కడప

వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, మే 24:నందలూరు శ్రీ సౌమ్యనాథాలయ ఆవరణంలో మంగళవారం యల్లంపేట శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్ సొసైటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా, వైభవంగా నిర్వహించారు. తొలుత ఆగమ శాస్త్ర పండితులు అఖిల దీక్షితులు పెద్దింటి శ్రీనివాసాచారి రుక్మిణీ, సత్యభామ సమేతంగా వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు అభిషేకాది పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై దేవేర్లతో స్వామివారిని ఆసీనులు చేశారు. తొలుత గణపతి, విష్వసేన పూజలు నిర్వహించి, వైఖాసన ఆగమ శాస్త్ర ప్రకారం కల్యాణ తంతు సాగించారు. గతంలో యల్లంపేట గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం సోమశిల ముంపుకు గురవడంతో అక్కడ నుండి ఉత్సవమూర్తులను ఒంటిమిట్టకు తరలించి కల్యాణం నిర్వహించే వారు. ఈ సంవత్సరం నందలూరు సౌమ్యనాథ ఆలయంలో ఆ గ్రామస్థులు లక్షలాది రూపాయల వ్యయంతో స్వామివారి కల్యాణోత్సవాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ విశేషాలను పండితులకు భక్తులకు వివరిస్తూ గోవింద నామస్మరణల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, తహశీల్దార్ భవాని, ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన్ యెద్దల సుబ్బరాయుడు, అన్నదాన సేవా ట్రస్టు నిర్వాహకులు పల్లె సుబ్రమణ్యం, జంగంశెట్టి సుబ్రమణ్యంతో పాటు టిడిపి నాయకులు ట్రాన్స్‌ఫార్మర్ శ్రీనివాసులు, ఆలయ ఇఓ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తాదులకు యల్లంపేట వ్యాస్తవులు అన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించారు. యల్లంపేట వాసులకు ఆలయ నిర్వాహకులు సహయ, సహకారాలను అందజేశారు. అనంతరం స్వామివారిని దేవేర్లతో ప్రత్యేక పల్లకీపై మాడ వీధులలో మేళ తాళాలతో ఘనంగా ఊరేగించారు. హరే రామ, హరే కృష్ణ సంఘం సభ్యుల భజనలు భక్తులను అలరించాయి. పండరీ భజనలు, నృత్యగాన కార్యక్రమాలను అందరినికి అలరించాయి. ఈ సందర్భంగా యల్లంపేట గ్రామస్తులు ఆలయ నిర్వాహకులకు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.