కడప

జిల్లాలో మినీమహానాడు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 23: తిరుపతిలో మరో మూడురోజుల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలో నియోజకవర్గాల వారీగా ముందస్తు మినిమహానాడు చేపట్టిన కార్యక్రమాలు నేతలు అనుకున్నదానికంటే అంచనాలకు మించి విజయవంతమయ్యాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మినిమహానాడు అనంతరం సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జిల్లా మినిమహానాడు కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ఈ కార్యక్రమాల్లో ప్రతిపక్షనేత, వైకాపా నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారు. చివరిరోజు కార్యక్రమానికి రాష్టమ్రంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్లా ఇన్‌చార్జ్‌లు, పార్టీలోని వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా నేతలు తరలివచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ జిల్లా అద్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) అధ్యక్షతన విజయవంతమయ్యాయి. ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, టి.జయరాములు, మాజీ ఎమ్మెల్సీ పుత్తానరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జి.వీరశివారెడ్డి, కె.విజయమ్మ, ఎన్.వరదరాజులురెడ్డి, ఆ పార్టీ మైదుకూరు ఇన్‌చార్జ్, టిటిడి డైరెక్టర్ పుట్టాసుధాకర్‌యాదవ్, మాజీ మంత్రులు పి.రామసుబ్బారెడ్డి, డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాషా, పి.బ్రహ్మయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సిఎం సురేష్‌నాయుడు, కృష్ణమూర్తి, విఎస్ అమీర్‌బాబు, జిలానీబాషా, సుభాన్‌బాషా, దివంగత నేత మాజీ మంత్రి పి.శివారెడ్డి సతీమణి లక్ష్మిదేవమ్మ, ఆయన తనయుడు పి.గిరిధర్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కుసుమకుమారి, దుర్గాప్రసాద్, బద్వేలు ఇన్‌చార్జ్ విజయజ్యోతి, ఎస్.ప్రసాద్‌బాబు, అతికారి వెంకటయ్య, తెలుగురైతు ప్రధానకార్యదర్శి శవానా సుబ్బనాయుడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షురాలు సుబ్బలక్షుమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా వైఎస్ జగన్‌ను టార్గెట్‌చేసుకుని ప్రసంగించడంతోపాటు జిల్లా అభివృద్ధికి పార్టీ తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం విడుదల చేయాల్సిన బడ్జెట్‌పై చరించారు.

సకాలంలో విత్తన పంపిణీ చేపట్టాలి

కడప,(క్రైమ్)మే 23: జిల్లాలో రాయితీ విత్తనాల పంపిణీ, ఖరీఫ్ పంటలకు రుణాలు మంజూరు చేయడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన ఏపి రైతు సంఘం ఆందోళనలో ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.రామసుబ్బారెడ్డి, చంద్ర, రమణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌లోనైనా ప్రభుత్వం సకాలంలో బ్యాంకు రుణాలు, అధిక మొత్తంలో రాయితీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు గత సంవత్సరాని కంటే అధికశాతం పంట రుణాలు ఇవ్వాలని , స్కేలాఫ్ ఫైనాన్స్ టెక్నికల్ కమిటీ సిఫార్సు మేరకు 30శాతం మించి అదనంగా ఇవ్వాలని గత సంవత్సరం తీసుకున్న రుణాలపై వడ్డీ మాత్రమే వసూళ్లు చేయాలన్న ఆదేశాలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలకు ఒకమారు రైతులతో బాండ్లు రాయించుకునే నాటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ సీజన్‌కు ఆసీజన్ రుణ మొత్తం మారుతుంటే, బాండు రాసే నాటికి ముడిపెట్టడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే బ్యాంకులు సకాలంలో లోన్లు రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాలు ఇప్పటికే మండల వ్యవసాయ కేంద్రాలకు చేరిపోయి పంపిణీకి సిద్దంగా ఉన్నాయని, ఇవన్నీ నాసిరకంగా ఉన్నాయని, కిలో వేరుశెనగ కాయలు రూ.47లకే లభ్యవౌతుంటే , 33.3శాతం రాయితీతో ఇచ్చే విత్తనాలు రూ.50లు పడుతున్నాయని విమర్శించారు. 51 మండలాల్లో కరవు విలయ తాండవం చేస్తోందని సూక్ష్మసేద్యపు పరికరాలు 20 ఎకరాలు లోపు రైతులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని, రైతుల రుణమాఫీ చేసి కొత్తరుణాలు మంజూరు చేయాలని ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జెసికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపి రైతు సంఘం జిల్లా నాయకులు మల్లికార్జునరెడ్డి, బాలచంద్రయ్య, రంగారెడ్డి, భాస్కర్‌నాయుడు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.