కడప

అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 2: దేశంలోనే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ముందుచూపుతో అన్నిరంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తున్నారని, జిల్లాలోని ప్రతి పౌరుడు నడుం బిగించాలని, అంకితభావంతో ప్రతి ఒక్కరు పనిచేస్తే బాబుకలలు ఫలిస్తాయని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా గురువారం నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన అధికార, అనధికార సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం రాష్టవ్య్రాప్తంగా అధికారులు, అనధికారులు, పౌరులచే చేపట్టిన ప్రతిజ్ఞను ఏకకాలంలో ఆయన ప్రతిజ్ఞ చేయించి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుసంవత్సరాలు క్రితం సమైక్యాంధ్ర రెండుగా విభజింజబడిందన్నారు. ఎంతో మంది త్యాగఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని దీంతో రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండేదని, బాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుచేయాలని, తెలుగుమాట్లాడే వారు ఒకే రాష్ట్రంలో ఉండాలనే నిర్ణయం మేరకు 1954లో పొట్టిశ్రీరాములు త్యాగఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందని , 2014లో కొందరి స్వార్థ ప్రయోజనాలకోసం సమైక్యంగా ఉన్న రాష్ట్రం రెండుగా విభజించబడిందన్నారు. హేతుబద్ధంగా ఆశాజనకంగా విభజన జరగలేదని, 10 జిల్లాలు తెలంగాణకు, 13 జిల్లాలో ఏపికి రాగా రాజధాని తెలంగాణకు వెళ్లిందని, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయిందన్నారు. ఆదాయం లేని రాష్ట్రంగా ఏపి నిల్వగా ఇప్పటి ప్రభుత్వం నిరాశ లేకుండా ఏపిని సుసంప్పనం చేసేందుకు పునఃనిర్మాణం చేసేందుకు సంకల్పించిందన్నారు. రెండుసంవత్సరాల్లో అభివృద్ధి రేటు పెరగిందని, వ్యవసాయాభివృద్ధి రెండుశాతం ఉంటే 8శాతానికి పెరిగిందన్నారు. సర్వీసు రంగంలో 12శాతం అభివృద్ధి, పరిశ్రమల రంగంలో 8.5శాతం వృద్ది ఉన్నందున ఎక్కువ పరిశ్రమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. భారతదేశంలో 51శాతం యువత ఉంటే ఏపిలో 60శాతం ఉందని, రాష్ట్రానికి 900 కి.మీ.తీర ప్రాంతం, అక్కడ పరిశ్రమలు తెస్తే పేదవారు అభివృద్ధి చెందగలరని పరిశ్రమల రంగాన్ని వేగవంతం చేసే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. కడప జిల్లాను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కడపలో 600మి.మీ. వర్షపాత నమోదైందని, కడప నగరంలోనే 60మి.మీ.నమోదుకాగా, ఖరీఫ్‌కు శుభపరిణామమన్నారు. సమావేశానికి హాజరైన మాజీ మంత్రి డాక్టర్ ఖలీల్‌బాషా మాట్లాడుతూ ఏపికి రెండుసార్లు తీవ్రనష్టం జరిగిందని, రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చి అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఆదాయం లేని రాష్ట్రంగా ఏపి ఉందన్నారు. ప్రజల సహకారం, పట్టుదలతో అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంజనీరింగ్ కళాశాలలు తెచ్చి అభివృద్ధిచేశారన్నారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా ఏర్పడిన సమైక్యాంధ్ర విడిపోయినప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకలు తెలంగాణ జరుపుకుంటే , ఏపికి ప్రత్యేక అవతరణ దినోత్సవం ఉండదని నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు చేస్తుంటామని , ముఖ్యమంత్రికి తెలిపినట్లు వివరించారు. ఈసమావేశంలో 11 గంటలకు ఏపి నవనిర్మాణ దీక్ష లక్ష్యాలు సాధిద్దామని, లక్ష్యసాధనకు సమర్పరణ భావంతో నిష్టతో, త్రికరణశుద్దితో కృషి చేస్తామని, ప్రజలు, అధికారులు, అనధికారుల చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈసమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష చేపట్టి విజయవాడ నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఉత్తేజభరితమైన సందేశాన్ని టివిలద్వారా లైవ్ కాస్ట్ చేయగా దాన్ని ప్రజలకు విన్పించారు. ఈకార్యక్రమంలో పాఠశాలల విద్యార్థినీలు దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో జాయింట్‌కలెక్టర్ శే్వత, జెసి-2 శేషయ్య, డిఆర్‌ఓ సులోచన, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, ఎస్.గోవర్దన్‌రెడ్డి, నాయకులు సుభాన్‌బాషా, లక్ష్మిరెడ్డి, అమీర్‌బాబు, పీరయ్య పాల్గొన్నారు.