కడప

జగన్ ఎక్కే గడప...దిగే కడప..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన సొంత జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టిడిపి తీర్థం పుచ్చుకోవడం, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కడపలో మకాం వేయడంతో ఉలిక్కిపడిన జగన్ బుధవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ నుంచి బెంగుళూరు మీదుగా పులివెందులకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు అందుబాటులో ఉన్న శాసనసభ్యులు, కుటుంబసభ్యులతో తాజా పరిణామాలపై జగన్ సుదీర్ఘంగా చర్చించారు. గురువారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు కార్యక్రమాల పేరిట సుడిగాలి పర్యటనచేసి ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. గతంలో జగన్ జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను తమవద్దకు పిలిపించుకుని మాట్లాడేవారు. గురువారం తన సహజశైలికి భిన్నంగా జగన్ జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఎమ్మెల్యేలనే గాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను సైతం కలిసి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. గురువారం తెల్లవారుజామున నుంచే పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కడప నియోజకవర్గాల పరిధిలో జగన్ పర్యటించారు. ఇటీవల జమ్మలమడుగు, బద్వేలు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వారికి ప్రత్యామ్నాయ నేతలను వెదికే పనిలో నిమగ్నమయ్యారు. ఆ నియోజకవర్గాల్లో ద్వితీయ, తృతీయశ్రేణి కేడర్ సైకిలెక్కకుండా జాగ్రత్తలు చేపట్టారు. వైకాపా నుంచి టిడిపిలోకి వెళ్తారని పత్రికల్లో వార్తలు వస్తున్న ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీని వీడే ప్రసక్తేలేదని విలేకర్ల సమావేశాలు ఏర్పాటుచేయిస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఉన్న రఘురామిరెడ్డిని జగన్ ఆయన వద్దకు వెళ్లి కలిశారు. తన పర్యటనలో ఎర్రగుంట్లలోని మైసూరా ఇంటికి కూడా వెళ్లాలని జగన్ భావించి వాకబు చేశారు. అయితే మైసూరా ఇంటివద్ద లేరని తెలుసుకొని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాగా, మైసూరా కడపలోని హరిత హోటల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై...పనిలో పనిగా తాజా రాజకీయ పరిణామాలతో తన అనుచరులతో చర్చలు జరిపారు. జగన్ కడప చేరుకున్నప్పటికీ మైసూరా ఆయనను కలవకపోవడం గమనార్హం. ఇలావుండగా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో మహిళా ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమ్మ భర్త ఇటీవల చనిపోవడంతో ఆమె ఇంటికివెళ్లి పరామర్శించారు. పనిలో పనిగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని కలిసి ఆయనతో తాజా పరిణామాలపై చర్చించారు. కడపలో తాజాగా డిప్యూటీ మేయర్ అరిఫుల్లా, ఇద్దరు కార్పొరేటర్లు లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వెళ్లిన నేపథ్యంలో మిగిలిన 39 మంది కార్పొరేటర్లను కాపాడుకునేందుకు మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని, టిడిపి ప్రలోభాలకు లొంగవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక టిడిపిలో చేరతారని అనుమానం ఉన్న కొందరు ఎమ్మెల్యేలను ఉదయం నుంచి తన వెంటే ఉండేలా చూసుకున్నారు. వివాహాలు, పరామర్శల పేరుతో సుడిగాలి పర్యటన చేసి సంబంధింత ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మమేకమై అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. మొత్తమీద జగన్ సొంత జిల్లాపై లోకేష్ ఆకర్ష్ మంత్రం ప్రయోగించడంతో ఆలస్యంగా జానోదయమైన జగన్ తన సహజశైలికి భిన్నంగా నేతలను కలుస్తూ ముందుకుసాగుతున్నారు.
