కడప

కడప పోలీసుల పనితీరు భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప జిల్లా పోలీసుశాఖ పనితీరు చాలా బాగుందని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠిని డిజిపి జెవి రాముడు ప్రశంసించారు. గురువారం జెడ్పి సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో జెవి రాముడు ఎర్రచందనం అక్రమరవాణా, నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసుల పనితీరు బాగుందని, దీన్ని ఇలాగే కొనసాగిస్తే పోలీసుశాఖకు మరింత మంచిపేరు వస్తుందన్నారు. ఎర్రచందనం అక్రమరవాణా ప్రత్యేక బృందాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఎర్రచందనం దుంగలను ఎంతోప్రతిభ కనబరచి చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రశంశాపత్రాలు, మెమెంటోలు ప్రదానం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణ నిరోధక బృందంలో పనిచేస్తున్న చిట్వేలికి చెందిన కానిస్టేబుల్ ప్రసాదనాయుడు రెండునెలల క్రితం కర్నాటకలో విధినిర్వహణలో మరణించాడు. కానిస్టేబుల్ ప్రసాద్ నాయుడు తల్లిదండ్రులకు జెవి రాముడు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా డిజిపి రాముడు ఎదుట వారు భోరున విలపించారు. మీ కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరచిన ఓఎస్‌డి (ఆపరేషన్స్) సత్యయేసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, ఎస్‌బి డిఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్ డిఎస్పీ మురళీధర్, సిఐలు రాజేంద్రప్రసాద్, శ్యామ్‌రావు, పురుషోత్తంరాజు, సదాశివయ్య, శ్యాంసుందర్, ఎస్‌ఐలు రాజరాజేశ్వరరెడ్డి, శివశంకర్, హేమకుమార్, నాగరాజు, రోషన్, అన్సర్‌బాష, హరిప్రసాద్, మహబూబ్‌బాషా, ఫారెస్టు అధికారులకు డిజిపి ప్రశంశాపత్రాలతోపాటు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజి వేణుగోపాల్, డిఐజి రమణకుమార్, జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి, టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు, డిసిఎఫ్ మూర్తి, జిల్లాలోని డిఎస్పీలు , సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సాయి సైకిలెక్కడంతో టిడిపిలో జోష్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 24: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడు, సీనియర్ కాంగ్రెస్ నేత , కేంద్రమాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. సీమజిల్లాల్లో కాపుల ప్రతినిధిగా ఉన్న సాయిప్రతాప్ చేరికతో టిడిపికి అదనపు బలం చేకూరింది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు ఎంపిగా గెలుపొందడం, యుపిఏ ప్రభుత్వంలో కేంద్ర ఉక్కుసహాయక మంత్రిగా పనిచేసిన సాయిప్రతాప్ వివాదరహితుడు, మృదుస్వభావిగా సీమలో పేరుంది. రాష్ట్ర విభజనతో ఆయన అప్పటి పరిస్థితుల దృష్ట్యా రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్‌కు ఎంపి అభ్యర్థిగా సాయి పోటీ చేయలేదు. బిజెపితో టిడిపి పొత్తుపెట్టుకోవడంతో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి పోటీచేసి ఓటమిపాలయ్యారు. దీంతో అప్పట్లో తెలుగుదేశంలో చేరే నిర్ణయాన్ని సాయి తాత్కాలికంగా విరమించుకున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, చైర్మన్‌ను నియమించడంతోపాటు కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతో టిడిపిలో కాపులకు భవిష్యత్ ఉంటుందని భావించి ఆయన గురువారం లాంఛనంగా టిడిపిలో చేరారు. దీంతో జిల్లాలో కాపులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన మరికొందరు టిడిపిలో చేరనున్నారు. ఈ పరిణామం ప్రతిపక్ష నేత జగన్‌కు సొంత జిల్లాలో భారీ షాక్‌గా విశే్లషకులు భావిస్తున్నారు.

