కడప

గండి క్షేత్రంలో హనుమాన్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాయపేట, మే 27:జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వా మి జయంతి మహోత్సవాలు 29 నుండి ప్రారంభం కానున్నట్లు గండి దేవస్థాన సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. స్వస్తిశ్రీ దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ బహుళ అష్టమి ఆదివారం 29వ తేదీ నుండి వైశాఖ బహుళ దశమి మంగళవారం పూర్వభద్ర నక్షత్ర జన్మతిథిలో 31వ తేదీ వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 29న సాయంత్రం ప్రారంభమై అను ఘ్న, వివ్య పూజ, పుణ్యాహవాచన ము, రక్షాబంధనం, నందాదీప స్థాపనము, మృత్సంగ్రహణం, అంకురారోహణము, అగ్నిప్రతిష్ఠాపనం, వాస్తు హోమము, 30న సోమవారం కుంభ కలశా ప్రతిష్ఠాపన, కలశారాధన, అష్టదిక్పాలక, కలశ ప్రతిష్ఠ, దీక్షా హో మము, మన్వషుక్, సుందరకాండ హోమము, సమగ్రాయన పారాయణము, స్నపన తిరుమంజనము, లగపూర్ణాహుతి, దీక్షాహోమము, మూలమంత్ర హో మము, వాస్తు మండల హోమం, మన్నిసుక్తహోమం, 31న సుందరకాండ హో మం, మన్నసుక్త పవనా హోమం, మూలమంత్ర హో మం, మహాపూర్ణాహుతి, మహాకుంభ ఉ ద్యాపన కుంభపోక్షణ, అంజన్న మూలవిరాట్‌కు మహాస్నపన తిరుమంజనం, ప్రత్యేక అలంకరణ, తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున భక్తాదుల 29 నుండి జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో పాల్గొనాలని వారు పేర్కొన్నారు.