జగన్ జిల్లా వదలగానే మొదలైన వలసలు!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 25: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టిడిపిలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు గురువారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన జగన్...గురువారం రైలెక్కిన కొద్ది నిమిషాల్లోనే వైకాపా నాయకులు టిడిపి కార్యాలయం వైపు అడుగులు వేశారు. జగన్ సమక్షంలో ఎమ్మెల్యేలు, వైకాపా కీలకనేతలు పార్టీని వీడే ప్రసక్తిలేదని మూకుమ్మడిగా ప్రకటించారు. అయితే ప్రొద్దుటూరు వైకాపా సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ ముక్తియార్ గురువారం రాత్రి 9.30గంటల సమయంలో రోడ్ల భవనాలశాఖ అతిధిగృహంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్.లోకేష్ సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో ఏడుమంది కౌన్సిలర్లు కూడా సైకిలెక్కారు. లోకేష్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రొద్దుటూరు వైకాపా నేతలు పార్టీలో చేరనున్నారని తెలియగానే తన పర్యటన రద్దుచేసుకున్నారు. వైఎస్ జగన్ ఋరువారం రాత్రి హైదరబాద్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ముక్తియార్ అండ్ కో టిడిపిలో చేరడం గమనార్హం. దీనినిబట్టి రేపో,మాపో కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు పార్టీని వీడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. గురువారం రాత్రి టిడిపిలో చేరిన వారంతా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు వెంకటశివ ప్రసాదరెడ్డి అనుచరులే కావడం గమనార్హం.
రూ.4కోట్ల ఎర్రచందనం పట్టివేత!
ఆంధ్రభూమి బ్యూరో
కడప , ఫిబ్రవరి 25: ఎర్రచందనం తరలింపులో అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధమున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠి తెలిపారు. వారి నుంచి కోటి విలువచేసే ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా గురువారం టాస్క్ఫోర్స్ డిఐజి డాక్టర్ కాంతారావు నేతృత్వంలో జిల్లాలోని రైల్వేకోడూరు కుక్కలదొడ్డి వద్ద రూ.3కోట్లు విలువచేసే 100 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున కడప-రాయచోటి రహదారిలోని కాంపల్లె చెక్‌పోస్టు వద్ద బెంగుళూరుకు చెందిన ఎస్.ప్రవీణ్‌కుమార్, మహ్మద్ హరిఫ్, రైల్వేకోడూరుకు చెందిన చీకటిచంద్రశేఖర్‌లను అరెస్టుచేసి వారి వద్ద నుంచి మూడు కార్లు, ఐసెర్ వాహనం, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టు అయిన స్మగ్లర్లు కరుడుగట్టిన కటిగనహల్లికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ ప్రధాన అనుచరులుగా గుర్తించినట్లు చెప్పారు. వీరికి అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్లు అయిన జైపూర్‌కు చెందిన అశోక్‌కుమార్ అగర్వాల్, ఢిల్లీకి చెందిన హాసన్‌భాయ్, కాన్పూర్‌కు చెందిన షఫీజ్ హుస్సేన్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇటీవల కాలంలో పలువురు కీలక అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి విచారించగా ఈ ముగ్గురి స్మగ్లర్ల వివరాలు వెల్లడయ్యాయన్నారు. అప్పటి నుంచి కడప జిల్లాలోని పోలీసు అధికారులు వీరి కదలికలపై నిఘా ఉంచారు. గురువారం కడప రూరల్ సిఐ బివి శివారెడ్డి, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసు అధికారుల విశ్వసనీయ సమాచారంతో కడప-రాయచోటి రహదారిలో కాంపల్లె చెక్ పోస్టు వద్ద వాహనాలు చేస్తుండగా హెచ్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ ప్రవీణ, మహమ్మద్ హరీఫ్ అలియాస్ షరీఫ్‌లను అరెస్టు చేసి ఎర్రచందనం దుంగులు ఉన్న కార్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ గులాఠీ పేర్కొన్నారు.