పదిలో జోరుగా మాస్ కాపీయింగ్
చింతకొమ్మదినె్న, మార్చి 24: చింతకొమ్మదినె్నలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు జోరుగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. అయినా ఇన్విజిలేటర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్ స్కూలు విద్యార్థులతోపాటు బుగ్గలేటపల్లి విష్ణు విద్యామందిర్ హైస్కూల్, బయనపల్లె వెంకటేశ్వర ఉన్నతపాఠశాల విద్యార్థులు మొత్తం 333 మంది పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలకు గాను 15 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటుచేశారు. అయితే విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ప్రైవేట్ యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యిరూపాయల నుంచి రెండువేల రూపాయల వరకు వసూలుచేసి విద్యార్థులకు పరీక్షల్లో సహకరించేందుకు గిఫ్టులు, నగరంలోని హోటళ్లలో డిన్నర్లు ఏర్పాటు చేశారు. బుధవారం హోలీ పండుగ పర్వదినం సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో భారీగా డిన్నర్ ఏర్పాటు చేయడంతోపాటు గిఫ్టులు కూడా అందజేశారు. పోలీసులకు కూడా భారీ మొత్తం ముట్టచెప్పినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పరీక్ష ప్రారంభమైన 20నిమిషాలకే ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపుతున్నారు. కాపీ అందించేవారు గోడలపై నుంచి లోపలకు వస్తున్నా పోలీసు సిబ్బంది కానీ, ఇన్విజిలేటర్లు కానీ మిన్నకుండటం గమనార్హం. హింది పరీక్షలో పూర్తిగా ఇన్విజిలేటర్లే విద్యార్థులకు సహకరించారు. ఇన్విజిలేటర్ల సాచివేత వైఖరిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలా మాస్‌కాపీయింగ్‌కు సహకరించడం వల్ల తెలివైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని వారు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోతే తాము జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదుచేస్తామని పలువురు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర అధికంగా ఉన్నందున ముందుగా వారిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఇద్దరు ఇన్విజిలేటర్లు రిలీవ్...
* ఇద్దరు ఎంఇఓలకు మెమోలు
కడప,(రూరల్)మార్చి 24: జిల్లావ్యాప్తంగా గురువారం జరిగిన 10వ తరగతి పరీక్షలో బద్వేలులో ఒకరు, వేంపల్లెలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. అదేవిధంగా ఇద్దరు ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల నుంచి రిలీవ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 37వేల 132 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సివుండగా, 36వేల 960 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ 59 పరీక్షా కేంద్రాలను, డిఇఓ 5పరీక్షా కేంద్రాలను , అబ్జర్వర్ ఐదు పరీక్షా కేంద్రాలను వెరసి మొత్తం 69 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పోరుమామిళ్ల, బి.కోడూరు ఎంఇఓలకు మెమోలు జారీచేసినట్లు డిఇఓ పేర్కొన్నారు. పరీక్షల సమయంలో పోరుమామిళ్ల ఎంఇఓ మురళీదేవి తన ఫోన్ స్విచాఫ్ చేశారని, అలాగే బి.కోడూరు మండల విద్యాశాఖాధికారి పరీక్షల సమయంలో హెడ్‌క్వార్టర్‌లో లేకుండా బద్వేలులో ఉన్నందున ఇద్దరికీ మెమోలు జారీ చేస్తున్నామని డిఇఓ తెలిపారు. పరీక్షల సమయం కదా అని చాలా మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తాను పోరుమామిళ్లలోని జెడ్పి ఉర్దూ ప్రాధమికపాఠశాలను సందర్శించినపుడు అక్కడ పనిచేస్తున్న మహబూబ్ సయ్యద్ హాజరుపట్టికలో సంతకం చేసి పాఠశాలలో లేడని , అలాగే హెడ్‌మాస్టర్ మహబూబ్‌చాంద్ ఉదయం 10.30గంటల వరకు హాజరువేయలేదని వారిద్దరికీ మెమోలు జారీచేస్తున్నామన్నారు. ఎంఇఓలు బాధ్యతగా