ఆర్థిక మోసాలతో బోర్లపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో అభ్యర్థులు కూడా రూటు మార్చుకున్నారు. కింది స్థాయి నేతలకు కాస్తో కూస్తో ఇచ్చి ఓటరుకు నేరుగా నజరానా అందించేందుకు బంధువులు, స్నేహితులకు బాధ్యత అప్పగించడంతో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ప్రతి ఇంటా నోటుచేర్చే అవకాశంపై అభ్యర్థులు దృష్టిపెట్టారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని ఓ నియోజకవర్గంలో ఓటుకు నోటుతోపాటు మరో వెయ్యిరూపాయలు చేసే కూపన్ కూడా అందజేస్తూ కొత్త వ్యూహానికి నాంది పలికారు. ఎన్నికలు ముగియగానే ఈకూపన్ మార్చుకోండి అంటూ ఓటర్లకు సలహాలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థులు కొత్త కొత్త ఎత్తుగడలతో ఓటరుకు ఓటుకు నోటు ఆశపెట్టి గెలుపు విజయానికి మార్గాలను పునాదులు వేసుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నోట్ల పంపిణీ సాగుతోంది. అయితే పోలీసులు కూడా నోట్లపంపిణీ వ్యవహారంపై పూర్తిగా కట్టడి చేసేందుకు విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుండటంతో అనేక ప్రాంతాల్లో అభ్యర్థుల అనుచరులు రాత్రి 10గంటల నుండి తెల్లవారు ఝామున ఒంటిగంట వరకు పంపిణీ జోరుగా సాగుతోంది. ఏదేమైనా 12 గంటల్లో నోటుపంపిణీ పథకం ఏమేరకు సఫలీకృతం చేస్తారో ఆనేతకే కొంత మెరుగుపడే అవకాశాలున్నాయన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.