చంద్రబాబులాగే చినబాబు సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 25: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దారిలోనే ఆయన తనయుడు లోకేష్ పయనిస్తూ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. కడపజిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం వచ్చిన లోకేష్...బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు సమీక్షల్లో తలమునకలయ్యారు. తొలిరోజు రాయచోటి, రైల్వేకోడూరు, కమలాపురం, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశమైన జగన్, గురువారం జమ్మలమడుగు, కడప, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, పులివెందుల అసెంబ్లీ నేతలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న పార్టీ పరిస్థితి, పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆధిపత్య పోరుతో ఎదురవుతున్న ఇబ్బందులు, కొత్తగా పార్టీలోకి వచ్చేవారితో వ్యవహరించాల్సిన తీరుపై ఈ సమీక్షల్లో లోకేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో వర్గాలుగా ఏర్పడి ఆధిపత్యపోరును కొనసాగిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. ఏవైనా సమస్యలుంటే రాబోయే 40రోజుల్లో పరిష్కరించుకోవాలని, లేకుంటే ఆ తర్వాత తామే నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరికలు జారీచేశారు. జిల్లా సమన్వయ కమిటీ నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) అధ్యక్షతన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, శాసన మండలి డిప్యుటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డిల సమక్షంలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. పార్టీలోకి కొత్తవారిని చేర్చుకున్నప్పటికీ దీర్ఘకాలంగా పనిచేసే సీనియర్లకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. రైల్వేకోడూరులో ఇన్‌చార్జి కె.విశ్వనాధనాయుడుపై కట్టాబాలాజి వర్గం లోకేష్‌కు ఫిర్యాదుచేశారు. తమవర్గాన్ని నాయుడు విస్మరిస్తున్నారని, వివిధ పథకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె జెడ్పిటిసి రమణయ్య లోకేష్ దృష్టికి తెచ్చారు. అలాగే రాయచోటి ఇన్‌చార్జ్ రమేష్‌రెడ్డి పార్టీని నమ్ముకుని మూడుదశాబ్దాలుగా ఉన్న తమ అనుచరగణాన్ని పక్కనపెట్టారని సీనియర్ నాయకుడు ప్రసాద్‌బాబు (చినరాయుడు) ఫిర్యాదు చేశారు. 40రోజుల్లోగా ఇరువర్గాలు సర్దుకుపోయి కలిసి పనిచేయాలని, లేకపోతే నాయకత్వానే్న మార్చివేస్తామని లోకేష్ తేల్చి చెప్పారు. అలాగే కమలాపురం నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ పుత్తానరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి తనయుడు జి.అనిల్‌కుమార్‌రెడ్డి వర్గాలు అధికారులు తమ మాటకు విలువ ఇవ్వడంలేదని వాపోయారు. జమ్మలమడుగు నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, ఆయన సోదరుడు మాజీ ఎంపిపి గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు సి.నారాయణరెడ్డిలు పార్టీలో చేరడం వల్ల టిడికి చెందిన బలమైనవర్గం ఆందోళన చెందుతున్నారని, తమ స్థానం ఏమిటో అర్థం కావడం లేదని లోకేష్ దృష్టికి తెచ్చారు. పార్టీలో సీనియర్లకు ఎటువంటి అన్యాయం జరగదని, పార్టీని బలోపేతం చేసే దిశగా ఇరువర్గాలు కృషిచేస్తే అన్నీ సర్దుకుంటాయని హితవుపలికారు. బద్వేలు నియోజకవర్గంలో ఇన్‌చార్జి విషయంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన ఎన్‌డి విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మలు ఇప్పటికే పోటీపడుతుండగా, తాజాగా వైకాపా ఎమ్మెల్యే జయరాములు పార్టీలో చేరారు. ఇప్పుడు తాము ఏంచేయాలని ఇరువర్గాల వారు లోకేష్‌ను అడగ్గా, మూడువర్గాలకు న్యాయం చేస్తామని, కలిసి పనిచేయాలని ఆదేశించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పలు గ్రూపులు ఉండటంతోపాటు లోకేష్ అసహనం వ్యక్తంచేశారు.

