కడప

గండికోట డ్యామ్‌ను సందర్శించిన జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, మే 27: గాలేరు-నగరి సృజలశ్రంతిలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టును కడప జెసి శే్వతాటియోటియా శుక్రవారం సందర్శించారు. ఆమె ముందుగా ప్రాజెక్టు పరిదిలోని కొండలను పరిశీలించి అక్కడి నుండి గండికోట డ్యామ్‌కు చేరుకొని ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారులతో ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత నీటిమట్టం, ఎన్నివేల ఎకరాలకు తాగు, సాగునీరు అందుతుంది, ఎత్తిపోతల వివరాలతోపాటు పలు విషయాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు, జమ్మలమడుగు ఆర్డీ ఓ వినాయకం, నీటిపారుదలశాఖ డి ఇ గురుప్రసాద్, చంద్రశేఖర్, కొండాపురం తహశీల్దార్ ఉదయసంతోష్, ఆర్ ఐ రాజేశ్వరి పాల్గొన్నారు.