కడప

జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 20: మండల స్థాయి అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పిటిసిలు, సర్పంచ్‌లు, అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి పిలుపునిచ్చారు. శుక్రవారం జెడ్పి సమావేశ మందిరంలో జరిగిన జిల్లాలోని ఎంపిడివోలు, ఇఓపిఆర్‌డిలు, పంచాయతీ అధికారుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవస్తంగా ఉందని అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా వైద్యం అందడం లేదని ఆయన అధికారుల దృష్టికి తెచ్చారు. జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నవౌతోందని, చెరువులు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు కలుషితం కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఖరీఫ్ సీజన్ వస్తోందని ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూడాలని ఆయన కోరారు. మధ్యాహ్న భోజనం పథకం సెలవుల్లో అమలు జరుగుతున్నా ఆ పథకం సక్రమంగా అమలుకావడం లేదని గ్రామాల్లో విద్యుత్ సమస్య ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లాకలెక్టర్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని అన్ని రాజకీయపార్టీల నేతలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మండలస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని, వేసవికాలంగా ప్రజలకు గ్రామీణ, పట్టణాలకు వచ్చేవారికి దాహార్తితీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 24 ప్రాంతాల్లో రవాణా ద్వారా, 31 ప్రాంతాల్లో తాగునీటి వ్యవసాయం అభివృద్ధికి నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రాంతంలో తాగునీటి సమస్య వచ్చినా రాతమూలకంగా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. వర్షాకాలం మొదలుకానుందని గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చి పారిశుద్ద్యం చేపట్టాలని ఎంపిడివోలను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ప్రతి వైద్యుడు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు అందుబాటులో ఆసుపత్రుల్లో ఉండాలని ఆయన కోరారు. చంద్రన్న సంచార వైద్యపథకం ద్వారా జిల్లాకు సంచార మెడికల్ వాహనాలు వస్తున్నాయని నెలకు రెండు పర్యాయాలు గ్రామాల్లో పర్యటించి వైద్యంతోపాటు వివిధ పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. నీరు-చెట్టు కార్యక్రమం అమలుకు ఎంపిడివోలే బాధ్యత వహించాలని , గ్రామాల్లో అభివృద్ధి పనులు పంచాయతీరాజ్ అధికారులు, ఎంపిడివోల దృష్టికి రాని పక్షంలో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో బాగా వెనుకబడివుందని, యువశక్తి, రైతుమిత్ర, స్వయం సహాయ సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజల్లో అవగాహన తీసుకుని రావాలని ఆయన కోరారు. జిల్లాలో ఈ ఏడాది రూ.62కోట్లతో 1128 అభివృద్ధి పనులు మంజూరుచేశామని , నాణ్యత ప్రమాణాలతో అ పనులు పూర్తి చేయాలని, ప్రతి అసిస్టెంట్ ఇంజనీరు 20పనులు తీసుకుని గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆయన కోరారు. జిల్లాలో 12వేల వర్మికంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో పంపిణీ చేయాలని ఆయన కోరారు. వాల్టా చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 12 మండలాల్లో కొత్తబోర్లువేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ ఇన్‌చార్జ్ సిఇఓ శే్వత తెవతియా, జెసి -2 శేషయ్య, డిప్యుటీ సిఇఓ ఖాదర్‌బాషా, సిపిఓ తిప్పేస్వామి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యనారాయణరాజు, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఇ శంకర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ జెడి ఠాగూర్ నాయక్, స్టెప్ సిఇఓ మమత, జిల్లాలోని ఎంపిడివోలు, ఏఓలు, ఈఓఆర్డిలు పాల్గొన్నారు.