రేణిగుంట-గుంతకల్ రైలుమార్గానికి అరకొర నిధులు
రాజంపేట, ఫిబ్రవరి 25:ఏ పుణ్యకాలాన రేణిగుంట-గుంతకల్ రైలుమార్గం నిర్మాణం జరిగిందో కాని ఈ రైలుమార్గం అభివృద్ధి నత్తనడకనే సాగుతూ వస్తుంది. ఈ మార్గం మొత్తం రాయలసీమ జిల్లాల మీదుగానే సాగుతోంది. ప్రతి సంవత్సరం రైల్వేబడ్జెట్ రావడం, ఈ బడ్జెట్‌పై ఆశలు పెంచుకోవడం, బడ్జెట్ వచ్చిన తరువాత నిరాశ నిస్పృహలకు గురికావడం రేణిగుంట-గుంతకల్ రైలుమార్గంలోని రైల్వే ప్రయాణీకులకు షరామామూలు తంతుగా మారుతోంది. గురువారం నాటి రైల్వేబడ్జెట్‌లో ఈ మారు కూడా రేణిగుంట-గుంతకల్ రైలుమార్గంలో ఆశాజనకంగా నిధుల కేటాయింపులు కాని, సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారానికి హామీలు కాని చూపలేదు. తాజా రైల్వే బడ్జెట్‌లో గుంతకల్-రేణిగుంట రైలుమార్గంలో ఎర్రగుంట్ల-నంద్యాల రైల్వేలైన్‌కు రూ.100 కోట్లు, ఓబులవారిపల్లె-క్రిష్ణపట్నం రైల్వేలైన్‌కు రూ.100 కోట్లు, కడప-బెంగుళూరు లైన్‌కు రూ.58 కోట్లు, కంభం-ప్రొద్దుటూరు లైన్‌కు రూ.కోటి కేటాయించినట్టు ప్రాథమిక సమాచారం. ఈ మార్గాల నిర్మాణానికి తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సి ఉన్నందునే ఆ మాత్రమైనా నిధులు కేటాయించారని రైల్వే ప్రయాణీకులు పెదవి విరుస్తున్నారు. కొత్త రైళ్ల విషయాలు, రైళ్ల స్టాపింగ్ వసతి అంశాలు బడ్జెట్‌లో చూపకపోవడం ఈ ప్రాంత రైల్వే ప్రయాణీకుల దురదృష్టం. రాష్ట్ర విభజనతో రైల్వేపరంగా ఈ ప్రాంతానికి వసతులు మెరుగవుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి మొత్తానికి రేణిగుంట-గుంతకల్ రైలుమార్గం మరోమారు ఈ బడ్జెట్‌లో నిర్లక్షానికి గురైందనే చెప్పాలి. ఈ మార్గం పరిధిలోని పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా పార్లమెంటు కేంద్రం, రైల్వేకేంద్రమైన రాజంపేటలో నిలవని అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ వసతిని కూడా కల్పించుకోలేకపోవడం దురదృష్టకరం. మొత్తంపై రేణిగుంట-గుంతకల్ రైలుమార్గంలో బడ్జెట్‌లో ఎలాంటి లాభం కనిపించడం లేదన్న ఆరోపణలు ప్రయాణీకుల నుండి వినిపిస్తున్నాయి. అంతే తప్ప దక్షిణమధ్య రైల్వేలో అత్యంత ముఖ్యమైన రేణిగుంట-గుంతకల్ రైలుమార్గంలో బడ్జెట్‌లో కేటాయింపులు దారుణంగా మారాయి. ఈ మార్గం నిడివి చాలా ఉన్నప్పటికి రాజంపేట, కడప పార్లమెంటు స్థానాలతో పాటు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుత్తి, గుంతకల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా వస్తాయి. దీంతో ఈ రెండు పార్లమెంటు స్థానాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో పాటు అనంతపురం జిల్లాలో ఈ సెగ్మెంట్స్ కలిసే పార్లమెంటు సభ్యులు కూడా వస్తారు. దీంతో ఈ పార్లమెంటు సభ్యులు మాత్రమే ఈ మార్గం కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో ప్రతిమారు ఈ మార్గం అభివృద్ధికి సంబంధించి రైల్వేబడ్జెట్‌లో ఆశాజనకంగా కేటాయింపులు జరగని స్థితి నెలకొంటుంది. ఇతర మార్గాల్లో ఎంపిల సంఖ్య అధికంగా ఉంటుండడం వల్ల కూడా ఆ మార్గాల్లో