కడప

అంటువ్యాధుల నివారణకు నూతన పరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 20: వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించడంతోపాటు డెంగ్యూ, విషజ్వరాలు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలకు శుక్రవారం ఫాగింగ్ మిషన్లు, స్ప్రే మిషన్లను తెప్పించి వాటి వినియోగం నిమిత్తం కలెక్టర్ కెవి సత్యనారాయణ ఎదుట ప్రదర్శించారు. పైరక్‌త్రియం, మలేషిన్, డిడి స్ప్రే మిషన్లను తెప్పించారు. ఈమిషన్లద్వారా జిల్లా మలేరియాశాఖ అధికారులు, సిబ్బంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో అపరిశుభ్రంగా ఉన్న చెత్తాచెదారం, మొలాషిన్, ప్రత్యేక మిషన్ల ద్వారా ఫాగింగ్‌చేయనున్నారు. డిడిసి స్ప్రే మిషన్ల ద్వారా గోడలకు అపరిశుభ్రత ప్రాంతాల్లో నీరు నిల్వవున్న చోట, ముఖ్యంగా గొట్టపు బావులు తదితర ప్రాంతాల్లో స్ప్రే చేసేందుకు ప్రణాళికలు తయారుచేశారు. మరో రెండు మూడురోజుల్లో జిల్లా వ్యాప్తంగా యంత్రాల పంపిణీ ముందస్తు చర్యలకు అధికారులు గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వైద్యాధికారులను రంగంలో దింపారు.