కడప

స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,ఏప్రిల్ 9:పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ పరిశీలించారు. మంగళవారం నగర శివారులోని కెఎల్‌ఎం మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్ణయింపబడిన స్ట్రాంగ్‌రూమ్‌లను ఆయన పరిశీలించారు. కడప పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల స్ట్రాంగ్‌రూమ్‌లను, రాజంపేట పరిధిలోని నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తన వెంట ఉన్న అధికారులకు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద గట్టిబందోబస్తు ఏర్పాటుచేసి , ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం పడినా స్ట్రాంగ్‌రూమ్‌లలోకి నీరు చేరకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ అంశాలపై చర్చించి తగిన ఆదేశాలుజారీ చేశారు. ఈకార్యక్రమంలో జాయింట్‌కలెక్టర్ కోటేశ్వరరావు,ట్రైనీ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ లవన్న, కడప ఆర్డీవో మలోల, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఏడీ, కెఎల్‌ఎం కాలేజి ప్రిన్సిపాల్ ఖాజాపీర్ బాషాలు ఉన్నారు.