తరచూ రైల్వే బడ్జెట్‌లలో కేటాయింపులు అధికంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలో డబ్లింగ్‌తో పాటు విద్యుద్దీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. కనుక డీజిల్ ఎలక్ట్రికల్ మల్లిపుల్ యూనిట్ (డిఇఎంయు) నెల్లూరు నుండి వయా రేణిగుంట మీదుగా కడప వరకు నడపగలిగే అవకాశమున్నప్పటికి ఆ ఊసే రైల్వేబడ్జెట్‌లో లేకపోవడం విచారకరం. ప్రస్తుతం రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలో తిరుపతి-హుబ్లీల మధ్య నడుస్తున్న ఇంటర్‌సిటీ ప్యాసింజర్ రైలుతోనే ఇక్కడి ప్రయాణీకులు సరిపెట్టుకునే దుస్థితి తప్పనిసరి పరిస్థితి నెలకొంటుంది. ఇతర మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లు అధికంగా నడుస్తున్నా రేణిగుంట-గుంతకల్ రైలుమార్గంలో సుదీర్ఘకాలం నుండి రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడుస్తుండడం విచారకరం. ఈ మార్గంలో కొత్త ప్యాసింజర్ రైళ్లకు బడ్జెట్‌లో అలాట్‌మెంట్లు వచ్చి ఉంటే ఈ మార్గంలో ప్రయాణం చేసే ప్రయాణీకులకు ఎంతో సౌకర్యంగా ఉండి ఉండేది. కనీసం షటిల్ రైలు సర్వీసులు ప్రవేశపెట్టి ఉన్నా ఈ ప్రాంత రైల్వే ప్రయాణీకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభించి ఉండేది. ఇక్కడి పండ్లతోటల రైతాంగం తమ పండ్లను ఎగుమతి చేసుకునేందుకు ఈ మార్గంలో వెళ్ళే రైళ్లల్లో పార్శిల్ వ్యాన్ వసతిని కల్పించమని దశాబ్దాలుగా చేస్తున్న విజ్ఞప్తి చెవిటివాని ముందు శంఖః ఊదిన చందంగా మారింది. అలాగే మచిలీపట్నం-తిరుపతిల మధ్య నడుస్తున్న రైలును కడప వరకు పొడిగించేందుకు నిర్ణయించి ఉంటే కడపజిల్లా ప్రయాణీకులకు సర్కార్ జిల్లాలకు రైలు వసతి ఏర్పడి ఉండేది. ఈ రైలు కాకపోయినా సర్కార్, కోస్తా జిల్లాలకు వెళ్ళే ఏ రైలునైనా కడప వరకు పొడిగించగలిగి ఉన్నా సర్కార్, కోస్తా జిల్లాలకు వెళ్లేందుకు ఇక్కడి రైలు ప్రయాణీకులు ఇబ్బందులు పడే పరిస్థితి తప్పి ఉండేది. ప్రస్తుతం కడపజిల్లా ప్రయాణీకులు రేణిగుంటకు చేరుకొని అక్కడి నుండి సర్కార్ జిల్లాలకు వెళ్ళాల్సిన దుస్థితి ఉంది. అమరావతి ఈ రాష్ట్రానికి నూతన రాజధానిగా నిర్మాణం జరుపుకుంటున్న తరుణంలో ఈ మార్గం నుండి నేరుగా నూతన రాజధాని అమరావతి ఉండే కోస్తా, సర్కార్ జిల్లాలకు నేరుగా రైలు సౌకర్యం కల్పించే విషయంలో తగు విధంగా పార్లమెంటు సభ్యుల స్పందించకపోవడం విచారకరం. ప్రతిమారు రేణిగుంట-గుంతకల్ రైలుమార్గం రైల్వేబడ్జెట్‌లో నిర్లక్ష్యానికి గురవుతుండడంపై సర్వత్రా ఇక్కడి ప్రయాణీకుల నుండి నిర్లక్ష్యం వ్యక్తమవుతుంది. రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలోని రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్స్‌లో నిలవని రైళ్లకు స్టాపింగ్ వసతి సమకూర్చుకోవడంలో కూడా ఇక్కడి పార్లమెంటు సభ్యులు సరైన దిశలో రాణించలేకపోయారు. న్యూఢిల్లీ-నిజాముద్దీన్‌ల మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు రాజంపేట రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్ వసతి సమకూర్చాల్సి ఉంది.
