కడప

రాయచోటిలో కేబుల్‌వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 26: రాయచోటిలో తెలుగుదేశం పార్టీ అగ్రనేతల మధ్య కేబుల్‌వార్ మొదలైంది. మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడు తనయులు కొన్ని దశాబ్దాల కాలంగా రాయచోటి పట్టణంలో డిష్, కేబుల్ ఏర్పాటుచేసి పట్టణమంతా వారే కేబుల్ నిర్వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూసిన మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి భారీ పెట్టుబడులతో కేబుల్‌ను ఏర్పాటుచేస్తున్నారు. లక్ష జనాభా కలిగిన రాయచోటి పట్టణంలో ముందస్తు రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అసలే పాలకొండ్రాయుడు, రమేష్‌రెడ్డిల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే ఉండటం, దశాబ్దాలకాలం నుంచి రాజకీయ శతృత్వం ఏర్పడి వారి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లెను రాయచోటికి కలపడంతో రమేష్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటుచేసుకుని పాలకొండ్రాయుడును ఢీ కొనేందుకు ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలిగి రాజకీయానే్న శాసించే రాయుడుకు వయోపరిమితి, కుమారుల్లో అనైక్యతతో సతమత వౌతున్న రాయుడుకు రమేష్‌రెడ్డి కేబుల్ ఏర్పాటుతో పాలకొండ్రాయుడు అనుచరగణం సమాలోచనలో పడ్డారు. ఇదిలా ఉండగా కేబుల్ ఏర్పాటుపై రాయుడు అనుచరుల్లో కొంతమంది రమేష్‌రెడ్డిని సంప్రదించి కొన్ని ప్రాంతాలకే రమేష్‌రెడ్డిని కేబుల్‌ను పరిమితం చేసుకోవాలని కోరగా ఆయన అందుకు ససేమిరా అంటూ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కేబుల్‌ను ఏర్పాటు చేనని చెప్పుకుంటున్నట్లు తెలిసింది. అలాగే 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదని చేల్చడంతో ఎలాగూ లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఏర్పాటు కాదని, రాయచోటిపై రమేష్‌రెడ్డి దృష్టిసారించి పావులు కదుపుతూ తనకంటూ ప్రత్యేక వర్గం ఏర్పాటులో భాగంగానే కేబుల్‌ను ఏర్పాటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాయుడు అనుచరులు కూడా రమేష్‌రెడ్డి చేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేబుల్ రేట్లలో కూడా రమేష్‌రెడ్డి భారీ రాయితీలు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టణంలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండటంతో ఈ కేబుల్ ఏర్పాటు ఎంతవరకు రమేష్‌రెడ్డికి అనుకూలిస్తుందోనని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద రాయచోటిలో తాజాగా తెలుగు తమ్ముళ్ల మధ్య కేబుల్‌వార్ మొదలుకావడంతో ఈపరిస్థితులు ఎంతవరకు దారితీస్తుందో కాలమే నిర్ణయించాల్సివుంది.