పనిచేయాలని, అప్పుడే ఉపాధ్యాయులు కూడా సక్రమంగా పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఉంటే జబ్బులు దరిచేరవు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 24: ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉన్నపుడే అన్ని జబ్బులకు దూరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ కెవి రమణ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జిల్లా క్షయ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ధనం, పలుకుబడి ఉన్నప్పటికీ ఆరోగ్యం సరిగా లేకుంటే వాటిని సద్వినియోగం చేసుకోలేమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చి వివిధ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి ప్రజల ఆరోగ్యం కోసం ఈ-ఔషది కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. కడప జిల్లా ఈ-ఔషది కార్యక్రమంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు మన భవిత, పారిశుద్ద్యం, ఆసుపత్రి అభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాలు, పోలియో చుక్కలు, క్షయవ్యాధి నియంత్రణ వంటి కార్యక్రమాలపై కళాజాతలు ద్వారా సామాజిక కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటించాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు మందులు క్రమం తప్పకుండా వాడితే రోగం నయమవుతుందన్నారు. డిఎంహెచ్‌ఓ సత్యనారాయణరాజు మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు పారిశుద్ద్యం పనులు చేపడుతున్నారన్నారు. ఆర్‌డి డాక్టర్ దశరధరామయ్య మాట్లాడుతూ క్షయ వ్యాధి గ్రస్తులు మందులు సక్రమంగా వాడితే రోగం త్వరగా నయమవుతుందన్నారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ అరుణ సులోచన, డిఐఓ డాక్టర్ నాగరాజు, క్షయ వ్యాధి నియంత్రణలో చురుకుగా పాల్గొన్న రామాంజనేయరెడ్డి, సుబ్రమణ్యం, జయప్రకాష్, బలరామయ్య, చాంద్‌బాష, బేగ్, మేరీలకు జిల్లా కలెక్టర్ మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.

స్కూల్ వ్యాన్ కిందపడి విద్యార్థిని మృతి
సంబేపల్లె, మార్చి 24: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మోటకట్ల శివాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భావన (7) అనే విద్యార్థిని గురువారం మృతి చెందింది. మోటకట్లకు చెందిన వెంకట్రామిరెడ్డి కుమార్తె భావన రాయచోటి పట్టణంలోని నేషనల్ హైస్కూల్ నందు ఫస్ట్‌క్లాస్ చదువుతోంది. రోజుమాదిరిగానే బడి ముగించుకొన్న విద్యార్థులను స్కూల్ బస్సులో దించిన డ్రైవర్ తిరిగి బస్సును తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో భావన బస్సు ఎదుట ఉండటం గమనించని డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసి ముందుకు వెళ్లడంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. విద్యార్థిని మృతుని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు, ఆప్తుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడని ఎస్‌ఐ రఘురాం తెలిపారు
పాతకక్షలతో దాడి - ఇద్దరికి తీవ్రగాయాలు
పుల్లంపేట, మార్చి 24:మండలంలోని రంగంపల్లె పంచాయితీ వడ్డెపల్లెలో బుధవారం అర్ధరాత్రి ఒక వర్గంకు చెందిన వ్యక్తులు పాతకక్షలతో రాళ్లతో, కట్టెలతో దాడికి పాల్పడగా శ్రీనివాసులు, వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. . వీరు ఇరువురు చిన్నాన్న, పెద్దనాన్న కుమారులు. గురువారం తమ్ముని కుమార్తెకు వివాహం జరగగా విందు సామాగ్రిని అనంతంపల్లె నుండి ఆటోలో తీసుకుని వస్తుండగా అనంతంపల్లె పొలాలలో కాపుకాసిన పల్లెపు ధనుంజయ, హరీష్, దినేష్, రెడ్డయ్య రాళ్లు, కట్టెలతో తీవ్రంగా కొట్టారు. సృహా తప్పి పడిన వారిన మృతి చెందారని వదిలేసి వెళ్లారు.