అయితే ఈ ఊసే రైల్వేబడ్జెట్‌లో లేకపోవడం ఇక్కడి ప్రయాణీకులను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పవచ్చు. మొత్తానికి రైల్వేబడ్జెట్ ఈ ప్రాంత రైల్వే అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగకరంగా లేదన్నది వాస్తవం. అయితే కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, తెలుగుదేశం పార్టీల నేతలు మాత్రం పలు కారణాల రీత్యా ఈ బడ్జెట్‌లో చూపని అనేక ఈ ప్రాంత రైల్వే అభివృద్ధిపనులైన స్టాపింగ్ వసతులు, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాలు త్వరలోనే వెల్లడవుతాయని నమ్మబలుకుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మూడు దశాబ్దాలుగా ఇక్కడి పార్లమెంటు సభ్యులు కారణంగా రైల్వే ప్రయాణీకులకు ఒరిగింది ఏమీ లేదనే చెప్పవచ్చు.
దశ,దిశ లేని వైఎస్సార్ కాంగ్రెస్
ఆంధ్రభూమి బ్యూరో
కడప,్ఫబ్రవరి 25: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి దశ, దిశ లేవని, ఆ పార్టీ అధినేత జగన్ ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా ప్రజలను రెచ్చగొడుతూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోజూస్తున్నారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధిని చూసి వైకాపా నేతలు తమ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కడపలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్ కేవలం ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకోవడంతో ఆ పార్టీ నేతలు రాజకీయ భవిష్యత్ కోసం తమ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలో చేరారని, మరి కొంతమంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బురదజల్లడమే జగన్ ధ్యేయమని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పిన జగన్... రానున్న రోజుల్లో ఏ పార్టీ చిరునామా గల్లంతు అవుతుందో వేచిచూడాలని అన్నారు. ఇప్పటివరకు జగన్ బెదిరింపులవల్లే భయపడి పలువురు నేతలు ఆ పార్టీలో కొనసాగరని, ఇక భరించే పరిస్థితి లేకే వారంతా టిడిపిలో చేరుతున్నారని మంత్రి గంటా పేర్కొన్నారు.

వైసిపి ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు
బద్వేలు, ఫిబ్రవరి 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమంగా సంపాదించిన సంపాదనతో వైసిపి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారని ప్రతిపక్ష నేత, వై ఎస్సార్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బద్వేలులో గురువారం ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం వైకాపా నుంచి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు దమ్ముంటే తక్షణమే రాజీనామా చేసి ఎన్నికల్లోకి దిగాలన్నారు. ప్రజల ఆశీస్సులున్నంతవరకు తమను, పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని తెలిపారు. పార్టీ ఏర్పాటుచేసినపుడు తాను, తన తల్లి మాత్రమే ఉన్నామని, ఆ తర్వాత ప్రజల అభిమానంతో 68 మంది ఎమ్మెల్యేలు గెలిచారన్నారు. ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లోనై పార్టీని వీడినంత మాత్రానా వైఎస్సార్‌పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. వైకాపా నేతలను ప్రలోభపెట్టడం చూస్తుంటే చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనంగా వుందన్నారు. ప్రతిపక్షపార్టీగా చంద్రబాబు ఆగడాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామనే దురుద్దేశ్యంతో ఈ విధంగా తమ పార్టీపై కక్షసాధింపు చర్యలు చేపట్టారని విమర్శించారు. ప్రజా సమస్యలపై అటు అసెంబ్లీలోను, ఇటు ప్రజల్లోను తమ వంతుగా ప్రతిపక్ష పార్టీగా నిలదీస్తూనే వుంటామని, తమ పార్టీని నైతికంగా దెబ్బతీసేందుకే చంద్రబాబు ఈ దురాగతాలకు పాల్పడుతున్నాడని, తనకు, తన తండ్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి ప్రజల ఆశీస్సులు, అభిమానం ఎన్నడూ వెన్నంటి వున్నదని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ డిసి.గోవిందరెడ్డి, ఎంపి అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ డాక్టర్ బి.మునెయ్య, వైస్ ఛైర్మెన్ సింగసాని గురుమోహన్, బికోడూరు జడ్పిటిసి ఎస్.రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.